JP Nadda: బీజేపీ చీఫ్ జేపీ నడ్డా ట్విట్టర్ ఖాతా హ్యాక్.. రష్యా – ఉక్రేయిన్ యుద్ధంపై ఆగంతకుల పోస్టు..
JP Nadda's Twitter account hacked: బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ట్విట్టర్ ఖాతా ఆదివారం ఉదయం హ్యాక్ అయింది. దీంతో దేశవ్యాప్తంగా కలకలం రేగింది. బీజేపీ అధినేత ట్విట్టర్‌ను
JP Nadda’s Twitter account hacked: బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ట్విట్టర్ ఖాతా ఆదివారం ఉదయం హ్యాక్ అయింది. దీంతో దేశవ్యాప్తంగా కలకలం రేగింది. బీజేపీ అధినేత ట్విట్టర్‌ను హ్యాక్ చేసిన ఆగంతకులు రష్యా, ఉక్రెయిన్‌లకు సాయం చేయాలంటూ ఒకదాని తర్వాత ఒకటి ట్వీట్లు చేశారు. అయితే.. వెంటనే అప్రమత్తమైన ప్రభుత్వ వర్గాలు చర్యలు ప్రారంభించాయి. వెంటనే దానికి సంబంధించిన అన్ని ట్వీట్లను తొలగించారు. ఆ వెంటనే జేపీ నడ్డా (JP Nadda) ఖాతాను పునరుద్ధరించినట్లు అధికార వర్గాలు తెలిపాయి.
“రష్యా ప్రజలతో నిలబడండి. ఇప్పుడు క్రిప్టోకరెన్సీ విరాళాలను స్వీకరిస్తున్నారు. బిట్‌కాయిన్ – ఎథెరియం” అంటూ ఆగంతకులు ట్వీట్‌లో పేర్కొన్నారు. దీంతోపాటు “ఉక్రెయిన్ ప్రజలతో నిలబడండి. ఇప్పుడు క్రిప్టోకరెన్సీ విరాళాలను అంగీకరిస్తున్నాను.” అంటూ హిందీలో కూడా ట్విట్ చేశారు. దీంతోపాటు పలు కామెంట్లను వరుసగా చేశారు.
BJP national president JP Nadda’s Twitter account hacked. pic.twitter.com/AdZ3fh7pd3
— ANI (@ANI) February 27, 2022
హ్యాక్ గురించి తమకు సమాచారం అందిందని.. CERT (కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్) దానిని పరిశీలిస్తోందని.. ఐటీ మంత్రిత్వశాఖ అధికారి రాజీవ్ చంద్రశేఖర్ వెల్లడించారు.
#UPDATE | BJP national president JP Nadda’s Twitter account restored after it was briefly hacked. pic.twitter.com/WqMjqAkzr7
— ANI (@ANI) February 27, 2022
రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఉక్రెయిన్‌పై యుద్ధం ప్రకటించిన కొద్ది రోజుల తర్వాత తూర్పు యూరోపియన్ దేశంలో భారీ విధ్వంసంతోపాటు ప్రాణనష్టానికి దారితీసింది. ఇంకా రష్యా బలగాలు.. ఉక్రెయిన్‌పై బాంబుల వర్షం కురిపిస్తున్నాయి. ఈ క్రమంలో జేపీ నడ్డా ట్విట్టర్ హ్యాక్ కావడం చర్చనీయాంశంగా మారింది.
Also Read: