AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Andhra Pradesh: ఆర్థిక ఇబ్బందులు.. కుటుంబ సమస్యలు.. పురుగుల మందు తాగి పిల్లలతో సహా తల్లి ఆత్మహత్య

ఇంట్లో ఆర్థిక ఇబ్బందులు ఓ మహిళకు జీవితంపై విరక్తి కలిగించాయి. సమస్యలు ఎప్పటికీ పరిష్కారంకావని నిర్ణయించుకొని భర్త బయటకి వెళ్ళిన సమయంలో పురుగు మందు తెచ్చుకొని తన పిల్లలతో సహా తాగింది. ఈ ఘటనలో తల్లీ, ఇద్దరు పిల్లలు మృతి...

Andhra Pradesh: ఆర్థిక ఇబ్బందులు.. కుటుంబ సమస్యలు.. పురుగుల మందు తాగి పిల్లలతో సహా తల్లి ఆత్మహత్య
mother suicide
Ganesh Mudavath
|

Updated on: Jun 24, 2022 | 7:31 AM

Share

ఇంట్లో ఆర్థిక ఇబ్బందులు ఓ మహిళకు జీవితంపై విరక్తి కలిగించాయి. సమస్యలు ఎప్పటికీ పరిష్కారంకావని నిర్ణయించుకొని భర్త బయటకి వెళ్ళిన సమయంలో పురుగు మందు తెచ్చుకొని తన పిల్లలతో సహా తాగింది. ఈ ఘటనలో తల్లీ, ఇద్దరు పిల్లలు మృతి చెందారు. విజయవాడ(Vijayawada) నగరంలోని కృష్ణలంక(Krishna Lanka) బాలాజీనగర్ లో నివాసం ఉండే గోపాలకృష్ణ, చందన లక్ష్మి లకు ఇద్దరు పిల్లలు, భర్త లారీ డ్రైవర్ గా పనిచేస్తుంటాడు. ఆర్థిక ఇబ్బందులతో కొంతకాలం నుంచి కుటుంబంలో తరచు గొడవ పడుతూ ఉండేవాడు. దీంతో జీవితంపై విరక్తి చెంది.. భర్త డ్యూటీకి వెళ్లిన సమయంలో బుధవారం అర్ధరాత్రి రాత్రి తన పిల్లలతో పురుగుమందు తాగి ఆత్మహత్యకు పాల్పడింది. భర్త డ్యూటీ దిగి ఇంటికి చూసేసరికి విగతజీవిగా పడి ఉన్నాడు.

Women Suicide Wiht Her Children

Women Suicide Wiht Her Children

భర్తకు ఎలాంటి ఇబ్బంది కలగకూడదని ముందుగానే ఆత్మహత్యకు కారణాలను పోలీసులు తెలియజేస్తూ సూసైడ్ నోట్ రాసింది. ఆర్థిక ఇబ్బందులతో, జీవితంపై విరక్తి కలగడంతో ఇద్దరు పిల్లలతో సహా ఆత్మహత్య చేసుకున్నట్టు లెటర్ రాసింది. సూసైడ్ నోట్ ను స్వాధీనం చేసుకున్న పోలీసులు ఆత్మహత్యగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి