AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Drugs: అతడి పొట్టలో రూ.11 కోట్ల విలువైన డ్రగ్స్.. అధికారులు షాక్.. ఫుడ్, వాటర్ వద్దనడంతో

డ్రగ్స్ దందా కలవరపెడుతోంది. మత్తు పదార్థాలను దేశంలోకి తెచ్చేందుకు అక్రమార్కులు ఎంతకైనా తెగిస్తున్నారు. తాజాగా 1.3 కేజీల కొకైన్...

Drugs: అతడి పొట్టలో రూ.11 కోట్ల విలువైన డ్రగ్స్.. అధికారులు షాక్.. ఫుడ్, వాటర్ వద్దనడంతో
Drugs
Ram Naramaneni
|

Updated on: Aug 22, 2021 | 3:04 PM

Share

డ్రగ్స్ దందా కలవరపెడుతోంది. మత్తు పదార్థాలను దేశంలోకి తెచ్చేందుకు అక్రమార్కులు ఎంతకైనా తెగిస్తున్నారు. తాజాగా 1.3 కేజీల కొకైన్ ప్యాకెట్లను పొట్టలో దాచుకుని తరలిస్తున్న ఆఫ్రికా దేశస్థుడు బెంగళూరు ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌లో పట్టుబడ్డాడు. అతను దుబాయ్​ నుంచి వచ్చాడు. విమానంలో ఇచ్చిన ఆహారాన్ని, నీటిని అతడు తీసుకోలేదు. దీంతో అనుమానం వచ్చిన అధికారులు.. అతడిని స్కాన్​ చేయగా పొట్టలో కొకైన్ పదార్థం ఉన్నట్లు గుర్తించి.. అరెస్ట్ చేశారు. డాక్టర్ల సహాయంతో కొకైన్​ను బయటకు తీశారు. పట్టుబడ్డ  1.3 కిలోల కొకైన్​ విలువ రూ.11 కోట్లు ఉంటుందని అధికారులు వెల్లడించారు. దక్షిణాఫ్రికాలో ఓ గుర్తుతెలియని వ్యక్తి.. నిందితుడిని బెంగళూరుకు పంపించాడు. అతడికి ఓ లగ్జరీ హోటల్​లో గది బుక్ చేశాడని.. అధికారుల విచారణలో తేలింది.  అక్కడ నుంచి పంపిన వ్యక్తి ఎవరు, అది ఎవరికి సప్లై చేయడానికి వచ్చాడు అనే వివరాలను అధికారులు ఆరా తీస్తున్నారు. ప్రస్తుతం విచారణ కొనసాగుతోందని తెలిపారు. నిందితుడు తొలుత నేరాన్ని ఒప్పుకోలేదు. తర్వాత కడుపులో ఇబ్బందిగా ఉండటంతో పోలీసులను ఆస్పత్రికి తీసుకువెళ్లాలని కోరాడు.

నిందితుడి వయసు 30 ఏళ్లు ఉంటుందని, బెంగళూరులో కిడ్నీ చికిత్స కోసం వస్తున్నట్టు వీసాను కూడా వైద్యం కోసం తీసుకున్నాడని డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ అధికారి ఒకరు వివరించారు. మంగళవారం రాత్రి అతడి అదుపులోకి తీసుకుని హాస్పిటల్‌కి తరలించామని, స్కాన్ చేయడంతో క్యాప్సుల్స్ విషయం బయటపడిందన్నారు. శుక్రవారం సాయంత్రం ఆపరేషన్ నిర్వహించి వాటిని బయటకు తీసినట్టు డీఆర్ఐ అధికారి పేర్కొన్నారు.

