Golden Globes 2021: లావిష్ గా గోల్డెన్ గ్లోబ్ 2021 వేడుక, ది క్రౌన్ లో డయానా పాత్రకు ఎమ్మా కోరిన్ ను వరించిన ఉత్తమ నటి అవార్డ్

Golden Globes 2021 : ప్రతిష్టాత్మక గోల్డెన్ గ్లోబ్ 2021 అవార్డుల వేడుకలు అమెరికాలో అట్టహాసంగా జరుగుతున్నాయి. ఈ 78వ ఎడిషన్ లో 'ది క్రౌన్' సినిమాలో డయానా పాత్ర అత్యద్భుతంగా పోషించిన ఎమ్మా కోరిన్ ను..

Golden Globes 2021: లావిష్ గా గోల్డెన్ గ్లోబ్ 2021 వేడుక, ది క్రౌన్ లో డయానా పాత్రకు ఎమ్మా కోరిన్ ను వరించిన ఉత్తమ నటి అవార్డ్
Follow us
Venkata Narayana

|

Updated on: Mar 01, 2021 | 12:58 PM

Golden Globes 2021 : ప్రతిష్టాత్మక గోల్డెన్ గ్లోబ్ 2021 అవార్డుల వేడుకలు అమెరికాలో అట్టహాసంగా జరుగుతున్నాయి. ఈ 78వ ఎడిషన్ లో ‘ది క్రౌన్’ సినిమాలో డయానా పాత్ర అత్యద్భుతంగా పోషించిన ఎమ్మా కోరిన్ ను ఉత్తమ నటి అవార్డ్ వరించింది. టీవీ, సినిమా రంగాల్లోని ఉత్తమమైన కంటెంట్, నటన, ప్రతిభ ఆధారంగా ఈ అవార్డులు అందజేస్తారు. కాగా, మిగతా వాటిలాగే, కరోనావైరస్ మహమ్మారి ఈ అవార్డుల సీజన్‌ను కూడా ప్రభావితం చేసిన సంగతి తెలిసిందే. ప్రపంచవ్యాప్తంగా ఉన్న వివిధ ప్రాంతాలనుండి నామినీలు ఈ వేడుకలో పాల్గొంటున్నారు. టీనా ఫే, అమీ పోహ్లెర్ ఈ కార్యక్రమాన్ని న్యూయార్క్‌లోని రెయిన్బో రూమ్, లాస్ ఏంజిల్స్‌లోని బెవర్లీ హిల్స్‌లోని బెవర్లీ హిల్టన్ నుంచి నిర్వహిస్తున్నారు. ఏప్రిల్ 25, 2021న జరిగే ఆస్కార్ అవార్డుల కార్యక్రమానికి ఎనిమిది వారాల ముందు గోల్డెన్ గ్లోబ్ అవార్డుల కార్యక్రమాన్ని నిర్వహిస్తామని హాలీవుడ్ ఫారిన్ ప్రెస్ అసోసియేషన్ ఇప్పటికే ప్రకటన విడుదల చేసిన సంగతి తెలిసిందే.

Read also : Vaccination 2nd phase: నేటి నుంచి రెండో విడత‌, 60 ఏళ్లు దాటిన, 45 ఏళ్లు పైనుండి దీర్ఘ కాలిక వ్యాధులు ఉన్న వారికి కరోనా టీకాలు