Crime News: నమ్మించి 14 సార్లు అబార్షన్ చేయించాడు.. పెళ్లి అనే సరికి మొహం చాటేశాడు.. సీన్ కట్ చేస్తే..

మ్మిదేళ్ల నుంచి భర్తకు దూరంగా ఉంటున్న బాధితురాలితో బీహార్‌కు చెందిన గౌతమ్‌ అనే వ్యక్తి ప్రేమ పేరుతో పరిచయం పెంచుకున్నాడు. వివాహం చేసుకుంటానని నమ్మించి ఆమెతో సహజీవనం చేశాడు.

Crime News: నమ్మించి 14 సార్లు అబార్షన్ చేయించాడు.. పెళ్లి అనే సరికి మొహం చాటేశాడు.. సీన్ కట్ చేస్తే..
Relationship
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Jul 15, 2022 | 9:23 AM

Live-in relationship: అతనే సర్వస్వమని నమ్మింది. అతని నిజస్వరూపం తెలిసి కూడా.. ఎనిమిది ఏళ్ల నుంచి సహజీవనం చేస్తోంది. ఈ 8 ఏళ్లలో సహజీవనం చేస్తున్న వ్యక్తి.. 14 సార్లు బలవంతంగా అబార్షన్‌ చేయించాడు. అయినా భరించింది. చివరకు పెళ్లికి నిరాకరించడంతో ఓ మహిళ (33) మనోవేదనతో ఆత్మహత్య చేసుకుంది. ఈ దారుణ ఘటన దేశ రాజధాని ఢిల్లీలో చోటుచేసుకుంది. ఆగ్నేయ ఢిల్లీలోని జైత్‌పూర్ ప్రాంతంలో జూలై 5 న ఈ ఘటన జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. తొమ్మిదేళ్ల నుంచి భర్తకు దూరంగా ఉంటున్న బాధితురాలితో బీహార్‌కు చెందిన గౌతమ్‌ అనే వ్యక్తి ప్రేమ పేరుతో పరిచయం పెంచుకున్నాడు. వివాహం చేసుకుంటానని నమ్మించి ఆమెతో సహజీవనం చేశాడు. ఈ 8 ఏళ్లలో ఆమెకు 14 సార్లు అబార్షన్‌ చేయించాడు. చివరకు పెళ్లికి నిరాకరించాడడంతో ఆమె జులై 5న ఉరి వేసుకొని బలవన్మరణానికి పాల్పడింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని పోస్టుమార్టం కోసం ఎయిమ్స్‌కు తరలించారు. పోస్టుమార్టం సమయంలో ఆమె దుస్తుల్లో సూసైడ్‌ నోట్‌ లభించడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. బాధితురాలు హిందీలో రాసిన సూసైడ్ నోట్‌లో.. 8 ఏళ్ల నుంచి నిందితుడితో లివ్-ఇన్ రిలేషన్‌షిప్‌లో ఉన్నానని, ఈ సమయంలో 14 సార్లు అబార్షన్ అయినట్లు పేర్కొంది. చివరకు పెళ్లికి నిరాకరించడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు వివరించింది. అతడు చేసిన తప్పులకు సంబంధించి ఆధారాలు సేకరించానని.. తన ఫోన్‌ను చెక్‌ చేయాలంటూ నోట్‌లో పేర్కొంది.

అనంతరం బీహార్‌లోని ముజఫర్‌పూర్‌లో నివాసముంటున్న ఆమె తల్లిదండ్రులకు సమాచారం అందించి, పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని వారికి అప్పగించినట్లు డీసీపీ ఈషా పాండే తెలిపారు. నిందితుడు నోయిడాలోని ఓ సాఫ్ట్‌వేర్ కంపెనీలో పనిచేస్తున్నట్లు తెలిపారు. అతనిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని వెల్లడించారు. మహిళ భర్తను కూడా విచారించామని.. ఇద్దరు ఎనిమిదేళ్ల క్రితం విడిపోయినట్లు పేర్కొన్నాడని తెలిపారు. నిందితుడి కోసం గాలిస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..