Suspicious death: చీరాల రైల్వే ట్రాక్‌పై యువకుడు అనుమానాస్పద మ‌ృతి.. హత్య చేసి ఉంటారని అనుమానాలు

ప్రకాశం జిల్లా, చీరాల శాంతినగర్ రైల్వే ట్రాక్ పై యువకుడు అనుమానస్పద స్దితిలో మృతి చెందిన ఘటన మంగళవారం వెలుగుచూసింది. మృతుడు స్థానిక శాంతినగర్‌కు చెందిన డేవిడ్ రాజుగా పోలీసులు గుర్తించారు..

Suspicious death: చీరాల రైల్వే ట్రాక్‌పై యువకుడు అనుమానాస్పద మ‌ృతి..  హత్య చేసి ఉంటారని అనుమానాలు
Railway Track
Follow us
Venkata Narayana

|

Updated on: Aug 04, 2021 | 10:14 PM

Suspicious death: ప్రకాశం జిల్లా, చీరాల శాంతినగర్ రైల్వే ట్రాక్ పై యువకుడు అనుమానస్పద స్దితిలో మృతి చెందిన ఘటన మంగళవారం వెలుగుచూసింది. మృతుడు స్థానిక శాంతినగర్‌కు చెందిన డేవిడ్ రాజుగా పోలీసులు గుర్తించారు. మృతుడి ఒంటి పై గాయాలు ఉండటం.. మరో పక్క రైలు పట్టాల దగ్గర మృతుదేహం ఉండటంతో మృతిపై అనేక అనుమానాలు రేకెత్తుతున్నాయి.

మృతుడు డేవిడ్ రాజు రైల్ క్రింద పడి ఆత్మహత్యకు పాల్పడ్డాడా…? లేక ఎవరైనా హత్య చేసి రైల్వే ట్రాక్ పై పడవేశారా …? అనే కోణంలో పోలీసులు విచారణ చేపడుతున్నారు. మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం చీరాల ప్రభుత్వ ఏరియా వైద్యశాలకు తరలించారు.

ప్రేమించలేదని యువతిపై కత్తితో దాడి చేసిన ప్రేమోన్మాది.. బోయిన్‌పల్లిలో కలకలం

‘నాకు దక్కనిది ఎవరికీ దక్కనివ్వను..’ ఇదేదో సినిమా డైలాగ్‌ కాదు.. ప్రేమిస్తామంటూ ఉన్మాదిలా మారుతున్న మూర్ఖుల మాట ఇది. ప్రేమిస్తే ప్రాణాలు ఇస్తామంటారు. అదేంటో ఈ మధ్య ప్రాణాలు తీస్తున్నారు. నేను నిన్ను ప్రేమిస్తున్నా. నువ్వు నన్ను ప్రేమిస్తావా లేదా..? ప్రేమిస్తే అంతా సుఖాంతమే. పొరపాటున నో అంటే ప్రేమికుడు కాస్త ఉన్మాదిగా మారతాడు. ప్రేమిస్తావా.. చస్తావా అంటూ నరరూప రాక్షసుడిలా మారతాడు. ఏకంగా కత్తి పట్టి చంపే వరకూ వెళ్తాడు. ప్రేమించిన అమ్మాయికి జీవితాన్ని ఇవ్వాలి కాని.. జీవితమే లేకుండా చేయాలనుకుంటున్నారు ఈ రాక్షసులు.

ప్రేమ అనే రెండు పదాలు కలిసినట్టు.. అది ఇద్దరి మనుసులను కలుపుతుంది. కాని అదే ప్రేమ ఇద్దరిని వేరు చేస్తోంది కూడా. ఇక్కడా అదే జరిగింది. ప్రేమించానంటూ వెంటపడ్డాడు. అమ్మాయి నో అనే సరికి తట్టుకోలేకపోయాడు. అంతే ఏ పాపం చేయకున్నా తన పని తాను చేసుకుంటూ పోతున్న యువతిపై అకారణంగా దాడి చేశాడో వ్యక్తి. హైదరాబాద్‌ బోయిన్‌పల్లి పీఎస్‌ పరిధిలోని బాపూజీనగర్‌లో ఇవాళ ఈ దారుణం చోటు చేసుకుంది. గిరీష్ అనే వ్యక్తి, ప్రేమించమంటూ చామంతి అనే యువతిపై కత్తితో దాడికి పాల్పడ్డాడు. అనంతరం తాను కూడా కత్తితో గాయపర్చుకున్నాడు. తనను ప్రేమించాలని.. పెళ్లి చేసుకోవాలంటూ అమ్మాయి ఇంటి వద్దకు వచ్చి కత్తితో దాడికి తెగబడ్డాడు. కడుపులో పొడిచి అమ్మాయి ప్రాణాలతో చెలగాటమాడాడు.

అరుపులు విన్న స్థానికులు వెళ్లి చూసే సరికే రక్తపుమడుగులో పడిపోయింది ఆ అభాగ్యురాలు. ఇంటి పక్కనున్న కారిడార్ లో గిరీష్ కూడా కత్తిగాట్లుతో పడి ఉన్నాడు. దీంతో హుటాహుటిన ఇద్దర్నీ ఆస్పత్రికి తరలించారు. చామంతి స్థానికంగా ఉండే సూపర్ మార్కెట్లో పనిచేస్తోంది. ఈ దాడికి ప్రేమ వ్యవహారమే కారణమని భావిస్తున్నారు పోలీసులు. ఘటనా స్థలికి క్లూస్ టీం చేరుకొని పరిశీలిస్తోంది. గిరీష్.. అమ్మాయి ఇంటికి రావడం ఇదే మొదటిసారి కావొచ్చని స్థానికులు చెబుతున్నారు. ఇంట్లో నుంచి ఒక్కసారిగా అరుపులు వినబడడంతో తాము వెళ్లి చూసేసరికే బాధిత యువతి రక్తపుమడుగులో ఉన్నట్లు స్థానికులు పేర్కొన్నారు.

Read also: Dalita Bandhu: వాసాల‌మ‌ర్రి నుంచే ‘ద‌ళిత బంధు’, దళితుల అకౌంట్లలో రేపే 10 ల‌క్షల చొప్పున‌ జ‌మ‌.. సీఎం కేసీఆర్ ప్రకటన