Telangana Crime: గ్రామ సర్పంచ్‌ను చెప్పుతో కొట్టిన ఉప సర్పంచ్.. అసలు విషయం తెలిసిన పోలీసుల షాక్!

Balaraju Goud

Balaraju Goud |

Updated on: Sep 30, 2021 | 9:25 PM

నిర్మల్ జిల్లా భైంసా మండలంలోని మహాగావ్ గ్రామ సర్పంచ్, ఉప సర్పంచ్ ఊరు అందరి ముందే దెబ్బలాడుకుంటూ నవ్వులపాలయ్యారు.

Telangana Crime: గ్రామ సర్పంచ్‌ను చెప్పుతో కొట్టిన ఉప సర్పంచ్.. అసలు విషయం తెలిసిన పోలీసుల షాక్!
Deputy Sarpanch Beaten With Chappal On Sarpanch

Deputy Sarpanch beaten Sarpanch: ప్రజలకు సేవ చేస్తారన్న నమ్మకంలో ఓట్లేసిన గెలిపించిన నాయకులే మోసాలకు పాల్పడుతున్నారు. కంచె చేను మేసిందన్న చంధంగా మారింది. గ్రామాభివృద్ధికి కేటాయించాల్సిన నిధులు పక్కదారి పట్టించేందుకు ప్రయత్నించారు. జరిగిన విషయం తెలిసిన జిల్లా అధికారులు విచారణకు వస్తే వారి ముందే చెప్పులతో దాడులు చేసుకున్నారు. ఈ ఘటన నిర్మల్ జిల్లాలో చోటచేసుకుంది.

నిర్మల్ జిల్లా భైంసా మండలంలోని మహాగావ్ గ్రామ సర్పంచ్, ఉప సర్పంచ్ ఊరు అందరి ముందే దెబ్బలాడుకుంటూ నవ్వులపాలయ్యారు. మహాగామ్ గ్రామ సర్పంచ్ అప్పల రాకేష్ పై ఉప సర్పంచ్ శారద దుర్భాషలాడుతూ చెప్పుతో దాడి చేసింది. దీంతో మహాగామ్ గ్రామంలో కొద్దిసేపు ఉద్రిక్తత నెలకొంది. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు రెండు వర్గాలను చెదరగొట్టడంతో గొడవ పోలీసు కేసుల దాకా వెళ్లింది.

మహాగామ్ గ్రామ పంచాయతీ అభివృద్ధి కోసం కేటాయించిన నిధులు దొంగ సంతకాలతో దుర్వినియోగం చేశారన్న ఆరోపణలు వచ్చాయి. దీంతో ఉప సర్పంచ్ శారద జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. దీంతో వెంటనే విచారణ జరపాల్సిందిగా డీఎల్పీఓ శివరామ కృష్ణ ఆధ్వర్యంలో కమిటీని ఏర్పాటు చేశారు జిల్లా కలెక్టర్. గ్రామ సర్పంచ్ రాకేష్ గ్రామ పంచాయతీకి చెందిన నిధులు డ్రా చేసిన చెక్కులను అధికారులు పరిశీలించారు. వాటిపై ఉప సర్పంచ్ సంతకాలు కూడా ఉండడంతో అధికారులు ప్రశ్నించారు. అయితే, తనకు ఇందుకు సంబంధించి ఎలాంటి సమాచారం లేదని, తాను చెక్కులపై సంతకాలు పెట్టలేదని.. తన సంతకాలను ఫోర్జరీ చేశారని ఉప సర్పంచ్ శారద ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే ఇద్దరి మధ్య మాటామాటా పెరగడంతో ఆగ్రహానికి గురైన ఉప సర్పంచ్ శారద.. సర్పంచ్‌ రాకేష్‌పై దాడికి దిగారు.సర్పంచ్ ,ఉప సర్పంచ్ వర్గీయుల మధ్య కొద్దిసేపు తోపులాట జరిగింది. ఈ ఘటనపై సకాలంలో స్పందించిన పోలీసులు ఇరు వర్గాలను చెదరగొట్టి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. కాగా, అక్కడ పరిస్థితిని చిత్రీకరుస్తున్న పంచాయితీ సెక్రటరీ ప్రత్యూష పై కూడా దాడి జరిగింది.

కాగా, ఈ ఘటనకు సంబంధించి ఇరు వర్గాలకు చెందిన నేతలు పోలీసులకు ఫిర్యాదు చేసుకున్నారు. దీంతో కేసు నమోదు చేసుకన్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

Read Also…  AP Jobs: ఏపీ నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల..

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu