AP News: పోలీసులకు అతడి గురించి రహస్య సమాచారం.. ఇంటికెళ్లి స్విచ్ బోర్డులు, కరెంట్ మీటర్ చెక్ చేస్తే షాక్
విశాఖ జిల్లాలో ఓ విచిత్ర దొంగ పోలీసులకు చిక్కాడు..ఇతగాడిని విచిత్ర దొంగ అనేకంటే.. తెలివైన దొంగ అంటేనే బెటరేమో..?
Vizag: విశాఖ జిల్లాలో ఓ విచిత్ర దొంగ పోలీసులకు చిక్కాడు..ఇతగాడిని విచిత్ర దొంగ అనేకంటే.. తెలివైన దొంగ అంటేనే బెటరేమో..ఎందుకంటే..అతడు చోరీ చేసిన బంగారం దాచిన తీరు తెలిసి పోలీసులే కంగుతిన్నారు. ఎట్టకేలకు అతన్ని పట్టుకుని జైల్లో పెట్టారు. దిగువన వీడియోలో కనిపించే వ్యక్తి వృత్తి ఎలక్ట్రీషియన్.. చుట్టుపక్కల ఇళ్లల్లో ఏ ప్రాబ్లమ్ వచ్చినా ఒక్క ఫోన్ కొడితే చాలు..వెంటనే క్షణాల్లో వాలిపోతాడు. ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తాడు. దాంతో పాటే..తనకున్న మరో ప్రవృత్తిని కూడా అక్కడే ఇంప్లిమెంట్ చేస్తాడు.. అదును చూసి ఇంటికి కన్నాలు వేయడం.. బంగారం, వెండి వస్తువులు కాజేసి ఊడాయిస్తుంటాడు.. ఇంతకీ దొంగిలించిన సొత్తును ఎక్కడ దాస్తున్నాడో తెలుసా..? స్విచ్ బోర్డులు, కరెంట్ మీటర్లలో భద్రంగా దాస్తున్నాడు. బాధితుల ఫిర్యాదుతో నిందితుడ్ని అదుపులోకి తీసుకున్న పోలీసులు.. ఎలక్ట్రీషియన్ దొంగతనం కహానీలు మొత్తం బయటపెట్టారు. చూశారుగా మన ఊర్లో ఉండేవాళ్లు.. ఇంట్లో పనులు చేయడానికి వచ్చేవాళ్లని కూడా నమ్మే పని లేదు. ఎవరు మనసులో ఎలాంటి మకిలి ఉందో గుర్తించడం కష్టం. కాబట్టి ఎప్పుడూ జాగ్రత్తగా ఉండండి.
Also Read: AP: ఈ పూలతో ఇగురు పెట్టి తింటే.. అస్సలు వదలరు.. టేస్ట్ అద్భుతం.. పోషకాలు అమోఘం
RRR day 1 box office collection: తొక్కుకుంటూ పోతున్నారు.. కలెక్షన్ల ఊచకోత.. ప్రేక్షకుల బ్రహ్మరథం