- Telugu News Photo Gallery Cinema photos Actress nadiya tests positive for covid 19 despite being fully vaccinated
Nadiya: తెలుగు తెర అందాల అత్తకు కోవిడ్ పాజిటివ్.. వ్యాక్సిన్ తీసుకున్నా వదలని మహమ్మారి..
దేశ వ్యాప్తంగా కరోనా మహమ్మారి మరోసారి విజృంభిస్తుంది. గత కొన్ని నెలలుగా తగ్గుతూ వస్తోన్న కోవిడ్ కేసులు ఇటీవల క్రమంగా పెరుగుతున్నాయి. దీంతో కోవిడ్ జాగ్రత్తలు పాటించాలని ప్రభుత్వాలు హెచ్చరిస్తున్నారు. అందరూ వ్యాక్సిన్ తీసుకోవాలని సూచిస్తున్నారు.
Updated on: Aug 22, 2021 | 11:57 AM

కరోనా మహమ్మారి చిత్ర పరిశ్రమపై తీవ్ర ప్రభావం చూపిన సంగతి తెలిసిందే. కోవిడ్ భారీన పడి పలువురు బాల సుబ్రమణ్యం వంటి ప్రముఖులు ప్రాణాలు కోల్పోగా.. మరికొందరు మహమ్మారిని జయించారు.

ఇదే క్రమంలో కరోనా వ్యాక్సిన్ పట్ల సెలబ్రెటీలు సామాన్యులకు అవగాహన కల్పిస్తున్న సంగతి తెలిసిందే. కోవిడ్ టీకా వేసుకోవడం వలన కరోనాను కట్టడి చేయవచ్చని సూచిస్తున్నారు. అయితే టీకా తీసుకున్నప్పటికీ మహమ్మారీ మాత్రం వదలడం లేదు.

తాజాగా ప్రముఖ నటి నదియా కరోనా బారీన పడ్డారు. ఇటీవల జరిపిన పరీక్షలో ఆమెకు కోవిడ్ పాజిటివ్‌గా తెలీంది. అయితే కోవిడ్ వ్యాక్సిన్ తీసుకున్నప్పటికీ కరోనా సోకిందని నదియా తెలిపింది.

మేలో నదియా వ్యాక్సిన్ సెకండ్ డోస్ తీసుకుంది. కరోనాను జయించడానికి టీకా తప్పనిసరి అంటూ నదియా వెల్లడించింది. అయితే దురదృష్టవశాత్తు ఇప్పుడు ఆమె కరోనా భారీన పడ్డారు.

తెలుగు చిత్రపరిశ్రమలో తన నటనతో ప్రత్యేక స్థానాన్ని ఏర్పర్చుకున్నారు నదియా. తెలుగు, తమిళ్ భాషలలో అనేక సినిమాల్లో నటించిన నదియా. గత కొద్ది రోజులు సినిమాలకు దూరంగా ఉన్నారు.

డార్లింగ్ ప్రభాస్ నటించిన మిర్చి సినిమాతో తెలుగులోకి రీఎంట్రీ ఇచ్చింది నదియా. ఆ తర్వాత దృశ్యం, అత్తారింటికి దారేది వంటి చిత్రాలతో ప్రశంసలు అందుకుంది.

ప్రస్తుతం నదియా తెలుగులో దృశ్యం 2 సినిమా చేస్తుంది. ఈ మూవీ షూటింగ్ హైదరాబాద్‌లో జరుగుతుంది. ఈ చిత్రానికి జీతూ జోసెఫ్ దర్శకత్వం వహిస్తున్నారు.





























