AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఒకే కుటుంబానికి చెందిన నలుగురు ఆత్మహత్య.. సూసైడ్ నోట్ లో సంచలన విషయాలు

కష్టాలు అనేవి ప్రతి ఒక్కరి జీవితంలో ఉంటాయి. వాటిని తట్టుకుని ముందుకు సాగాలి గానీ వాటికి భయపడకూడదు. కష్టాలను ఎదుర్కొనేందుకు పరిష్కార మార్గాలు అన్వేషించాలే గానీ వాటికి వెరిసి..

ఒకే కుటుంబానికి చెందిన నలుగురు ఆత్మహత్య.. సూసైడ్ నోట్ లో సంచలన విషయాలు
Ganesh Mudavath
|

Updated on: Feb 27, 2022 | 12:14 PM

Share

కష్టాలు అనేవి ప్రతి ఒక్కరి జీవితంలో ఉంటాయి. వాటిని తట్టుకుని ముందుకు సాగాలి గానీ వాటికి భయపడకూడదు. కష్టాలను ఎదుర్కొనేందుకు పరిష్కార మార్గాలు అన్వేషించాలే గానీ వాటికి వెరిసి నిండు జీవితాన్ని కూల్చుకోవద్దు. కష్టాలను భరించలేక కొందరు ఆత్మహత్యల(Suicide) కూ పాల్పడుతున్నారు. సూసైడ్ చేసుకోవడం అత్యంత నేరం. అది మనపై ఆధారపడిన కుటుంబంపై తీవ్ర ప్రభావం చూపుతుంది. మానసికంగా కుంగిపోయినప్పుడు కూడా మనకు ఆత్మహత్య ఆలోచనలు వస్తుంటాయి. వాటి నుంచి బయటపడేందుకు మానసిక వైద్యులను సంప్రదించాలి. అంతే గానీ బలవంతంగా ప్రాణాలు తీసుకోవడం ఏ మాత్రం హర్షించదగ్గ విషయం కాదు. తాజాగా కేరళ(Kerala) లో ఓ విషాద ఘటన జరిగింది. కష్టాల కడలిని ఈదలేక ఒకే కుటుంబానికి చెందిన నలుగురు వ్యక్తులు ఆత్మహత్య చేసుకున్నారు. వీరిలో ఇద్దరు చిన్నారులు ఉండటం కలచివేస్తోంది. సూసైడ్ గురించి తమకు ముందే సమాచారం ఇచ్చారని, కానీ తాము వెళ్లే సరికి ఘోరం జరిగిపోయిందని మృతుల కుటుంబీకులు రోదించిన తీరు కంటతడి పెట్టించింది.

కేరళలోని పాలక్కడ్ లో దారుణం జరిగింది. కష్టాలను తట్టుకోలేక ఒకే కుటుంబానికి చెందిన నలుగురు వ్యక్తులు ఆత్మహత్య చేసుకున్నారు. సమీపంలోని నదిలో దూకి బలవన్మరణానికి పాల్పడ్డారు. చనిపోయిన వారిలో ఇద్దరు పిల్లలు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. మృతదేహాలను బయటకు తీసేందుకు చర్యలు చేపడుతున్నామన్నారు. ఈ ఘటనపై మృతుల బంధువులు స్పందించారు. కష్టాలను ఎదుర్కొలేకే వారందరూ తనువు చాలించారని కన్నీటి పర్యంతమయ్యారు. శుక్రవారం వారందరూ కనిపించలేదని, వారి ఇంటికెళ్లి చూడగా సూసైడ్ నోట్ దొరికిందని పేర్కొన్నారు. చనిపోయిన నలుగురూ ఎక్కడ, ఎందుకు ఆత్మహత్య చేసుకున్న విషయాన్ని లేఖలో వెల్లడించారని చెప్పారు. ఆ ప్రాంతంలో వారికి సంబంధించిన చెప్పులు, దుస్తులు నది ఒడ్డున పడి ఉండడం చూసి ఆత్మహత్యగా నిర్ధారించుకున్నట్లు వివరించారు.

Also Read

JP Nadda: బీజేపీ చీఫ్ జేపీ నడ్డా ట్విట్టర్ ఖాతా హ్యాక్.. రష్యా – ఉక్రేయిన్ యుద్ధంపై ఆగంతకుల పోస్టు..

Diet For Piles: పైల్స్‌తో బాధపడుతున్నారా.. అయితే ఈ ఆహారాలు అసలు తీసుకొవద్దు..

ప్రేమ పేరుతో శారీరకంగా దగ్గరయ్యాడు.. గర్భం దాల్చడంతో పరారయ్యాడు.. కట్ చేస్తే