MAA Elections: “మా” కథ మళ్లీ మొదటికే.. మోహన్ బాబు వివాదాస్పద వ్యాఖ్యలు.. ఓవరాల్ కన్‌క్లూజన్ ఇది

"మా" కథ మళ్లీ మొదటికి వచ్చింది. ఎప్పటి నుంచో ఎదురు చూసిన జనరల్ బాడీ మీటింగ్ ముగిసింది. కానీ ఏమీ తేల్లేదు...

MAA Elections: మా కథ మళ్లీ మొదటికే.. మోహన్ బాబు వివాదాస్పద వ్యాఖ్యలు.. ఓవరాల్ కన్‌క్లూజన్ ఇది
Maa Mohan Babu
Ram Naramaneni

|

Aug 22, 2021 | 3:52 PM

“మా” కథ మళ్లీ మొదటికి వచ్చింది. ఎప్పటి నుంచో ఎదురు చూసిన జనరల్ బాడీ మీటింగ్ ముగిసింది. కానీ ఏమీ తేల్లేదు. అధ్యక్ష ఎన్నికలు ఎప్పుడు అన్నదానిపై క్లారిటీ రాలేదు. ఎలక్షన్లు ఎప్పుడు జరపాలన్నదానిపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. ఏకాభిప్రాయం కుదర్లేదు. అందరి సూచనలు విన్నామని.. వారం రోజుల్లో తేదీలు నిర్ణయిస్తామని ప్రకటించింది DRC కమిటీ. అయితే ఓవరాల్‌గా ఎలక్షన్లు ఎంత త్వరగా జరిగితే అంతమంచిదని మెజార్టీ మెంబర్లు అభిప్రాయపడ్డారు. కరోనా పరిస్థితుల కారణంగా మా జనరల్ బాడీ సమావేశం వర్చువల్‌గా నిర్వహించారు.. క్రమశిక్షణ సంఘం అధ్యక్షుడు కృష్ణం రాజు అధ్యక్షతన ఈ మీటింగ్ కొనసాగింది. జనరల్‌ బాడీ మీటింగ్‌ అయిన 21 రోజుల్లోగా ఎన్నికలు పెట్టాలని డిమాండ్ చేశారు ప్రకాశ్‌రాజ్.. ఎంత త్వరగా అయితే అంత త్వరగా ఎలక్షన్లు నిర్వహించాలన్నారు..సెప్టెంబర్ 12న కాకుంటే 19న ఎన్నికలుపెట్టాలని కోరారు ప్రకాష్‌రాజ్‌

జనరల్‌ బాడీ మీటింగ్‌లో మోహన్‌బాబు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.. “మా” కోసం భవనం కొన్నారు.. అమ్మేశారని విమర్శించారు. రూపాయికి కొన్న భవనాన్ని అర్ధరూపాయికి అమ్మేశారని దీనిపై ఎవరైనా ఎప్పుడైనా మాట్లాడారా అంటూ నిలదీశారు. ఎవరికి వారే యమునా తీరే అన్నట్లుగా మూవీ ఆర్టిస్ట్స్‌ అసోసియేషన్ తీరు ఉందని ఆరోపించారు. సభ్యులు ఎంత మంది.? ఎందుకు మీటింగ్ పెడుతున్నాం? ఏం జరుగుతోంది అన్న క్లారిటీ కూడా లేకపోతే ఎలా అంటూ ప్రశ్నలు సంధించారు మోహన్ బాబు.

