Rajeev Rayala |
Updated on: Mar 01, 2021 | 10:40 AM
టాలీవుడ్ లో మహేష్ బాబు కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. వరుస విజయాలతో ప్రస్తుతం టాలీవుడ్ నెంబర్ వన్ హీరోగా రాణిస్తున్నాడు.
ఇక మహేష్ నాలుగు పదుల వయసులోనూ పాతకెళ్లా కుర్రాడిలా నవయవ్వనంగా కనిపిస్తుంటాడు. ఇప్పుడున్న జనరేషన్ హీరోలు సైతం మహేష్ హ్యాండ్సంన్స్ చూసి షాక్ అవుతుంటారు.
అయితే దర్శక ధీరుడు రాజమౌళితో మహేష్ సినిమా ఉంటుందని అభిమానులంతా అనుకుంటున్నారు. కానీ ఈ సినిమా ఇప్పట్లో పట్టాలెక్కేలా కనిపించడం లేదు.
ప్రస్తుతం సూపర్ స్టార్ సర్కారువారిపాట అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాకు పరశురామ్ దర్శకత్వం వహిస్తున్నాడు. కీర్తసురేష్ హీరోయిన్ గా నటిస్తుంది.