నెల్లూరు జిల్లాలో ఘోర రోడ్డుప్రమాదం.. ఇద్దరు మృతి.. నదిలోపడి బాలిక గల్లంతు.. మరో ముగ్గురికి గాయాలు

నెల్లూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. నాయుడుపేట సమీపంలోని స్వర్ణముఖి నదిపై ఉన్న కాజ్‌వే వద్ద శనివారం రాత్రి జరిగిన ప్రమాదంలో ఇద్దరు యువకులు దుర్మరణం పాలవ్వగా, తొమ్మిదేళ్ల బాలిక స్వర్ణముఖి నదిలో గల్లంతైంది.

నెల్లూరు జిల్లాలో ఘోర రోడ్డుప్రమాదం.. ఇద్దరు మృతి.. నదిలోపడి బాలిక గల్లంతు.. మరో ముగ్గురికి గాయాలు
Follow us
Balaraju Goud

|

Updated on: Dec 13, 2020 | 5:09 AM

నెల్లూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. నాయుడుపేట సమీపంలోని స్వర్ణముఖి నదిపై ఉన్న కాజ్‌వే వద్ద శనివారం రాత్రి జరిగిన ప్రమాదంలో ఇద్దరు యువకులు దుర్మరణం పాలవ్వగా, తొమ్మిదేళ్ల బాలిక స్వర్ణముఖి నదిలో గల్లంతైంది. మరో ముగ్గురికి గాయాలయ్యాయి. నాయుడుపేట సమీపంలోని మేనకూరు ప్రైవేటు పరిశ్రమలో విశాఖపట్నానికి చెందిన త్రినాథ్‌ (22), సాయి (25) పనిచేస్తున్నారు. ఇదే క్రమంగా విధులు ముగించుకుని దొరవారిసత్రం మండలం మోదుగులపాళెంకు చెందిన నాగూర్‌ అనే యువకుడి బైక్‌పై నాయుడుపేటకు వస్తున్నారు. వీరి వెనుకే బైక్‌పై తుమ్మూరు గ్రామానికి చెందిన మురళి, ఆయన భార్య సుజాత, కుమార్తె ప్రవల్లిక వెళ్తున్నారు. ఈ క్రమంలో కాజ్‌వేపై వెళ్తుండగా ముగ్గురు యువకులు తమ బైక్‌తో మురళి బైక్‌ను ఎదురుగా వస్తున్న కారు ఢీకొట్టింది. దీంతో ముగ్గురు యువకులకు తీవ్ర గాయాలయ్యాయి. వీరి వెనకాలే ఉన్న మురళి దంపతులతో పాటు కుమార్తె ప్రవల్లిక స్వర్ణముఖి నదిలో పడిపోయారు. గాయాలతో బయటపడ్డ మురళి, సుజాతలు వెంటనే కాజ్‌వే పైకి చేరుకున్నారు. వారి కుమార్తె ప్రవల్లిక నదిలో గల్లతైంది. తీవ్రంగా గాయపడ్డ ముగ్గురు యువకులను స్థానిక ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అయితే, త్రినాథ్, సాయి అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. నాగూర్‌ తీవ్ర గాయాలతో చికిత్సపొందుతున్నాడు. ఈ ఘటనకు సంబంధించి కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. గల్లైంతైన బాలిక కోసం గాలింపు చేపట్టారు.

గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!