గ్యాస్ సిలిండర్ పేలి 10 గుడిసెలు దగ్ధం.. వలస కూలీల్లో తీవ్ర విషాదం
తెలంగాణలోని సంగారెడ్డి(sangareddy) జిల్లాలోని నాగల్ గిద్ద మండలం తొర్నల్ గ్రామ శివారులో భారీ అగ్ని ప్రమాదం(Fire accident) జరిగింది. గ్యాస్ సిలిండర్ పేలడంతో...

తెలంగాణలోని సంగారెడ్డి(sangareddy) జిల్లాలోని నాగల్ గిద్ద మండలం తొర్నల్ గ్రామ శివారులో భారీ అగ్ని ప్రమాదం(Fire accident) జరిగింది. గ్యాస్ సిలిండర్ పేలడంతో ఈ ఘటన జరిగింది. ఈ ప్రమాదంలో 10 గుడిసెలు, 3 ద్విచక్రవాహనాలు, రూ. 2 లక్షలు నగదు, వంట సామగ్రి దగ్ధం అయింది. మండలంలోని శామ్యానాయక్ తండాకు చెందిన వారు.. చెరుకు నరికేందురు వచ్చారు. అక్కడే తాత్కాలికంగా గుడిసెలు ఏర్పాటు చేసుకుంటున్నారు. అందులోనే ఉంటూ.. పనులు చేసుకుని కుటుంబాన్ని పోషించుకుంటున్నారు.
ఈ ఘటన జరిగినప్పుడు గుడిసెల్లో ఎంత మంది ఉన్నారు..? అసలు ఈ ప్రమాదం జరగడానికి కారణాలేంటి..? ఎంత నష్టం వాటిల్లిందనే అంశాలపై పోలీసులు విచారణ జరుపుతున్నారు. మంటలను అదుపులోకి తెచ్చేందుకు అధికారులు, స్థానికులు చర్యలు చేపడుతున్నారు.
Also Read
Hebah Patel: మరోసారి బోల్డ్ కంటెంట్‌నే నమ్ముకుంటున్న కుమారి.. ఈసారి ఇలా..
JP Nadda: బీజేపీ చీఫ్ జేపీ నడ్డా ట్విట్టర్ ఖాతా హ్యాక్.. రష్యా – ఉక్రేయిన్ యుద్ధంపై ఆగంతకుల పోస్టు..