AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bigg Boss : బిగ్‌‌‌‌‌‌బాస్ షోకు హోస్ట్ గా కొనసాగను.. తేల్చిచెప్పిన స్టార్ హీరో.. నిర్వాహకులు ఏంచేశారంటే..

బిగ్ బాస్ ఈ రియాలిటీ కి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాలిసిన అవసరం లేదు. అన్ని భాషల్లో ఈ షో చాల పాపులర్ అయ్యింది

Bigg Boss : బిగ్‌‌‌‌‌‌బాస్ షోకు హోస్ట్ గా కొనసాగను.. తేల్చిచెప్పిన స్టార్ హీరో.. నిర్వాహకులు ఏంచేశారంటే..
Rajeev Rayala
|

Updated on: Mar 01, 2021 | 11:25 AM

Share

Kichcha Sudeepa : బిగ్ బాస్ ఈ రియాలిటీ షోకి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాలిసిన అవసరం లేదు. అన్ని భాషల్లో ఈ షో చాల పాపులర్ అయ్యింది. తెలుగులో కూడా ఈ షో విజయవంతంగా కొనసాగింది. ఇప్పటివరకు నాలుగు సీజన్స్ పూర్తిచేసుకున్న ఈ షో ఇప్పుడు 5వ సీజన్ కు సిద్ధం అవుతుంది. ఇదిలా ఉంటే బిగ్ బాస్ షోను హిందీలో సల్మాన్ ఖాన్, తమిళ్ లో లోకనాయకుడు కమల్ హాసన్, అలాగే కన్నడలో సుదీప్ కిచ్చ హోస్టులుగా వ్యవహరిస్తున్నారు.

కాగా ఇప్పుడు కన్నడ బిగ్ బాస్ నుంచి సుదీప్ తప్పుకుంటున్నాడని తెలుస్తుంది. కన్నడ బిగ్ బాస్ సీజన్ – 8 త్వరలో ప్రారంభం కాబోతోంది. ఈ క్రమంలో హోస్ట్ కిచ్చ సుదీప్ మీడియాతో మాట్లాడారు. బిగ్బాస్ కన్నడ రియాలిటీ షోకు హోస్ట్ గా ఉండాలని మొదటగా నిర్వాహకులు అడిగినప్పుడు తనపై తనకు అనేక సందేహాలు కలిగాయన్నాడు అన్నాడు .

తానూ హోస్ట్ గా వ్యవహరిస్తే ప్రేక్షకులు రిసీవ్ చేసూస్కుంటారా లేదా అన్న భయం కలిగిందని అన్నాడు. బిగ్ బాస్ కు హోస్ట్ గా చేసేటప్పుడు కాస్త ఇబ్బందిగా ఫీల్ అయ్యేవాడినని అన్నాడు. కంటెస్టెంట్ల మధ్య గొడవల వల్ల తాను చాలా ఇబ్బంది పడ్డానని తెలిపాడు సుదీప్. ఆసమయంలో షో కు బ్రేక్ ఇచ్చి వెళ్ళిపోదామని అనుకున్నా అని చెప్పుకొచ్చాడు.

ఐదు  సీజన్స్ పూర్తయిన తర్వాత ఆరొవ సీజన్ కు తానూ హోస్ట్ గా చేయనని చెప్పాడట సుదీప్ కానీ నిర్వాహకులు ఒప్పుకోలేదట.  6వ సీజన్ నావల్ల కాదు మరో హోస్ట్ ను వెతకండి అని చెప్పాడట సుదీప్. నిర్వాహకులు అందుకు ఒప్పుకోలేదు. ఎలాగోలా కన్వీన్స్ చేసి మళ్లీ హోస్ట్ గా కొనసాగేలా ఒప్పించారని చెప్పుకొచ్చాడు సుదీప్.

మరిన్ని ఇక్కడ చదవండి :

‘HIT’ Movie Sequel : విశ్వక్‌‌‌‌సేన్ ‘హిట్’ కు ఏడాది.. సీక్వెల్ అనౌన్స్ చేసిన నేచురల్ స్టార్..

నాలుగు పదుల వయసులోనూ పాతికేళ్ల కుర్రాడిలా.. రోజు రోజుకు తగ్గుతున్న మహేష్ వయసు..