HIT Movie Sequel : విశ్వక్‌‌‌‌సేన్ ‘హిట్’ కు ఏడాది.. సీక్వెల్ అనౌన్స్ చేసిన నేచురల్ స్టార్..

Rajeev Rayala

Rajeev Rayala |

Updated on: Mar 01, 2021 | 12:18 PM

టాలీవుడ్ యంగ్ హీరోల్లో విశ్వక్ సేన్ ఒకడు. ఈ కుర్ర హీరో ఈ నగరానికి ఏమైంది సినిమాతో హీరోగా  సూపర్ హిట్ అందుకున్నాడు.

HIT Movie Sequel : విశ్వక్‌‌‌‌సేన్ 'హిట్' కు ఏడాది.. సీక్వెల్ అనౌన్స్ చేసిన నేచురల్ స్టార్..

Nani announces  HIT sequel : టాలీవుడ్ యంగ్ హీరోల్లో విశ్వక్ సేన్ ఒకడు. ఈ కుర్ర హీరో ఈ నగరానికి ఏమైంది సినిమాతో హీరోగా  సూపర్ హిట్ అందుకున్నాడు. విశ్వక్ సేన్ మొదట అసిస్టెంట్ డైరెక్టర్ గా కెరియర్ మొదలు పెట్టి హీరోగా మారాడు. ఈ నగరానికి ఏమైంది సినిమా తర్వాత మంచి కథలను ఎంచుకుంటూ సూపర్ హిట్ లు సాధిస్తున్నాడు.

టాలీవుడ్‌‌లో బ్యాక్‌గ్రౌండ్ లేకుండా వచ్చి మంచి పాపులారిటీ తెచ్చుకున్న హీరోల్లో విశ్వక్ సేన్ కూడా ఒకరు. ఇప్పుడిప్పుడే హీరోగా గుర్తింపు పొందుతున్నాడు విశ్వక్ సేన్. నిజానికి వెళ్లిపోమాకే సినిమాతో 2017లో ఎంట్రీ ఇచ్చిన దనీష్ నాయుడు అలియాస్ విశ్వక్ సేన్‌కు ఆ సినమాతో గుర్తింపు దొరకలేదు.

ఆతర్వాత వచ్చిన ఈ నగరానికి ఏమైంది, ఫలక్ నామదాస్, హిట్ సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇక హీరో నాని నిర్మించిన హిట్ సినిమా విశ్వక్ కు ప్రత్యేక గుర్తింపు తెచ్చిపెట్టింది. ఇప్పుడు ఈ సిమిమాకు సీక్వెల్ తెరకెక్కుతుంది.  కొలను శైలేష్ దర్శకత్వంలో వచ్చిన ‘హిట్’ సినిమా ఏడాది పూర్తి చేసుకుంది. థియేటర్లలో మరియు ఓటీటీలో మంచి ఆధరణ దక్కించుకున్న హిట్ కు సీక్వెల్ ఉంటుందని ముందే ప్రకటించారు.  అయితే ఈ  సీక్వెల్ పై ఆసక్తికర పోస్ట్ పెట్టాడు నాని.

మొదటి కేసును తెలంగాణ హిట్ ఆఫీసర్ విక్రమ్ రుద్రరాజు పరిష్కరించగా రెండవ కేసు ఏపీకి చెందిందని  నాని ట్విట్టర్ లో పేర్కొన్నాడు. అయితే ఈ సీక్వెల్ లో విశ్వక్ సేన్ నటించడం లేదని తెలుస్తుంది. ఈ సెకండ్ పార్ట్ లో అడవి శేష్ హీరోగా నటించే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం హిట్ హిందీ రీమేక్ పనిలో దర్శకుడు ఉన్నాడు. అక్కడ పూర్తి అయిన తర్వాత రెండవ కేసు పని మొదలు పెట్టే అవకాశం ఉంది.

హీరో నాని ట్వీట్ ..

మరిన్ని ఇక్కడ చదవండి : 

నాలుగు పదుల వయసులోనూ పాతికేళ్ల కుర్రాడిలా.. రోజు రోజుకు తగ్గుతున్న మహేష్ వయసు..

Golden Globes 2021: లావిష్ గా గోల్డెన్ గ్లోబ్ 2021 వేడుక, ది క్రౌన్ లో డయానా పాత్రకు ఎమ్మా కోరిన్ ను వరించిన ఉత్తమ నటి అవార్డ్

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu