Andhra Pradesh: ఇంటర్ ఫెయిల్.. స్టూడెంట్ సూసైడ్.. కన్నీరుమున్నీరవుతున్న తల్లిదండ్రులు

విద్యార్థుల ప్రగతిని అంచనా వేయాల్సిన పరీక్షలు(Exams) మృత్యుపాశాలుగా మారుతున్నాయ్. చిన్నచిన్న కారణాలకే విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. పరీక్షలో పాస్ కాకపోతే ఇక అన్నీ కోల్పోయామంటూ జీవితాన్ని అర్ధంతరంగా ముగించేస్తున్నారు....

Andhra Pradesh: ఇంటర్ ఫెయిల్.. స్టూడెంట్ సూసైడ్.. కన్నీరుమున్నీరవుతున్న తల్లిదండ్రులు
crime news
Follow us
Ganesh Mudavath

|

Updated on: Jun 24, 2022 | 8:39 AM

విద్యార్థుల ప్రగతిని అంచనా వేయాల్సిన పరీక్షలు(Exams) మృత్యుపాశాలుగా మారుతున్నాయ్. చిన్నచిన్న కారణాలకే విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. పరీక్షలో పాస్ కాకపోతే ఇక అన్నీ కోల్పోయామంటూ జీవితాన్ని అర్ధంతరంగా ముగించేస్తున్నారు. ఎన్నో ఆశలు పెట్టుకున్న కన్నవాళ్లకు కడుపుకోత మిగుల్చుతున్నారు. తాజాగా ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh) లో ఇటీవల ఇంటర్ పరీక్షా ఫలితాలు వెల్లడయ్యాయి. ఇంటర్ పరీక్షల్లో ఫెయిల్ కావడాన్ని జీర్ణించుకోలేని విద్యార్థి అశోక్.. ఆత్మహత్య చేసుకున్న సంఘటన గురువారం జరిగింది. ప్రకాశం జిల్లాలోని పుచ్చకాయలపల్లి గ్రామానికి చెందిన వజ్రాల అశోక్ రెడ్డి.. పట్టణంలోని ఒక ప్రైవేటు కాలేజిలో ఇంటర్ చదువుతున్నాడు. ఇటీవల విడుదలైన ఫలితాల్లో ఫెయిల్ అయ్యాడు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు.

మధ్యాహ్నం 12 గంటల సమయంలో స్నేహితులకు ఫోన్ చేసి సమాచారం ఇచ్చి, సుంకేసుల గ్యాప్ వెలుగొండ ప్రాజెక్టు డ్యామ్ మీద నుంచి కిందకు దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు సంఘటనా ప్రదేశానికి చేరుకుని కుమారుడి మృతదేహం వద్ద కన్నీరు మున్నీరుగా విలపించారు. అశోక్ రెడ్డి మృతితో గ్రామంలో విషాదచాయలు అలుముకున్నాయి.

కాగా.. ఇటీవల విడుదలైన ఇంటర్ ఫలితాల్లో పరీక్షలో మొత్తం 2,41,591 (54 శాతం) మంది ఉత్తీర్ణత సాధించగా, సెకండ్ ఇయర్‌లో శాతం 2,58,449 (61 శాతం) మంది పాస్‌ అయ్యారు. ఫస్ట్‌ ఇయర్‌లో బాలుర ఉత్తీర్ణత శాతం 49%గా ఉండగా, బాలికలు 65 శాతం పాస్‌ అయ్యారు. ఇక సెకండ్ ఇయర్‌లో బాలురు 54 శాతం, బాలికలు 68 శాతం ఉత్తీర్ణత సాధించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి