Telangana: మహిళల భద్రతకు స్పెషల్ సర్వీస్.. ఉబర్ సంస్థ సమన్వయంతో.. దేశంలోనే మొదటిసారి
ఆడవాళ్ల భద్రత కోసం తెలంగాణ (Telangana) పోలీసులు పెద్ద పీట వేశారు. ఇందుకోసం ఉబర్ సంస్థతో కలిసి ఓ కొత్త సర్వీస్‌ను అందుబాటులోకి తీసుకువచ్చారు. ఫలితంగా రాష్ట్రంలో మహిళల భద్రత మరింత సేఫ్‌గా మారింది. ఇంతకీ పోలీసులు తీసుకొచ్చిన ఆ....

ఆడవాళ్ల భద్రత కోసం తెలంగాణ (Telangana) పోలీసులు పెద్ద పీట వేశారు. ఇందుకోసం ఉబర్ సంస్థతో కలిసి ఓ కొత్త సర్వీస్‌ను అందుబాటులోకి తీసుకువచ్చారు. ఫలితంగా రాష్ట్రంలో మహిళల భద్రత మరింత సేఫ్‌గా మారింది. ఇంతకీ పోలీసులు తీసుకొచ్చిన ఆ కొత్త సర్వీస్ ఏంటో ఈ స్టోరీలో తెలుసుకోండి..!. ఆడవాళ్ల భద్రత కోసం తెలంగాణ పోలీసులు కొత్త ఆలోచన చేశారు. వారి ఆలోచనకు ఉబర్ సంస్థ తోడైంది. ఆడవాళ్ల భద్రత విషయంలో ఇప్పటికే షీ టీమ్స్ (She Teams) , భరోసా సెంటర్లు, ఉమెన్ పోలీస్ స్టేషన్ల ప్రత్యేకమైన సదుపాయాలు అందుబాటులోకి ఉన్నాయి. మహిళలు ఉద్యోగ రీత్యా చాలా సందర్భాల్లో క్యాబ్స్‌లో ఒంటరిగా ప్రయాణించాల్సి ఉంటుంది. అలాంటప్పుడు ఏదైనా ప్రాణాపాయ సమస్య ఎదురైనప్పుడు వారిని కాపాడేలా ఉబర్ (Uber App) తన యాప్‌లో ఓ ఎమర్జెన్సీ ఎస్ఓఎస్ ఆప్షన్‌ను ఏర్పాటు చేసింది. దీంతో ఆపద సమయంలో ఆ బటన్ ప్రెస్ చేస్తే వెంటనే పోలీసులకు వారి సమాచారం చేరుతుంది. అలా సకాలంలో వారిని రక్షించేలా తెలంగాణ పోలీసులు, ఉబర్ సంస్థ కలిసి ఈ కొత్త సర్వీస్‌ను సంయుక్తంగా అందుబాటులోకి తెచ్చాయి.
ఈ సర్వీస్‌ని ఎలా వినియోగించుకోవాలో అడిషనల్ డీజీ స్వాతి లక్రా వివరించారు. ప్రమాదం గుర్తించిన వెంటనే ఉబర్ ఆప్ స్క్రీన్ మీద రైట్ సైడ్ కార్నర్‌లో కింద ఎమర్జెన్సీ ఎస్ఓఎస్ ఆప్షన్ ఉంటుంది. దాన్ని ప్రెస్ చేసినప్పుడు 100 ద్వారా సమాచారం వెంటనే స్థానిక పోలీస్ స్టేషన్, పెట్రోలింగ్ వెహికల్, అలాగే ఉబర్ సంస్థ, మీ కుటుంబ సభ్యులకు ఎమర్జెన్సీ అలర్ట్ వెళుతుందని తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు గూగుల్ మ్యాప్స్ ద్వారా మీరు ఉన్న లొకేషన్‌కి చేరుకుంటారని వెల్లడించారు.
తెలంగాణ పోలీసులతో సంయుక్తంగా ఇలాంటి ఎమర్జెన్సీ సర్వీస్ ప్రారంభించడం చాలా ఆనందంగా ఉందని ఉబర్ సంస్థ ప్రతినిధులు హర్షం వ్యక్తం చేశారు. దేశంలో మొట్టమొదటిసారి తెలంగాణలోనే ఇటువంటి సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకువచ్చామన్నారు. తొందరలో దేశమంతటా ఈ సదుపాయం అందుబాటులోకి వచ్చేలా అప్‌ని రూపొందిస్తామని వివరించారు. ఇటువంటి ఎమర్జెన్సీ సర్వీసుల వల్ల కస్టమర్స్‌లో ఉబర్ పట్ల విశ్వాసం, నమ్మకం మరింత పెరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.




మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..



