AP Crime News: మ్యాట్రిమోనీలో అద్భుత మ్యాచ్ అని పెళ్లాడింది.. ఆ త‌ర్వాత అత‌డి బ్యాగ్రౌండ్ తెలిసి మైండ్ బ్లాంక్

విశాఖలో నయా మోసం వెలుగు చూసింది. మ్యాట్రిమోనీ సైట్ ద్వారా పరిచయం చేసుకున్న యువతిని నమ్మించి పెళ్లి చేసుకున్న మాయగాడు..ఆ తర్వాత నిలువు దోపిడీకి పాల్పడ్డాడు.

AP Crime News:  మ్యాట్రిమోనీలో అద్భుత మ్యాచ్ అని పెళ్లాడింది.. ఆ త‌ర్వాత అత‌డి బ్యాగ్రౌండ్ తెలిసి మైండ్ బ్లాంక్
Wedding day twist
Follow us

|

Updated on: Apr 24, 2021 | 6:42 PM

విశాఖలో నయా మోసం వెలుగు చూసింది. మ్యాట్రిమోనీ సైట్ ద్వారా పరిచయం చేసుకున్న యువతిని నమ్మించి పెళ్లి చేసుకున్న మాయగాడు..ఆ తర్వాత నిలువు దోపిడీకి పాల్పడ్డాడు. మంచి పొజిషన్‌లో ఉన్నానని నమ్మించి…పెళ్లి చేసుకున్నాడు. నగదు, నగలతో ఉడాయించాడు. చివరకు… మోసపోయానని గ్రహించిన బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది.

విశాఖ జిల్లా పెందుర్తికి చెందిన ఓ యువతి మ్యాట్రిమోనీ ద్వారా సంబంధాలు వెతుకుతోంది. ఆమెకు 30ఏళ్ళ సాంబశివరావు అనే వ్యక్తి పరిచయమయ్యాడు. ఇద్దరి టేస్టులు, హోదా, అభిప్రాయాలు కూడా కలవడంతో… విశాఖలోని ఓ ఆలయంలో పెళ్లి చేసుకున్నారు. ఆ తర్వాత ఓ కంపెనీలో సీఈవో స్థాయిలో ఉన్నానని చెప్పి విజయవాడకు తీసుకెళ్లాడు. ఇద్దరూ కలిసి కొంతకాలం అక్కడే ఉన్నారు. కొన్ని రోజులకు.. ఇన్‌ కం ట్యాక్స్‌ రైడ్స్‌ జరుగుతున్నాయని చెప్పి.. ఆమెను పుట్టింటికి పంపించాడు. అంతేకాదు.. ఐటీ సోదాల వల్ల ఆర్థిక సమస్యలొచ్చాయని మాయమాటలు చెప్పి 10లక్షల నగదు, 12 తులాల బంగారం తీసుకున్నాడు. ఆ తర్వాత ఇంకేముంది ఫోన్ స్విచ్ఛాఫ్ చేశాడు.

దీంతో అనుమానం వచ్చిన యువతి విజయవాడలోని తెలిసిన వారి ద్వారా ఎంక్వైరీ చేయడంతో.. సాంబశివరావుకు ఇదివరకే పెళ్లైందని తెలిసింది. అతగాడి సీఈవో ఉద్యోగం కూడా వట్టిదేనని క్లారిటీ వచ్చింది. ఇక… మోసపోయానని గుర్తించిన బాధితురాలు, పెందుర్తి పోలీసులను ఆశ్రయించింది. యువతి ఇచ్చిన వివరాల మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు.

Also Read:  ఏపీలో ఈ రాత్రి నుంచి కర్ఫ్యూ అమలు.. ఏయే కార్యకలాపాలకు వెసులుబాటు, వేటికి పూర్తి స్థాయి ఆంక్షలు.. ఒక లుక్

 ఇంట‌ర్వ్యూతో సౌత్ సెంట్ర‌ల్ రైల్వేలో మెడిక‌ల్ స్టాఫ్ ఉద్యోగాలు.. రిజిస్ట్రేష‌న్ ఎప్ప‌టి నుంచటే..