Hyderabad: హుస్సేన్‌సాగర్‌ మధ్యలో ఆగిపోయిన బోటు.. అందులో 60 మంది టూరిస్టులు.. చివరకు ఏమైందంటే..

హుస్సేన్‌సాగర్‌లో పెను ప్రమాదం తప్పింది. సాంకేతిక కారణాలతో 60 మందితో ప్రయాణిస్తున్న బోటు సాగర్‌ మధ్యలో ఆకస్మాత్తుగా ఆగిపోయింది. అయితే టూరిజం సిబ్బంది వెంటనే..

Hyderabad: హుస్సేన్‌సాగర్‌ మధ్యలో ఆగిపోయిన బోటు.. అందులో 60 మంది టూరిస్టులు.. చివరకు ఏమైందంటే..
Hussain Sagar
Follow us

|

Updated on: Jul 14, 2022 | 7:41 PM

హుస్సేన్‌సాగర్‌లో పెను ప్రమాదం తప్పింది. సాంకేతిక కారణాలతో 60 మందితో ప్రయాణిస్తున్న బోటు సాగర్‌ మధ్యలో ఆకస్మాత్తుగా ఆగిపోయింది. అయితే టూరిజం సిబ్బంది వెంటనే అప్రమత్తమయ్యారు. స్టీమర్‌ బోట్ల సహాయంతో బోటును సురక్షితంగా ఒడ్డుకు చేర్చారు. బుధవారం ఈ ఘటన జరిగింది. దీని గురించి ఆనంద్‌ ధర్మాన ఓ టూరిస్ట్‌ ట్వీట్‌ చేయడంలో తాజాగా వెలుగులోకి వచ్చింది. ‘60 మంది సందర్శకులతో నిన్న ఓ బోటు హుస్సేన్‌సాగర్‌లోని బుద్ధుని విగ్రహం వద్దకు వెళ్లింది. తిరిగి వెనక్కి వస్తున్న సమయంలో గాలుల తీవ్రతతో ఇంజిన్‌ అకస్మాత్తుగా ఆగిపోయింది. టూరిజం సిబ్బంది వెంటనే అప్రమత్తమై స్టీమర్‌ బోట్ల సహాయంతో బోటును ఒడ్డుకు చేర్చారు’ అని ఆ పోస్ట్‌లో రాసుకొచ్చాడు.

ఈ ఘటనపై టూరిజం ఎండీ మనోహర్ స్పందించారు. గాలుల తీవ్రత ఎక్కువైనప్పుడు ఒడ్డుకు వచ్చే సమయంలో బోటు ఇంజిన్‌ స్లో చేస్తామని, అవసరమైతే స్టీమర్‌ బోట్లతో ఒడ్డుకు చేరుస్తామని తెలిపారు. భారీ వర్షాలు కురుస్తున్నందున ప్రస్తుతం గాలుల తీవ్రత ఎక్కువగా ఉంది. అందుకే హుస్సేన్‌సాగర్‌లో టూరిస్ట్‌ బోట్లను తిప్పడం లేదని ఎండీ పేర్కొన్నారు. కాగా గత కొన్ని రోజులుగా భాగ్యనగరాన్ని వెంటాడుతున్న వరుణుడు గురువారం కాస్తా శాంతించాడు. కొన్ని చోట్ల మాత్రమే వర్షాలు కురుస్తున్నాయి. దీంతో నగర ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..

రెండోసారి తండ్రైన క్రికెటర్ కృనాల్ పాండ్య.. బాబు పేరెంటో తెలుసా?
రెండోసారి తండ్రైన క్రికెటర్ కృనాల్ పాండ్య.. బాబు పేరెంటో తెలుసా?
హైదరాబాద్ లో ఆ మార్గంలో మెట్రో రైళ్ల సమయం పొడిగింపు
హైదరాబాద్ లో ఆ మార్గంలో మెట్రో రైళ్ల సమయం పొడిగింపు
విమానాలు రద్దయితే ఆటోమేటిక్‌ రిఫండ్‌
విమానాలు రద్దయితే ఆటోమేటిక్‌ రిఫండ్‌
వేసవి తాపాన్ని తట్టుకోవడానికి డ్రైవర్‌ వినూత్న ఆలోచన !!
వేసవి తాపాన్ని తట్టుకోవడానికి డ్రైవర్‌ వినూత్న ఆలోచన !!
టీ20 ప్రపంచకప్‌లో సిక్సర్ల కింగ్‌.. యువరాజ్‌ కు కీలక బాధ్యతలు
టీ20 ప్రపంచకప్‌లో సిక్సర్ల కింగ్‌.. యువరాజ్‌ కు కీలక బాధ్యతలు
ఆల్ టైం హైకి ప్రపంచ సైనిక వ్యయం.. మన దేశమేమి తక్కువ కాదండోయ్..
ఆల్ టైం హైకి ప్రపంచ సైనిక వ్యయం.. మన దేశమేమి తక్కువ కాదండోయ్..
దూకుడు పెంచిన సీఎం రేవంత్ రెడ్డి.. పార్టీ నాయకులకు దిశా నిర్ధేశం
దూకుడు పెంచిన సీఎం రేవంత్ రెడ్డి.. పార్టీ నాయకులకు దిశా నిర్ధేశం
వృషభ రాశిలోకి గురు సంచారం.. ఈ రాశులకు ఇక పట్టిందల్లా బంగారమే!
వృషభ రాశిలోకి గురు సంచారం.. ఈ రాశులకు ఇక పట్టిందల్లా బంగారమే!
బొత్స కంట రాలిన కన్నీరు.. భావోద్వేగానికి కారణం ఇదే..
బొత్స కంట రాలిన కన్నీరు.. భావోద్వేగానికి కారణం ఇదే..
పవన్‎కు మద్దతుగా ప్రచారంలో పాల్గొననున్న వరుణ్ తేజ్.. ఎప్పుడంటే..
పవన్‎కు మద్దతుగా ప్రచారంలో పాల్గొననున్న వరుణ్ తేజ్.. ఎప్పుడంటే..