అసలు ఇష్యూ ఏంటంటే…

MAAలో మొదట మొదలైన రచ్చ ఎన్నికలే. రెండేళ్ల కాలానికి ఎన్నుకునే టీమ్‌ కోసం జనవరి, ఫిబ్రవరి టైమ్‌లో ఎన్నికలు జరగాలి. కానీ కరోనా కారణంగా వాయిదా వేసింది ప్రెజెంట్ అసోసియేషన్‌. కానీ ఏ ఊసూ లేకుండానే నటుడు ప్రకాష్‌ రాజ్‌ తాను పోటీలో ఉన్నానని తెరపైకి రావడంతో లేదు లేదంటూనే అనుకున్న ఎలక్షన్స్‌కు హీట్ మొదలైపోయింది. ప్రస్తుతం పోటీలో ఉన్నది ప్రకాష్‌రాజ్‌, జీవిత పోటీలో ఉన్నామని గట్టిగా చెబుతున్నారు. మంచు విష్ణు కూడా సై అంటున్నారు. అంతా ఒక్కటిగా ఉండి.. ఒక్కతాటిపై ఉండి ఎలక్షన్స్‌ను ఏకగ్రీవం చేయాల్సిన టైమ్‌లో పోటాపోటీ వాతావరణం అసెంబ్లీ పోరునే తలపిస్తోంది. ఈ పోరు ఆలస్యం కాస్తా.. నిధుల దుర్వినియోగం వైపు మళ్లడం సెకండ్‌ వేవ్‌ అనుకోవాలి. నిధుల దుర్వినియోగంపై మొదటగా వాయిస్ రైజ్ చేశారు నటి హేమ. 15రోజుల క్రితం అనుకుంటా.. ఆమె చేసిన ఆ ఆరోపణలు ఫోన్ ఆడియోలో బయటపడ్డాయి.

మా నిధులపై వచ్చిన, చేసిన ఆరోపణలను తీవ్రంగా ఖండించారు నరేష్‌, జీవిత. కరోనా క్లిష్ట పరిస్థితుల్లో సభ్యుల కోసం పనిచేస్తుంటే.. ఇష్టానుసారంగా విమర్శలు చేయడం సరికాదన్నారు. నిధులపై క్లారిటీ ఇచ్చారు. ఉన్న నిధులను కరిగించడం కాదు. సంస్థ అభివృద్ధి, సభ్యుల సంక్షేమం కోసం ప్రముఖుల సాయంతో ఎన్నో కార్యక్రమాలు చేపట్టామన్నారు నరేష్‌. వచ్చే ఏడాదికి మాలో నిధులు జీరో అయిపోతాయన్న హేమ మాటలపై జీవిత కూడా కౌంటర్‌ ఇచ్చారు. ఆమె ఏమన్నారో ఓ సారి విందాం.

ఇక, మాలో ప్రస్తుతం హీట్‌.. సొంత బిల్డింగ్ లేకపోవడం. సో.. ఈ ఎన్నికలు మొత్తం ఇప్పుడు బిల్డింగ్ చుట్టూనే తిరిగుతున్నాయి. ఎన్నికలు వచ్చిన ప్రతీసారి మా అసోసియేషన్‌కు ఓ భారీ భవంతిని నిర్మిస్తామంటూ హామీలు గుప్పిస్తున్నారు. అలా పది పదిహేను ఏళ్లు గడిచిపోయాయి కాని.. హామీ మాత్రం నెరవేరలేదు. పాలకవర్గాలు మారినా.. అధ్యక్షులెవరూ ఈ హామీపై కదల్లేదు. కానీ, పోటీలో ఉన్నానంటున్న మంచు విష్ణు అయితే ఇప్పటికే బిల్డింగ్ కోసం సైట్ చూసి వచ్చారట. అంతా ఓకే అంటే తానే బిల్డింగ్ కట్టించేస్తానంటున్నారు. ఇన్ని పరిణామాల మధ్య నేడు జరిగిన జనరల్ బాడీ మీటింగ్ ఏం తేలకుండానే ముగిసింది.

Also Read: అతడి పొట్టలో రూ.11 కోట్ల విలువైన డ్రగ్స్.. అధికారులు షాక్.. ఫుడ్, వాటర్ వద్దనడంతో

అక్కాచెల్లెళ్లతో రాఖీలు కట్టించుకున్న ఏపీ, తెలంగాణ లీడర్స్.. ఫోటోలు

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu