Fake Doctor: పసికందు ఉసురు తీసిన నకిలీ డాక్టర్.. చెప్పా పెట్టకుండా పరార్!
UP Fake Doctor: సమాజంలో ప్రజల ఆరోగ్య అవసరాలను ఆసరగా చేసుకొని నకిలీ డాక్టర్లు ఊరికి ఒకరు పుట్టుకొస్తున్నారు. అత్యంత పవిత్రమైన వైద్య వృత్తికే కలంకం తెస్తున్నారు.

సమాజంలో ప్రజల ఆరోగ్య అవసరాలను ఆసరగా చేసుకొని నకిలీ డాక్టర్లు ఊరికి ఒకరు పుట్టుకొస్తున్నారు. అత్యంత పవిత్రమైన వైద్య వృత్తికే కలంకం తెస్తున్నారు. ప్రజల ప్రాణాలను కాపాడడానికి వైద్యులుగా పని చేయాల్సిన చోట, నకిలీ వైద్యులు ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారు. ఈజీ గా డబ్బు సంపాదించడం కోసం ఎలాంటి విద్యార్హతలు లేకుండా, డాక్టర్ అవతారమెత్తి ప్రజలను మోసం చేస్తున్నారు. తాజాగా అటువంటి ఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో వెలుగులోకి వచ్చింది.
అట్టా జిల్లాలోని అలీగంజ్ ప్రాంతంలో చికిత్స పొందుతూ చిన్నారి మృతి చెందిన కేసులో ఫేక్ డాక్టర్‌పై కేసు నమోదైంది. అలీగంజ్ ప్రాంతానికి చెందిన హరిశంకర్ తన రెండున్నర నెలల చిన్నారి ఆనారోగ్యంతో తిలక్ సింగ్ ఆసుపత్రికి వచ్చాడు. దీంతో అతనికి అత్యవసరంగా శస్త్ర చికిత్స చేయాలంటూ చికిత్స మొదలు పెట్టాడు. చిన్నారికి ఆపరేషన్ చేయడంతో తీవ్ర రక్తస్రావం కావడంతో పాప బుధవారం మృతి చెందింది. పసికందు మృతి గురించి కుటుంబ సభ్యులకు తెలియజేయకుండా తిలక్ సింగ్ పారిపోయాడు. దీంతో కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ వ్యవహారంపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేశామని పోలీసులు తెలిపారు. మరోవైపు దీనిపై విచారణకు ఆదేశించామని చీఫ్ మెడికల్ ఆఫీసర్ ఉమేష్ చంద్ర త్రిపాఠి తెలిపారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..