Andhra Pradesh: చెక్‌ పోస్ట్‌ వద్ద ఖరీదైన కారు.. పోలీసుల ప్రశ్నలకు పొంతనలేని సమాధానం.. అనుమానంతో తనిఖీ చేయగా..

Andhra Pradesh: పోలీసులు ఎన్ని రకాల చర్యలు తీసుకున్నా గంజాయి అక్రమ రవాణాకు మాత్రం అడ్డుకట్టపడడం లేదు. చెక్‌ పోస్టుల ఏర్పాటు చేసినా రకరకాల మార్గాల్లో బార్డర్‌ దాటిచ్చేస్తున్నారు. తాజాగా ఈ అక్రమ రవాణాలో...

Andhra Pradesh: చెక్‌ పోస్ట్‌ వద్ద ఖరీదైన కారు.. పోలీసుల ప్రశ్నలకు పొంతనలేని సమాధానం.. అనుమానంతో తనిఖీ చేయగా..
Representative Image
Follow us
Narender Vaitla

|

Updated on: Jul 15, 2022 | 9:16 AM

Andhra Pradesh: పోలీసులు ఎన్ని రకాల చర్యలు తీసుకున్నా గంజాయి అక్రమ రవాణాకు మాత్రం అడ్డుకట్టపడడం లేదు. చెక్‌ పోస్టుల ఏర్పాటు చేసినా రకరకాల మార్గాల్లో బార్డర్‌ దాటిచ్చేస్తున్నారు. తాజాగా ఈ అక్రమ రవాణాలో ఏకంగా పోలీసు అధికారులే ఉన్నారన్న వార్త అందరినీ విస్మయానికి గురి చేస్తోంది. అల్లూరి జిల్లాలో వెలుగులోకి వచ్చిన సంఘటన డిపార్ట్‌మెంట్‌లో ఉన్న అక్రమార్కుల గురించి వెలుగులోకి వచ్చింది.

తాజాగా ముంచంగి పుట్టు మండలం లబ్బూరు వద్ద.. తనిఖీలు చేస్తున్న పోలీసులకు బొలెరో వాహనం అనుమానాస్పద స్థితిలో కనిపించింది. ఆపి ప్రశ్నించే సరికి అందులో ప్రయాణిస్తున్న ఇద్దరు పొంతనలేని సమాధానం చెప్పారు. అనుమానం వచ్చి వెరిఫై చేసేసరికి వాహనంలో 560 కిలోల గంజాయి బయటపడింది. ఇద్దరిని అదుపుల్లో తీసుకుని విచారించేసరికి వారిలో ఒకర్ని ఒడిస్సాకు చెందిన కానిస్టేబుల్ ప్రమోద్‌ కుమార్‌గా గుర్తించారు. ఆరా తీస్తే స్మగ్లర్లతో చేతులు కలిపి గంజాయిని సరిహద్దులు దాటించేస్తున్నట్టు తేలింది. గతంలో మహారాష్ట్రలోని నాసిక్‌కు చెందిన కానస్టేబుల్‌ జ్ఞానేశ్వర్ యోగేష్ పాడేరులో గంజాయిని తరలిస్తు పట్టుపడ్డాడు. అయితే.. గంజాయి కేసుల్లో చాలావరకు కూలీలే చిక్కుకునేవారు. అల్లూరు జిల్లాగా ఆవిర్భవించిన తర్వాత.. అసలు నిందితులను ట్రాక్ చేసే పనిలోపడ్డారు పోలీసులు.

తాజాగా జీ మాడుగుల వద్ద కాపు కాసిన పోలీసులకు.. ఖరీదైన కార్లలో గంజాయిని ఢిల్లీకి తరలిస్తున్న ముఠా పట్టుబడింది. ఫోర్డ్ లాంటి కార్లలో.. వాహనం డోర్లలో కుక్కి ఎవరికి అనుమానం రాకుండా తరలిస్తుంది ఈ ముఠా. నలుగురిని అరెస్టు చేసి వారి నుంచి 100 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. అయితే ఇటువంటి ఖరీదైన కార్లలో వచ్చే గంజాయి స్మగ్లర్లకు కూడా.. ఆయా రాష్ట్రాల్లోనే పోలీసుల సహకారం పరోక్షంగా ఉంటుందనేది అల్లూరు జిల్లా పోలీసులు అనుమానం. దీంతో ఈ మధ్యకాలంలో మరింత దూకుడు పెంచిన అల్లూరి పోలీసులు.. రెండు నెలల వ్యాధిలో పాడేరు సర్కిల్ పరిధిలో 25 కేసులను నమోదు చేశారు. దాదాపుగా 3000 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకుని.. అంతర్రాష్ట్ర గంజాయి సోదరుల ముఠాలను అరెస్టు చేశారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని క్రైమ్ వార్తల కోసం క్లిక్ చేయండి..

పెళ్లిళ్లలో క్యాటరింగ్ గర్ల్.. ఇప్పుడు నెట్టింట ఫేమస్..
పెళ్లిళ్లలో క్యాటరింగ్ గర్ల్.. ఇప్పుడు నెట్టింట ఫేమస్..
చెప్పులు లేకుండా 20కిలోమీటర్లు నడిచిన గురుకుల విద్యార్థులు..కారణం
చెప్పులు లేకుండా 20కిలోమీటర్లు నడిచిన గురుకుల విద్యార్థులు..కారణం
అరంగ్రేటంలోనే రూల్స్ అతిక్రమించిన సామ్ కొంస్టాస్
అరంగ్రేటంలోనే రూల్స్ అతిక్రమించిన సామ్ కొంస్టాస్
భారతీయులు కొత్త ఏడాదిలో వీసా లేకుండా ఈ 12 దేశాల్లో పర్యటించవచ్చు!
భారతీయులు కొత్త ఏడాదిలో వీసా లేకుండా ఈ 12 దేశాల్లో పర్యటించవచ్చు!
ఎముకలు కొరికే చలిలో.. ఒళ్లు గగుర్పొడిచే సాహసం చేసిన రొనాల్డో
ఎముకలు కొరికే చలిలో.. ఒళ్లు గగుర్పొడిచే సాహసం చేసిన రొనాల్డో
అరెస్ట్ పేరుతో డబ్బు కొట్టేస్తున్న కేటుగాళ్లు..ఈ జాగ్రత్తలు మస్ట్
అరెస్ట్ పేరుతో డబ్బు కొట్టేస్తున్న కేటుగాళ్లు..ఈ జాగ్రత్తలు మస్ట్
ఏంటీ.. విజయ్ దళపతి కూతురు బ్యాడ్మింటన్ ఛాంపియనా..?
ఏంటీ.. విజయ్ దళపతి కూతురు బ్యాడ్మింటన్ ఛాంపియనా..?
పెరుగులో ఈ పొడి మిక్స్ చేసి రాస్తే..10నిమిషాల్లో తెల్లజుట్టు నల్ల
పెరుగులో ఈ పొడి మిక్స్ చేసి రాస్తే..10నిమిషాల్లో తెల్లజుట్టు నల్ల
విమానంలో ప్రయాణించే వారికి అలర్ట్‌.. మారిన లగేజీ నిబంధనలు
విమానంలో ప్రయాణించే వారికి అలర్ట్‌.. మారిన లగేజీ నిబంధనలు
అల్పపీడనం ఎఫెక్ట్.. ఏపీ, తెలంగాణకు వర్షాలే వర్షాలు..
అల్పపీడనం ఎఫెక్ట్.. ఏపీ, తెలంగాణకు వర్షాలే వర్షాలు..