Shanmukh Jaswanth: ఇప్పటివరకు సోషల్ మీడియాలో క్రేజ్.. తాజాగా కాంట్రోవర్సీ .. ఇక బిగ్ బాస్ ఎంట్రీ పక్కా..!

Shanmukh Jaswanth in bigg boss telugu: బుల్లితెరపై బిగ్‌బాస్‌ రియాల్టీ షోకు ఎంత క్రేజీ ఉందో స్పెషల్‌గా చెప్పాల్సిన పనిలేదు. ఏ భాషలోనైనా సరే బిగ్‌బాస్‌ షో అంటే టీవీ వీక్షకులకు చాలా ఇంట్రస్ట్...

Shanmukh Jaswanth: ఇప్పటివరకు సోషల్ మీడియాలో క్రేజ్.. తాజాగా కాంట్రోవర్సీ .. ఇక బిగ్ బాస్ ఎంట్రీ పక్కా..!
షణ్ముక్ జశ్వంత్...
Follow us
Ram Naramaneni

|

Updated on: Feb 28, 2021 | 1:51 PM

Shanmukh Jaswanth in Bigg Boss :  బుల్లితెరపై బిగ్‌బాస్‌ రియాల్టీ షోకు ఎంత క్రేజీ ఉందో స్పెషల్‌గా చెప్పాల్సిన పనిలేదు. ఏ భాషలోనైనా సరే బిగ్‌బాస్‌ షో అంటే టీవీ వీక్షకులకు చాలా ఇంట్రస్ట్. ఎన్నో విమర్శలు వచ్చినా అదిరిపోయే రేటింగ్‌లో దూసుకుపోతుంది. ప్రాంతీయ భాషలన్నింటిలోనూ  విజయవంతంగా దూసుకుపోతుంది. ఇక తెలుగులో అయితే బిగ్‌బాస్‌ షోకు ఉన్న క్రేజ్ అంతా, ఇంతా కాదు. లాస్ట్ సీజన్ అయితే కరోనా లాక్ డౌన్ సమయంలో ఇళ్లకే పరిమితం అయిన వారికి 105 రోజుల పాటు ఫుల్ వినోదం పంచారు.

తాజాగా బిగ్ బాస్ ఐదవ సీజన్‌పై తెగ చర్చ జరుగుతుంది. ఏ కంటెస్టెంట్లు ఉంటారు.. తమకు ఇష్టమైన స్టార్ బిగ్ బాస్ ఇంట్లో ఉంటారా అన్న అంచనాలు అందరిలోనూ ఉన్నాయి. ఈ క్రమంలో షో నిర్వాహకులు ఐదో సీజన్‌ కోసం ఏర్పాట్లు ప్రారంభించారు. కాగా.. బిగ్‌బాస్‌ ఐదో సీజన్‌ మొదటి కంటెస్టెంట్‌ ఇతడే అంటూ ఓ వార్త సోషల్‌ మీడియాలో నిన్న, మొన్నటివరకు  తెగ సర్కులేట్ అయ్యింది. అతను ఎవరో కాదు.. టిక్ టాక్ ఫేమ్, యాక్టర్  షణ్ముఖ్‌ జశ్వంత్‌. ఇతగాడి యూత్‌లో మంచి ఫాలోయింగ్ ఉంది. ట్రెండ్‌కు తగ్గట్లు షార్ట్ ఫిల్స్మ్ సెలక్ట్ చేసుకుని యాక్ట్ చేవాడు.  ఈ క్రమంలో అతడు నటించిన ‘వైవా’,  ‘సాఫ్ట్‌వేర్ డెవలపర్’ షార్ట్‌ఫిలిమ్స్ అతడికి చాలా మంచి పేరు తీసుకువచ్చాయి.

అతడి క్రేజ్‌ క్యాష్ చేసుకునేందుక బిగ్ బాస్ నిర్వాహకులు రెడీ అయ్యారాట. బిగ్ బాస్ నిర్వాహకులు అతడిని సంప్రదించగా, షణ్ముఖ్‌ కూడా ఓకే చెప్పినట్టు టాక్. షణ్ముఖ్‌కు 28 లక్షలు, ఇన్‌స్ట్రాగ్రామ్‌లో 12 లక్షల ఫాలోవర్స్‌ ఉన్నారు. ఈ కారణాలతోనే షణ్ముఖ్‌ని బిగ్‌బాస్‌లోకి తీసుకున్నారని తెలుస్తోంది.

కాగా తాజాగా డ్రంక్ డ్రైవ్ చేసి బంజారాహిల్స్‌లో యాక్సిడెంట్ చేశాడు షణ్ముఖ్. దీంతో అతడి పేరు ఇప్పుడు సోషల్ మీడియాలో మారుమోగిపోతుంది. ఇప్పుటివరకు అతడి ఫేమ్ చూసి బిగ్ బాస్ యాజమాన్యం ఇంట్రస్ట్ చూపించారు. తాజాగా కాంట్రోవర్సీ కూడా తోడైంది. బిగ్ బాస్‌ ఇంట్లో ఇలాంటి వ్యక్తులు ఉంటేనే వారికి కావాల్సిన మసాలా దొరుకుతుంది. సో.. ఈ సారి అతడి ఎంట్రీ పక్కా అని అతడి ఫాలోవర్స్ చెబుతున్నారు. లెట్స్ వెయిట్ అండ్ సీ.

Also Read:

దీప్తితో బ్రేకప్ అయ్యిందా..? షణ్ముఖ్‌ జశ్వంత్ సోషల్ మీడియా లైవ్‌లో క్లారిటీ ఇచ్చేశాడు

లైంగిక శక్తి పెరుగుతుందని, వీర్యపుష్టి కలుగుతుందని ప్రచారం.. ఏపీలో గాడిదలు కనుమరుగు