అంబులెన్స్ వాహనంలో మద్యం బాటిళ్లు

అంబులెన్సులో మద్యం తరలిస్తూ పెద్దాపురం చెక్ పోస్టు వద్ద పట్టుబడ్డారు. ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకొన్న పోలీసులు.. వీరి నుంచి 107 మద్యం బాటిళ్లు స్వాధీనం చేసుకొన్నారు.

అంబులెన్స్ వాహనంలో మద్యం బాటిళ్లు
Follow us
Balaraju Goud

|

Updated on: Jun 16, 2020 | 5:56 PM

అక్రమార్కులకు అడ్డదారులు ఎన్నో అన్నట్లు.. శవాలను తరలించే బాక్స్ లో మద్యం బాటిళ్లను తరలిస్తూ పట్టుబడ్డారు. తెలంగాణలో తక్కువ ధరకు దొరుకుతున్న మద్యాన్ని ఆంధ్రాలో అమ్మి సొమ్ము చేసుకోవాలనుకున్న ముగ్గురిని స్పెషల్ ఎన్ఫోర్స్ మెంట్ అధికారులు అరెస్ట్ చేశారు. అంబులెన్సులో మద్యం తరలిస్తూ పెద్దాపురం చెక్ పోస్టు వద్ద పట్టుబడ్డారు. ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకొన్న పోలీసులు.. వీరి నుంచి 107 మద్యం బాటిళ్లు స్వాధీనం చేసుకొన్నారు. అర్థరాత్రి సమయంలో మృతదేహాలను తరలించే అంబులెన్స్ వాహనాన్ని పెద్దాపురం చెక్ పోస్టు వద్ద పోలీసులు తనిఖీలు చేపట్టారు. శవాల పెట్టెలో తీసుకెళ్తున్న మద్యం సీసాలను గుర్తించిన పోలీసులు.. ముగ్గుర్ని అదుపులోకి తీసుకుని మద్యం సీసాలను స్వాధీన పర్చుకొన్నట్టు నందిగామ డీఎస్పీ జీవీ రమణమూర్తి తెలిపారు. అంబులెన్స్ తెలంగాణలోని ఖమ్మం జిల్లా మధిర నుంచి గుంటూరు జిల్లాలోని చిలకలూరిపేటకు వెళ్తున్నట్టు గుర్తించినట్టు చెప్పారు.