WATCH: గొలుసును లాగబోయాడు..అడ్డుకోవడంతో.. మహిళను పొడిచి చంపిన దొంగ.. వీడియో
Woman stabbed by chain snatcher: దేశ రాజధాని ఢిల్లీలో దారుణమైన సంఘటన వెలుగులోకి వచ్చింది. రోడ్డు మీద వెళ్తున్న ఓ మహిళను దొంగ పొడిచి చంపాడు. ఈ ఘటన వాయువ్య ఢిల్లీలోని..
Woman stabbed by chain snatcher: దేశ రాజధాని ఢిల్లీలో దారుణమైన సంఘటన వెలుగులోకి వచ్చింది. రోడ్డు మీద వెళ్తున్న ఓ మహిళను దొంగ పొడిచి చంపాడు. ఈ ఘటన వాయువ్య ఢిల్లీలోని ఆదర్శనగర్‌లో చోటుచేసుకుంది. తన రెండేళ్ల బిడ్డతో కలిసి రోడ్డు మీద వెళ్తున్న ఓ 25 ఏళ్ల మహిళను ఓ చెయిన్ స్నాచర్ పొడిచి చంపాడు. ఈ సంఘటన అంతా అక్కడున్న సీసీటీవీ కెమెరాలో రికార్డయింది. ఈ ప్రాంతంలో ఇలాంటి ఘటన జరగడం రెండు రోజుల్లో ఇది రెండోసారని స్థానికులు ఆగ్రహం వ్యక్తచేస్తున్నారు. అయితే దేశ రాజధానిలో ఇలాంటి సంఘటనలు వెలుగులోకి రావడం పట్ల పలువురు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు.
శనివారం వాయువ్య ఢిల్లీలోని ఆదర్శనగర్ ప్రాంతంలో శనివారం రాత్రి 9.30 గంటల ప్రాంతంలో సిమ్రాన్ అనే మహిళ తన బిడ్డను తీసుకొని మార్కెట్‌కు వెళ్లి వస్తోంది. ఈ క్రమంలో ఆమె మెడలో ఉన్న గొలుసుపై కన్నెసిన దొంగ.. ప్లాన్ ప్రకారం లాగడానికి ప్రయత్నించాడు. దీంతో ఆమె పక్కనున్న మహిళ ప్రతిఘటించింది. ఈ క్రమంలో ఆ మహిళ చేతుల్లో ఉన్న బిడ్డ కిందపడింది. ఆ వెంటనే దొంగను పట్టుకునేందుకు మహిళ ప్రయత్నించింది. ఈ క్రమంలో చైన్ స్నాచర్ తన వెంట తెచ్చుకున్న కత్తితో సిమ్రాన్‌ను పొడిచాడు. ఈ ఘటన అంతా అక్కడున్న సీసీ టీవీలో రికార్డయింది.
ఓ వ్యక్తి మహిళ మెడలో ఉన్న గొలుసు లాగడానికి ప్రయత్నించడం వీడియోలో స్పష్టంగా కనిపిస్తోంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు పది బృందాలను ఏర్పాటు చేసి నిందితుడి కోసం గాలిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి ఇంకా ఎవరినీ అరెస్ట్ చేయలేదు. రెండురోజుల క్రితం ఈ ప్రాంతంలో ఇలాంటి ఘటనే జరగడం.. మళ్లీ అలాంటి ఘటనే పునరావృతం కావడం పట్ల స్థానికులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు.
दिल्ली के आदर्श नगर में स्नैचिंग का विरोध करने पर गोद मे बच्चा लेकर जा रही महिला के गर्दन पर बदमाश ने दो बार चाकू से किया वार, अस्पताल में महिला की मौत। दिल्ली में आए दिन होती है स्नैचिंग की वारदात, इस वारदात ने फिर उठाए पुलिस पैट्रोलिंग पर सवाल। @indiatvnews @DelhiPolice pic.twitter.com/gsrlIr18la
— Abhay parashar (@abhayparashar) February 28, 2021
Also Read: