Guntur boy Kidnap Case: పెదకాకానిలో రెండేళ్ల బాలుడి కిడ్నాప్ కేసును ఛేదించిన పోలీసులు.. ఆ మహిళదే స్కెచ్
Boy Kidnap In Pedakakani: గుంటూరు జిల్లాలో రెండు సంవత్సరాల బాలుడి కిడ్నాప్ కేసు సుఖాంతమైంది. ఈనెల ఇరవై నాలుగవ తేదీన పెద్దకాకాని మండల పరిధిలోని బాలుడిని విజయవాడకు...
Guntur boy Kidnap Case: గుంటూరు జిల్లాలో రెండు సంవత్సరాల బాలుడి కిడ్నాప్ కేసు సుఖాంతమైంది. ఈనెల ఇరవై నాలుగవ తేదీన పెద్దకాకాని మండల పరిధిలోని బాలుడిని విజయవాడకు చెందిన నలుగురు వ్యక్తులు కిడ్నాప్ చేశారు. ప్రస్తుతం కిడ్నాపర్లు పోలీసుల అదుపులో ఉన్నారు. డబ్బుల కోసమే కిడ్నాప్ చేసినట్టు వారు వెల్లడించారు. బాలుడిని సురక్షితంగా పోలీసులు తల్లిదండ్రులకు అప్పగించారు.
ఈ నెల 24న నంబూరు ఎస్టీ కాలనీకి చెందిన ఎస్టీ కాలనీకి చెందిన బాల, ముసలయ్య దంపతులకు కుమారుడైన రెండు సంవత్సరాల జీవాను కారులో వచ్చి ఇద్దరు దుండగులు కిడ్నాప్ చేశారు. సాయంత్రం ఇంటి సమీపంలో ఇద్దరు వ్యక్తులు కారులో వచ్చారు. ఓ వ్యక్తి వచ్చి బాలుడి తల్లి బాలను మంచి నీళ్లు కావాలని అడిగారు. ఆమె చిన్నారిని అక్కడే వదిలేసి వాటర్ ఇచ్చేందుకు వాళ్లు ఇచ్చిన బాటిల్ తీసుకుని ఇంటి లోపలికి వెళ్లింది. మంచి నీళ్లు తీసుకుని బయటకు వచ్చి చూసి బాలుడుతో పాటు ఆ వ్యక్తులు కూడా కనిపించలేదు. తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు మూడు బృందాలు విడిపోయి గాలింపు చర్యలు చేపట్టారు.
విజయవాడకు చెందిన చంద్రికకు పిల్లలు లేకపోడంతో సువర్ణ అనే మరో మహిళ కిడ్నాప్‌కు ప్లాన్ చేసింది. నిందితులు దుర్గాప్రసాద్, శ్రీనివాసరావు, సాగర్, దుర్గాడ వేణు, వర్మతో కలిసి కిడ్నాప్‌కు వ్యూహం రచించారు. ప్రస్తుతం ముగ్గురు మహిళలతో పాటు మరో ముగ్గురు వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు. బాలుడిని సురక్షితంగా తల్లిదండ్రులకు వద్దకు చేర్చారు. కిడ్నాప్ కేసును ఛేదించడంలో స్మార్ట్‌గా వ్యవహరించిన సిబ్బందిని డిఐజి త్రివిక్రమ వర్మ అభినందించారు. కాగా పిల్లలు లేరని మహిళ ఈ తరహా చర్యకు పాల్పడటం ప్రస్తుతం జిల్లాలో హాట్ టాపిక్‌గా మారింది.
Also Read:
లైంగిక శక్తి పెరుగుతుందని, వీర్యపుష్టి కలుగుతుందని ప్రచారం.. ఏపీలో గాడిదలు కనుమరుగు
ఇప్పటివరకు సోషల్ మీడియాలో క్రేజ్.. తాజాగా కాంట్రోవర్సీ .. ఇక బిగ్ బాస్ ఎంట్రీ పక్కా..!
దీప్తితో బ్రేకప్ అయ్యిందా..? షణ్ముఖ్ జశ్వంత్ సోషల్ మీడియా లైవ్‌లో క్లారిటీ ఇచ్చేశాడు