Ap night curfew : ఏపీలో ఈ రాత్రి నుంచి కర్ఫ్యూ అమలు.. ఏయే కార్యకలాపాలకు వెసులుబాటు, వేటికి పూర్తి స్థాయి ఆంక్షలు.. ఒక లుక్

Andhra pradesh night curfew : ఆంధ్రప్రదేశ్‌లో ఇవాల్టి నుంచి రాత్రి పూట కర్ఫ్యూ అమలుకు విధివిధానాలు ఖరారు చేస్తూ జగన్ సర్కారు ఉత్తర్వులు జారీ చేసింది...

Ap night curfew : ఏపీలో ఈ రాత్రి నుంచి కర్ఫ్యూ అమలు.. ఏయే కార్యకలాపాలకు వెసులుబాటు, వేటికి పూర్తి స్థాయి ఆంక్షలు.. ఒక లుక్
Ap curfew
Follow us
Venkata Narayana

|

Updated on: Apr 24, 2021 | 6:14 PM

Andhra pradesh night curfew : ఆంధ్రప్రదేశ్‌లో ఇవాల్టి నుంచి రాత్రి పూట కర్ఫ్యూ అమలుకు విధివిధానాలు ఖరారు చేస్తూ జగన్ సర్కారు ఉత్తర్వులు జారీ చేసింది. కోవిడ్ వ్యాప్తి నిరోధక చర్యల్లో భాగంగా రాత్రి 10 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకూ కర్ఫ్యూ అమల్లో ఉంటుంది. 24 తేదీ రాత్రి నుంచి తదుపరి ఉత్తర్వులు ఇచ్చేంత వరకూ రాత్రిపూట కర్ఫ్యూ ఉంటుంది. కర్ఫ్యూ సమయంలో ఏ సేవలు అందుబాటులో ఉంటాయి, వేటిని పూర్తిగా మూసి ఉంచుతారు అనే విషయాలు ఈ విధంగా ఉన్నాయి.

అన్ని కార్యాలయాలు, వాణిజ్య సంస్థలు, దుకాణాలు, రెస్టారెంట్లు, హోటళ్లు మూసివేయాలని ఆదేశాలు > ఆస్పత్రులు, డయాగ్నస్టిక్ ల్యాబ్ లు, ఫార్మసీలు, అత్యవసర సేవలందించే కార్యాకలాపాలకు మాత్రమే కర్ఫ్యూ టైమ్ లో పనిచేస్తాయి > ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా, టెలికమ్యూనికేన్లు, ఇంటర్నెట్, కేబుల్ సేవలు, పెట్రోలు పంపులు, విద్యుత్ ఉత్పత్తి, సరఫరా, పంపిణీ సంస్థల కార్యాలయాలకు కర్ఫ్యూ నుంచి మినహాయింపు ఇచ్చారు. > నీటి సరఫరా, పారిశుధ్య సేవలు, ప్రైవేటు సెక్యూరిటీ సేవలు, ఆహార సరఫరా సేవలకూ కర్ఫ్యూ నుంచి మినహాయింపు ఉంది > ప్రభుత్వం నిర్దేశించిన రంగాలకు చెందిన వ్యక్తులు మినహా మిగతా వారందరి రాకపోకలపై ఆంక్షలు ఉంటాయి > వైద్యులు, ఆస్పత్రి సిబ్బంది, అత్యవసర సేవలు, నర్సింగ్ సిబ్బంది, గర్భిణులు, విమానాశ్రయాలు, రైల్వే స్టేషన్ల నుంచి వచ్చే వ్యక్తుల రాకపోకలకు అనుమతినిస్తారు > అత్యవసర సరకు రవాణా వాహనాలు, అంతర్రాష్ట్ర సరకు రవాణాకు ఎలాంటి ఆంక్షలు లేవు > ప్రజా రవాణాతో పాటు ఆటోలు ఇతర వాహనాలు నిర్ణీత కర్ఫ్యూ వేళల వరకూ మాత్రమే అనుమతి > కర్ఫ్యూ నిబంధనలు ఉల్లంఘిస్తే డిజాస్టర్ మేనేజ్ మెంట్ యాక్టు కింద కఠినంగా చర్యలు > రాత్రి పూట కర్ఫ్యూ తో పాటు నిబంధనల అమలు చేయాలని జిల్లా కలెక్టర్లు, ఎస్పీలకు ఆదేశాలు

Read also : Lockdown : మే 2 తరువాత ఏ రోజైనా దేశ వ్యాప్తంగా మళ్లీ లాక్‌ డౌన్‌ ప్రకటన ? మోదీ వరుస మీటింగుల సారాంశమిదేనా.?

పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
3 పెళ్లిళ్లు, రూ.1.25 కోట్లు వసూలు ‘లూటీ వధువు’ అరెస్ట్‌.! ఇలా..
3 పెళ్లిళ్లు, రూ.1.25 కోట్లు వసూలు ‘లూటీ వధువు’ అరెస్ట్‌.! ఇలా..