ఛత్తీస్‌గఢ్‌లో ఏనుగుల మరణ మృదంగం..గర్భిణీ సహా రెండు మృతి
దేశంలో వరుసగా ఏనుగులు మృత్యువాతపడుతున్నాయి. కొన్ని రోజుల క్రితం కేరళలో బాంబు పేలి గర్భిణీ ఏనుగు మరణించిన సంఘటన మరువక ముందే ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో మరో రెండు ఏనుగులు మృతిచెందాయి.
దేశంలో వరుసగా ఏనుగులు మృత్యువాతపడుతున్నాయి. కొన్ని రోజుల క్రితం కేరళలో బాంబు పేలి గర్భిణీ ఏనుగు మరణించిన సంఘటన మరువక ముందే ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో మరో రెండు ఏనుగులు మృతిచెందాయి. అంతకు ముందు మూడు ఆడ ఏనుగులు మృతిచెందాయి. మృతిచెందిన ఏనుగుల్లో ఓ గర్భిణీ ఏనుగు కూడా ఉన్నట్లు తెలిసింది. వారం వ్యవధిలోనే ఇవన్ని అనుమానాస్పదరీతిలో మృతిచెందాయి.
ధంతారి జిల్లా మోగ్రి గ్రామంలోని బ్యాక్‌వాటర్ సమీపంలోని చిత్తడి నేలలో మృతిచెందిపడి ఉన్న ఏనుగు పిల్లను మంగళవారం గుర్తించారు. జరిగిన ఘటనపై ధంతారి డివిజన్ అటవీ అధికారి అమితాబ్ బాజ్‌పాయ్ స్పందిస్తూ… మృతిచెందిన ఏనుగు పిల్ల వయస్సు మూడున్నరేళ్ళుగా తెలిపారు. నీళ్లు తాగేందుకు బ్యాక్ వాటర్ ప్రదేశానికి వెళ్లి అక్కడి బురద నేలలో చిక్కుకుని చనిపోయి ఉండొచ్చన్నారు. మరొక ఘటనలో రాయగఢ్ జిల్లా ధరంజైగఢ్‌లో మరో ఏనుగు మృతిచెందింది. జంతువుల కోసం వేటగాళ్లు అమర్చిన విద్యుత్ తీగలు తగిలి ఏనుగు మృతిచెందింది. ఏనుగు మృతి ఘటనలో పోలీసులు ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేశారు.