AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Amruta Fadnavis: డిఫ్యూటీ సీఎం భార్యకు బెదిరింపులు.. మహిళా డిజైన‌ర్‌పై కేసు నమోదు

Amruta Fadnavis: డిజైన‌ర్‌ అనిక్‌షా తండ్రి ఓ క్రిమిన‌ల్ కేసులో ఇరుక్కున్నార‌ు. ఆయ‌న్ను కాపాడేందుకు సహయపడాలంటూ డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ భార్య అమృతను ఆశ్రయించింది అనిక్ షా.

Amruta Fadnavis: డిఫ్యూటీ సీఎం భార్యకు బెదిరింపులు.. మహిళా డిజైన‌ర్‌పై కేసు నమోదు
Amruta Fadnavis
Balaraju Goud
|

Updated on: Mar 16, 2023 | 1:40 PM

Share

విచిత్రమైన కేసులో మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ భార్య అమృతా ఫడ్నవీస్ చిక్కుకున్నారు. ఒక డిజైనర్‌పై బెదిరింపులు, కుట్ర ఆరోపణలతో ముంబై పోలీసులకు ఫిర్యాదు చేశారు. అమృతా ఫ‌డ్నవీస్.. ముంబైకి చెందిన ఓ లేడీ డిజైన‌ర్‌పై కేసు పెట్టారు. అనిక్‌షా అనే మ‌హిళ‌తో పాటు ఆమె తండ్రిపై ఎఫ్ఐఆర్‌లో ఫిర్యాదు చేశారు. డిజైన‌ర్ అనిక్‌షా త‌న‌ను బెదిరిస్తున్నట్లు, త‌న‌కు లంచం ఇచ్చేందుకు ప్రయ‌త్నించిన‌ట్లు అమృత త‌న ఎఫ్ఐఆర్‌లో ఆరోపించారు.

డిజైన‌ర్‌ అనిక్‌షా తండ్రి ఓ క్రిమిన‌ల్ కేసులో ఇరుక్కున్నార‌ు. ఆయ‌న్ను కాపాడేందుకు సహయపడాలంటూ డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ భార్య అమృతను ఆశ్రయించింది అనిక్ షా. ఇందుకు కోసం కోటి రూపాయాలు ఇచ్చేందుకు ఆశజూపిందంటూ అమృతా ఫ‌డ్నవీస్ ఆరోపించారు. ఫిబ్రవ‌రి 18,19 తేదీల్లో డిజైన‌ర్ అనిక్‌షా త‌న‌కు వీడియో క్లిప్‌ల‌ను, వాయిస్ నోట్స్‌, మెసేజ్‌ల‌ను పంపిన‌ట్లు అమృత త‌న ఫిర్యాదులో పేర్కొన్నారు. అమృత ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా ముంబై పోలీసులు డిజైన‌ర్‌ అనిక్ షాపై కేసు న‌మోదు చేశారు.

2021 న‌వంబ‌ర్‌లో అమృత‌ను తొలిసారి ఆ మ‌హిళ క‌లిశారు. బట్టలు, జువెల్లరీ, పూట్ వేర్ డిజైనర్ అంటూ దగ్గరైంది. అయితే తాను రూపొందిచిన దుస్తులు, జువెల్లరీని ప‌బ్లిక్ ఈవెంట్స్ సమ‌యంలో వేసుకోవాల‌ని కోరిన‌ట్లు అమృత చెప్పారు. ప్రమోష‌న్ కోసం ఆ ప‌నిచేయాల‌ని ఆ డిజైన‌ర్‌ కోరిన‌ట్లు అమృత వెల్లడించారు. ఇలా తరుచు కలిసేందని ఫిర్యాదు పేర్కొన్నారు. ఈ క్రమంలోన తన తండ్రిపై ఉన్న కేసును ఎత్తేవేసేందుకు కోటి రూపాయల ఆశజూపినట్లు అమృతా ఫడ్నవీస్ ఫిర్యాదులో పేర్కొన్నారు. కాగా, సదరు మహిళను అదుపులోకి తీసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
ముంబైపై ఘన విజయం.. ప్లేఆఫ్ రేస్‌లోకి కేకేఆర్ ఎంట్రీ..!
ముంబైపై ఘన విజయం.. ప్లేఆఫ్ రేస్‌లోకి కేకేఆర్ ఎంట్రీ..!
భానుడి భగభగలు..! ఎండల్లో ఎలాంటి డ్రింక్స్ తాగాలి? వేటికి దూరంగా..
భానుడి భగభగలు..! ఎండల్లో ఎలాంటి డ్రింక్స్ తాగాలి? వేటికి దూరంగా..
సోషల్ మీడియా స్టార్ కుర్చీతాత హఠాన్మరణం.. ఏం జరిగిందంటే?
సోషల్ మీడియా స్టార్ కుర్చీతాత హఠాన్మరణం.. ఏం జరిగిందంటే?
2026లో కెరీర్ గ్రోత్ కోసం హైదరాబాద్ టాప్ 10 కంపెనీలు ఇవే..
2026లో కెరీర్ గ్రోత్ కోసం హైదరాబాద్ టాప్ 10 కంపెనీలు ఇవే..
పిడుగురాళ్లలో 47.6, నిర్మల్‌లో 46.5 డిగ్రీలు.. సూరీడుతో జాగ్రత్త
పిడుగురాళ్లలో 47.6, నిర్మల్‌లో 46.5 డిగ్రీలు.. సూరీడుతో జాగ్రత్త
ఊరు పెరిగింది.. జనాభా పెరిగింది.. ట్రాఫికర్ మాత్రం షేమ్‌టుసేమ్
ఊరు పెరిగింది.. జనాభా పెరిగింది.. ట్రాఫికర్ మాత్రం షేమ్‌టుసేమ్
ఒకే FDలో మొత్తం డబ్బు పెట్టేస్తున్నారా? తప్పు చేస్తున్నట్లే!
ఒకే FDలో మొత్తం డబ్బు పెట్టేస్తున్నారా? తప్పు చేస్తున్నట్లే!
పెరుగు బాగా పులిసిపోయిందా? పారేయకండి.. ఈ 4 వంటకాలతో పాటు మీ ఇళ్లు
పెరుగు బాగా పులిసిపోయిందా? పారేయకండి.. ఈ 4 వంటకాలతో పాటు మీ ఇళ్లు
సమ్మర్‌ స్పెషల్ హెల్తీ బ్రేక్‌ఫాస్ట్‌..ఈ గులాబీ రంగు ఇడ్లీలు ట్రై
సమ్మర్‌ స్పెషల్ హెల్తీ బ్రేక్‌ఫాస్ట్‌..ఈ గులాబీ రంగు ఇడ్లీలు ట్రై
రోజుకు 2 అరటిపండ్లు తింటే ఏం జరుగుతుంది..? పెద్ద కథే ఇది..
రోజుకు 2 అరటిపండ్లు తింటే ఏం జరుగుతుంది..? పెద్ద కథే ఇది..