Andhra Pradesh: విహార యాత్రకు వెళ్తుండగా ఊహించని ప్రమాదం.. ముగ్గురు యువకులు మృతి

స్నేహితుడి పుట్టినరోజు వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. విహార యాత్రగా అరకు వెళ్తున్నారు. ఆనందంగా సాగిపోతున్న వారి ప్రయాణంలో ఊహించని అతిథిలా మృత్యువు దూసుకొచ్చింది. వేగంగా ప్రయాణిస్తున్న కారు విద్యుత్ స్తంభాన్ని....

Andhra Pradesh: విహార యాత్రకు వెళ్తుండగా ఊహించని ప్రమాదం.. ముగ్గురు యువకులు మృతి
Accident
Follow us
Ganesh Mudavath

|

Updated on: Jun 29, 2022 | 3:16 PM

స్నేహితుడి పుట్టినరోజు వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. విహార యాత్రగా అరకు వెళ్తున్నారు. ఆనందంగా సాగిపోతున్న వారి ప్రయాణంలో ఊహించని అతిథిలా మృత్యువు దూసుకొచ్చింది. వేగంగా ప్రయాణిస్తున్న కారు విద్యుత్ స్తంభాన్ని ఢీ కొట్టింది. ఈ ఘటనలో ముగ్గురు యువకులు అక్కడికక్కడే మృతి చెందగా.. మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. రాజమహేంద్రవరం రూరల్ ధవళేశ్వరానికి చెందిన ఆరుగురు యువకులు పుట్టినరోజు వేడుకలు చేసుకునేందుకు ధవళేశ్వరం వెళ్లారు. బర్త్ డే పార్టీ చేసుుకని విశాఖపట్నం కు షిఫ్ట్ డిజైర్ కారు లో వెళ్తున్నారు. అర్ధరాత్రి సమయంలో హుకుంపేట సమీపంలో వీరు ప్రయాణిస్తున్న కారు.. విద్యుత్ స్తంభాన్ని బలంగా డీ కొట్టింది. ఈ ఘటనలో ముగ్గురు యువకులు అక్కడికక్కడే దుర్మరణం చెందారు. మృతి చెందిన వారు వెంకటేశ్, సురేశ్, గణేశ్ లు గా గుర్తించారు.

మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే అప్రమత్తమైన స్థానికులు క్షతగాత్రులను వైద్య చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. అనంతరం పోలీసులకు సమాచారం అందించారు. వారు ఘటనాస్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతులు ధవళేశ్వరంకు చెందిన యువకులుగా పోలీసులు గుర్తించారు. ప్రమాదంపై కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని క్రైమ్ వార్తల కోసం  ఈలింక్ క్లిక్ చేయండి

గోవా నుంచి వచ్చిన రైల్లో పోలీసుల తనిఖీలు.. ఓ భోగీలో
గోవా నుంచి వచ్చిన రైల్లో పోలీసుల తనిఖీలు.. ఓ భోగీలో
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో