AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

తల్లిని చంపిన కొడుకు అరెస్ట్

కన్నతల్లిని కడతేర్చాడు ఓ కసాయి కొడుకు. జూన్ 4 వ తేదీన జరిగిన మర్డర్ కేసును నెల్లూరు జిల్లా పోలీసులు ఛేదించారు. తల్లిని చంపి తప్పించు తిరుగుతున్న వ్యక్తిని ముత్తుకూరు పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్ కి తరలించారు.

తల్లిని చంపిన కొడుకు అరెస్ట్
Balaraju Goud
|

Updated on: Jun 16, 2020 | 3:59 PM

Share

అన్నకు వత్తాసు పలుకుతుందని కన్నతల్లిని కడతేర్చాడు ఓ కసాయి కొడుకు. జూన్ 4 వ తేదీన జరిగిన మర్డర్ కేసును నెల్లూరు జిల్లా పోలీసులు ఛేదించారు. తల్లిని చంపి తప్పించు తిరుగుతున్న వ్యక్తిని ముత్తుకూరు పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్ కి తరలించారు. నెల్లూరు రూరల్‌ పరిధిలోని చేజర్ల మండలం తూర్పుకంభంపాడుకు చెందిన తలపల రమణయ్య, భార్య రమణమ్మలు బాతులు మేపుతూ జీవనం సాగిస్తున్నారు. వీరికి ఇద్దరు కొడుకులు చెంచురామయ్య, రెండో కొడుకు వెంకటేశ్వర్లు. మద్యం మత్తులో చెంచురామయ్య తన తమ్ముడు వెంకటేశ్వర్లు భార్య విజయమ్మను లైంగికంగా వేధించేవాడు. ఈ క్రమంలో ఇద్దరు అన్నదమ్ముల మధ్య నిత్యం గొడవ జరుగుతున్నాయి. ఇదే విషయాన్ని వెంకటేశ్వర్లు పలుమార్లు తల్లి రమణమ్మకి చెప్పిన ఫలితం లేకపోయింది. ఆమె వెంకటేశ్వర్లును తిట్టి, పెద్దకొడుకునే సపోర్ట్‌ చేసింది. ఇదే క్రమంలో జూన్ 4వ తేదీన వీరంతా మండలంలోని పొట్టెంపాడు సమీపంలోని సర్వేపల్లి రిజర్వాయర్‌ వద్దకు బాతులను మేపుకుంటూ వెళ్లారు. ఇక్కడ కూడా అన్నదమ్ములు తీవ్రంగా ఘర్షణ పడ్డారు. అయినా రమణమ్మ పెద్దకొడుకునే సమర్థించింది. దీంతో ఆగ్రహించిన వెంకటేశ్వర్లు కత్తితో తల్లి మెడ నరికి చంపేశాడు. నిందితుడు తల్లి శవాన్ని అక్కడి మిట్టకాలువ తూములో పడేసి పరారయ్యాడు. జూన్ 5వ తేదీన హత్య కేసుగా నమోదు చేశామని నెల్లూరు రూరల్ డీఎస్పీ హరినాథరెడ్డి తెలిపారు. ప్రాథమికంగా దొరికిన ఆధారలతో దర్యాప్తు చేపట్టి నిందితుడు వెంకటేశ్వర్లును అరెస్ట్ చేశామన్నారు. కేసు త్వరగా ఛేదించిన కృష్ణపట్నం సీఐ షేక్‌ ఖాజావలీ, ఎస్సై అంజిరెడ్డి, హెడ్‌కానిస్టేబుల్‌ అశోక్‌లను డీఎస్పీ అభినందించారు.

Follow Us
ఆస్ట్రేలియాకు సొంత గడ్డపైనే షాక్
ఆస్ట్రేలియాకు సొంత గడ్డపైనే షాక్
బంగాళాఖాతంలో మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు..
బంగాళాఖాతంలో మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు..
శ్రావణ మాసంలో నోములు, వ్రతాలు ఎందుకు చేస్తారు? స్త్రీలే ఎక్కువగా
శ్రావణ మాసంలో నోములు, వ్రతాలు ఎందుకు చేస్తారు? స్త్రీలే ఎక్కువగా
వారం రోజుల్లో బంగారం ధర ఒకేసారి ఎంత పెరిగిందో తెలుసా..?
వారం రోజుల్లో బంగారం ధర ఒకేసారి ఎంత పెరిగిందో తెలుసా..?
జయం సినిమాలో కేకపుట్టించిన ఈ బ్యూటీ ఇప్పుడు ఎలా ఉందో తెలుసా..
జయం సినిమాలో కేకపుట్టించిన ఈ బ్యూటీ ఇప్పుడు ఎలా ఉందో తెలుసా..
మీ మొబైల్‌కు వచ్చే స్కామ్ కాల్ వెనుక ఎవరున్నారో తెలుసా..?
మీ మొబైల్‌కు వచ్చే స్కామ్ కాల్ వెనుక ఎవరున్నారో తెలుసా..?
ఆనందం ఆవిరైంది.. చెల్లి సీమంతం ముగిసిన మూడురోజులకే అన్న మృతి
ఆనందం ఆవిరైంది.. చెల్లి సీమంతం ముగిసిన మూడురోజులకే అన్న మృతి
మళ్లీ ఫుడ్‌ ట్రక్కులో దాక్కుంటారా? ట్రంప్‌కు ఇరాన్‌ చురక
మళ్లీ ఫుడ్‌ ట్రక్కులో దాక్కుంటారా? ట్రంప్‌కు ఇరాన్‌ చురక
TET పాసైన వారికి 6,534 విద్యా వాలంటీర్ ఉద్యోగాలు..రాత పరీక్ష లేదు
TET పాసైన వారికి 6,534 విద్యా వాలంటీర్ ఉద్యోగాలు..రాత పరీక్ష లేదు
రక్తం పెరగడానికి హాస్పిటల్స్ చుట్టూ తిరగొద్దు.. ఇది చేర్చండి!
రక్తం పెరగడానికి హాస్పిటల్స్ చుట్టూ తిరగొద్దు.. ఇది చేర్చండి!