AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పెంపుడు కుక్కకు ఉన్న విశ్వాసం కన్నకొడుకుకు లేకపోయింది.. తల్లిని ఈడ్చిపడేసిన కుమారుడిని శునకం ఎంచేసిందంటే?

మనుషుల్లో మానవత్వం మంటగలుస్తోంది. రక్తసంబంధాలన్ని.. ఆర్థిక బంధాలవుతున్నాయి. పేగు బంధాలు సైతం కర్కశంగా మారిపోతున్నాయి. కన్న ప్రేమను మరచి దారుణంగా వ్యవహరిస్తున్నారు?

పెంపుడు కుక్కకు ఉన్న విశ్వాసం కన్నకొడుకుకు లేకపోయింది.. తల్లిని ఈడ్చిపడేసిన కుమారుడిని శునకం ఎంచేసిందంటే?
Son Dragged Mother
Balaraju Goud
|

Updated on: Aug 22, 2021 | 4:14 PM

Share

Son Dragged his Mother: మనుషుల్లో మానవత్వం మంటగలుస్తోంది. రక్తసంబంధాలన్ని.. ఆర్థిక బంధాలవుతున్నాయి. పేగు బంధాలు సైతం కర్కశంగా మారిపోతున్నాయి. కన్న ప్రేమను మరచి దారుణంగా వ్యవహరిస్తున్న ఘటనలు ఎన్నో.. తల్లిదండ్రులు బతికుండగానే వారిని మానసికంగా, శారీరకంగా హింసిస్తున్నారు కొంతమంది పిల్లలు. ఈ క్రమంలోనే కన్న తల్లి అని చూడకుండా ఈడ్చిపడేశాడు ఓ కసాయి కొడుకు. కనీసం ఓ పెంపుడు కుక్కకు ఉన్న విశ్వాసం.. కొడుకుకు లేకుండాపోయింది. తాజాగా ఇలాంటి ఘటననే తమిళనాడు రాష్ట్రంలో చోటుచేసుకుంది.

తన తల్లిని బతికుండగానే ఇంటి బయటకు ఈడ్చేశారు. పొదుపు స్కీమ్ లో దాచుకున్న మూడు లక్షలు ఇవ్వాలంటూ తల్లిపై దాడి చేశాడు కుమారుడు. నవమాసాలు మోసి కని పెంచి ప్రయోజకుల్ని చేసిన తల్లికి అండగా నిలిచి ధైర్యం చెప్పాల్సింది పోయి.. ఏకంగా ఆ తల్లిని రోడ్డుపాలు చేశాడు. దీంతో తల్లి ఆవేదన వర్ణనాతీతంగా మారిపోయింది. తమిళనాడులోని నమ్మాకల్ జిల్లా పోన్నేరి పట్టిలో షణ్ముఖం కుటుంబం నివాసముంటోంది. అయితే, షణ్ముఖం తల్లి నల్లాఅమ్మాల్.. ఒక్కొక్క రూపాయి కూడబెడుతూ పొదుపు ఖాతాలో మూడు లక్షల రూపాయలు జమ చేసింది. తనకున్న పొలంలో కొంత భాగంగా రాసి ఇచ్చింది. అంతేకాదు, కొంత సొమ్మును కూడా ఇచ్చేసింది. మిగిలిన డబ్బులను తన పొదుపు ఖాతాలో దాచుకుంది.

అయితే, తల్లి నల్లాఅమ్మాల్ దగ్గర ఉన్న డబ్బులపై కొడుకు షణ్ముఖం కన్నుపడింది. ఎలాగైనా ఆ సొమ్ము ఇవ్వాలంటూ కొడుకు షణ్ముఖం తల్లిని డిమాండ్ చేశాడు. కొడుకుకి ఇది వరకే పొలం రాసిచ్చిన తల్లి నల్లా అమ్మాల్.. డబ్బులు ఇచ్చేందుకు నిరాకరించడంతో.. ఇంటి నుంచి నిర్ధాక్షిణంగా బయటకు ఈడ్చేశాడు. కన్నతల్లి అన్న కనికరం లేకుండా విచక్షణారహితంగా రోడ్డు మీద కొట్టుకుంటూ లాక్కేళ్లాడు. ఇందుకు అతని భార్య కూడా సహకరించింది.

అయితే, ఈ తతంగం అంతా గమనిస్తున్న పెంపుడు కుక్కకు ఉన్న విశ్వాసం కొడుకుకు లేకుండాపోయింది. రోడ్డుపై తల్లి నల్లాఅమ్మాల్ కొడుతున్న షణ్ముఖంని అడ్డగించింది. తల్లిని కొడుతుంటే అడ్డు తగిలిన పెంపుడు కుక్కుని సైతం షణ్ముఖం.. కర్రతో చితిక బాదాడు. ఈ ఘటనను గ్రామస్తులు చూస్తూ ఉండిపోయారు. ఏం చేయలేకపోయారు. తల్లీకి తీవ్ర గాయాలు కావడంతో ఇరుగుపొరుగు వారు ఆమెను ఆసుపత్రికి తరలించారు. కాగా, స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు.. షణ్మఖంను అదుపులోకి తీసుకుని పోలీసు స్టేషన్‌కు తరలించారు. అతనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని నమ్మకల్ పోలీసులు తెలిపారు.

Read Also… MAA Elections: “మా” కథ మళ్లీ మొదటికే.. మోహన్ బాబు వివాదాస్పద వ్యాఖ్యలు.. ఓవరాల్ కన్‌క్లూజన్ ఇది