ఇటీవల ముంబైలో కూడా ఇదే ఫార్మాట్‌లో

ఇటీవల తూర్పు ఆఫ్రికాలోని మొజాంబిక్‌ దేశానికి చెందిన ఓ వ్యక్తి ముంబై ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌లో పట్టుబడ్డాడు. రూ.10 కోట్ల విలువ చేసే 1.02 కేజీల కొకైన్‌ ఇతని వద్ద పట్టుబడింది. నిందితుడు ఫ్యూమో ఇమాన్యుయేల్‌ జెడెక్వియాస్‌ ఈ మత్తు పదార్థాన్ని క్యాప్సూల్స్‌ రూపంలో పొట్టలో దాచుకొన్నట్టు మాదకద్రవ్యాల నిరోధక విభాగం తెలిపింది. కొకైన్‌తో నింపిన 70 క్యాప్సుల్స్ ఇతడు మింగినట్లు విచారణలో తెలిసింది. వెంటనే అతణ్ని బైకుల్లాలోని జేజే ఆసుపత్రికి తరలించగా.. డాక్టర్లు పలుమార్లు ప్రయత్నించి కొకైన్‌ క్యాప్సూళ్లను వెలికితీశారు. అది దక్షిణ అమెరికాకు చెందిన కొకైన్‌గా గుర్తించినట్లు అధికారులు వెల్లడించారు.

Also Read: అక్కాచెల్లెళ్లతో రాఖీలు కట్టించుకున్న ఏపీ, తెలంగాణ లీడర్స్.. ఫోటోలు

మాస్క్ తీస్తే ఒక భయం.. పెట్టుకుంటే మరొక భయం.!.. డెంటిస్టుల వద్దకు బాధితుల క్యూ

Follow Us
కాలేజీలో తోటి విద్యార్ధిని గన్‌తో కాల్చి చంపిన మరో విద్యార్ధి!
కాలేజీలో తోటి విద్యార్ధిని గన్‌తో కాల్చి చంపిన మరో విద్యార్ధి!
ఆ రెండు సీన్లు యాడ్ చేసి ఉంటే సినిమా బ్లాక్ బస్టర్ అయ్యేది..
ఆ రెండు సీన్లు యాడ్ చేసి ఉంటే సినిమా బ్లాక్ బస్టర్ అయ్యేది..
ఐపీఎల్ 2026 కోసం ఆర్సీబీ ప్లేయర్లకు విరాట్ వార్నింగ్
ఐపీఎల్ 2026 కోసం ఆర్సీబీ ప్లేయర్లకు విరాట్ వార్నింగ్
ప్రియుడి మోజులో భర్తను కాల్చి బూడిద చేసిన భార్య..!
ప్రియుడి మోజులో భర్తను కాల్చి బూడిద చేసిన భార్య..!
గత 15 ఏళ్లలో ఇదే భారీ తగ్గింపు.. రికార్డ్‌ స్థాయిలో తగ్గనున్నాయ్
గత 15 ఏళ్లలో ఇదే భారీ తగ్గింపు.. రికార్డ్‌ స్థాయిలో తగ్గనున్నాయ్
ఈ నాలుగు ఇంట్లో ఉంటే డాక్టర్ తో పనిలేదు.. అన్ని సమస్యలు చెక్
ఈ నాలుగు ఇంట్లో ఉంటే డాక్టర్ తో పనిలేదు.. అన్ని సమస్యలు చెక్
డాక్టర్ బాబు దొంగ తెలివితేటలు.. ఎగ్జాంలో కాపీకి ఏం చేశాడో చూడండి!
డాక్టర్ బాబు దొంగ తెలివితేటలు.. ఎగ్జాంలో కాపీకి ఏం చేశాడో చూడండి!
దేవాన్ష్ బర్త్‌డే వేళ భక్తులకు అల్పాహారం వడ్డించిన నారా కుటుంబం..
దేవాన్ష్ బర్త్‌డే వేళ భక్తులకు అల్పాహారం వడ్డించిన నారా కుటుంబం..
ఐఆర్‌సీటీసీ అరుణాచల మోక్ష యాత్ర ప్యాకేజీ.. ఆధ్యాత్మిక కేంద్రాల..
ఐఆర్‌సీటీసీ అరుణాచల మోక్ష యాత్ర ప్యాకేజీ.. ఆధ్యాత్మిక కేంద్రాల..
జనంపై పేలుతున్న పెట్రో బాంబ్.. ధరలు మళ్లీ పెంపు
జనంపై పేలుతున్న పెట్రో బాంబ్.. ధరలు మళ్లీ పెంపు