AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Mann Ki Baat: ఆత్మనిర్భర్ భారత్ అనేది ప్రభుత్వ పథకం కాదు.. జాతీయ స్ఫూర్తి: ప్రధాని మోదీ

PM Narendra Modi Mann Ki Baat: ఆత్మనిర్భర్ భారత్ అనేది ప్రభుత్వ పథకం కాదు.. ఇది జాతీయ స్ఫూర్తి అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. భారత స్వయం సమృద్ధి కోసం దేశీయ..

Mann Ki Baat: ఆత్మనిర్భర్ భారత్ అనేది ప్రభుత్వ పథకం కాదు.. జాతీయ స్ఫూర్తి: ప్రధాని మోదీ
Shaik Madar Saheb
|

Updated on: Feb 28, 2021 | 1:26 PM

Share

PM Narendra Modi – Mann Ki Baat Highlights: ఆత్మనిర్భర్ భారత్ అనేది ప్రభుత్వ పథకం కాదు.. ఇది జాతీయ స్ఫూర్తి అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. భారత స్వయం సమృద్ధి కోసం దేశీయ ఉత్పత్తులను ఉపయోగించాలని కోరారు. దేశీయ ఉత్పత్తులను ప్రజలంతా గర్వంగా భావించినప్పుడే.. ఆత్మనిర్భర్ భారత్ కేవలం ఆర్థిక కార్యక్రమంగానే కాకుండా.. జాతీయ స్ఫూర్తిగా మారుతుందని ప్రధాని మోదీ వెల్లడించారు. ఆదివారం జరిగిన మన్ కి బాత్ 74వ ఎపిసోడ్ కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ.. దేశ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ పలు కీలక అంశాలను ప్రస్తావించడంతోపాటు.. పలు సూచనలు కూడా చేశారు.

నీటి వనరులను సంరక్షించుకోవాలి.. నీటి వనరుల పరిరక్షణ మనందరి బాధతని ప్రధాని గుర్తుచేశారు. ఇక వచ్చేది వేసవికాలం కావడం వల్ల జల వనరులను సంరక్షణ, ఇంకుడు గుంతల నిర్మాణం, భూగర్భ జల వనరులను పెంపొందించుకోవడం, పూడిక తవ్వకాల గురించి ప్రదాని దేశ ప్రజలకు సూచనలు చేశారు. ప్రతి గ్రామంలోనూ అందుబాటులో ఉన్న నీటి కుంటలు, చెరువులను పునరుద్ధరించుకోవాల్సిన అవసరం ఉందని సూచించారు. వేసవి కాలం ముగిసే వరకూ నీటి వనరులను కాపాడుకోవాలని పేర్కొన్నారు. ఈసారి హరిద్వార్‌లో కుంభమేళ జరగనుందని పేర్కొన్నారు. నీటి సంరక్షణ బాధ్యత మనందరం అర్థం చేసుకోవాలని సూచించారు. తమిళనాడులోని తిరువణ్ణామలైకి చెందిన కొందరు గ్రామస్తులు.. జల వనరుల పరిరక్షణ కోసం చేసిన కార్యక్రమాలను మోదీ ప్రస్తావించారు.

శాస్త్రీయ రంగంలో అద్భుత పురోగతి.. సంత్ రవిదాస్ చేసిన బోధనలను మోదీ ప్రస్తావించారు. దేశ యువతిపై సంత్ రవిదాస్ ప్రభావం చాలా ఉందని.. ఆయన జీవితాన్ని స్ఫూర్తిగా తీసుకుని ముందుకు సాగాలని సూచించారు. జాతీయ సైన్స్ దినోత్సవాన్ని పురస్కరించుకుని కేరళకు చెందిన యోగేశ్వరన్.. నమో యాప్‌పై రాసిన అంశాన్ని కూడా నరేంద్ర మోదీ గుర్తు చేశారు. శాస్త్రీయ రంగంలో దేశం అద్భుతమైన పురోగతిని సాధిస్తోందన్నారు. సైన్స్‌ను ఆధారంగా చేసుకుని హైదరాబాద్‌కు చెందిన చింతల వెంకటరెడ్డి వ్యవసాయ రంగంలో సాధించిన విజయాలను మోదీ ప్రస్తావించారు. ఆయనకు పద్మశ్రీ అవార్డును అందించినట్లు గుర్తుచేశారు.

తమిళం నేర్చుకోలేకపోయా.. తమిళం.. ప్రపంచంలోనే అత్యంత ప్రాచీన భాష అని ప్రధాని అన్నారు. ఆ భాషకు ఎంతో చరిత్ర, ప్రాధాన్యత ఉందని చెప్పారు. తమిళం భాషను నేర్చుకోవడానికి తాను చాలా ప్రయత్నించానని చెప్పుకొచ్చారు. అయినప్పటికీ.. దాన్ని నేర్చుకోలేకపోతున్నానని నరేంద్ర మోదీ తెలిపారు. తమిళం నేర్చుకోలేకపోతోన్నందుకు చింతిస్తున్నానని అన్నారు. జీవితంలో తాను కోల్పోయినది ఏదైనా ఉందీ అంటే- అది తమిళభాషను నేర్చుకోలేకపోవడమేనని మోదీ మన్ కీ బాత్‌లో వివరించారు.

Also Read:

రేపే కరోనా భారీ వ్యాక్సినేషన్ డ్రైవ్.. మీ ప్రాంతాల్లో ఉన్న ప్రైవేటు ఆసుపత్రుల్లో కూడా.. వివరాలు తెలుసా?

బెంగాల్ ఎన్నికల్లో క్రికెట్ దాదా ఎవరికి జైకొట్టేను.. సౌరవ్ గంగూలీ పొలిటికల్ ఎంట్రీపై సర్వత్రా ఉత్కంఠ..!