ఇద్దరు పిల్లలను నాలుగో అంతస్తు నుంచి విసిరేసిన తండ్రి
పశ్చిమ బెంగాల్ లో ఓ వ్యక్తి అత్యంత ఘాతుకానికి పాల్పడ్డాడు. అల్లరి చేస్తున్నారని ఇద్దరు చిన్నారులను అపార్టుమెంటులోని 4వ అంతస్తు నుంచి కిందకు విసిరేశాడు.
మనషుల్లో మానవత్వం మంటగలుస్తోంది. రోజు రోజుకి సహానం కొల్పోయి కన్న పిల్లలనే కనికరం లేకుండాపోతోంది. అల్లరి చేస్తున్నారని ఇద్దరి పిల్లలను అత్యంత పాశవికంగా హతమార్చాడు ఓ కసాయి తండ్రి. కలకత్తాలో చోటుచేసుకున్న ఈ ఘటన అందర్ని కలచివేసింది. పశ్చిమ బెంగాల్ లో ఓ వ్యక్తి అత్యంత ఘాతుకానికి పాల్పడ్డాడు. అభం శుభం తెలియని ఇద్దరు చిన్నారుల ప్రాణాలను బలిగొన్నాడు. కలకత్తాలోని బుర్జా బజార్ ప్రాంతంలో ఓ కుటుంబం నివాసముంటోంది. 55సంవత్సరాల వయస్సు కలిగిన ఆ వ్యక్తికి ఇద్దరు పిల్లలు. అల్లరి చేస్తున్నారని ఇద్దరు చిన్నారులను అపార్టుమెంటులోని 4వ అంతస్తు నుంచి కిందకు విసిరేశాడు. ఈ ఘటనలో ఓ చిన్నారి మరణించగా మరో చిన్నారి ఆసుపత్రిలో కొనఉపిరితో కొట్టుమిట్టాడుతోంది. స్థానికుల సమాచారం మేరకు ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారించగా.. చిన్నారులు అల్లరి చేస్తుండడం భరించలేకే వారిని పైనుంచి కిందకు విసిరేశానని ఒప్పుకున్నాడు. అయితే పిల్లలను చంపాలని కాదని, క్షణికావేశంలో ఇద్దరిని పైనుంచి పడేశానని తెలిపారు. కేసు నమోదు చేసిన స్థానిక పోలీసులు దర్యాప్తు చేపట్టారు.