విజయ్ మాల్యాకు ‘‘సుప్రీం’’ వార్నింగ్.. అక్టోబర్ 5న హాజరవ్వాలని ఆదేశం

బ్యాంకులకు టోకరా పెట్టి విదేశాల్లో బలాదూర్ తిరిగుతున్న వ్యాపారవేత్త విజయ్ మాల్యాకు సుప్రీంకోర్టు షాక్ ఇచ్చింది. అక్టోబర్ 5న మధ్యాహ్నం 2:00 గంటలకు విజయ్ మాల్యాను తమ ముందు హాజరుపర్చాలని కేంద్ర హోంమంత్రిత్వ శాఖను దేశ అత్యున్నత ధర్మాసనం ఆదేశించింది.

Follow us

|

Updated on: Aug 31, 2020 | 8:35 PM

బ్యాంకులకు టోకరా పెట్టి విదేశాల్లో బలాదూర్ తిరిగుతున్న వ్యాపారవేత్త విజయ్ మాల్యాకు సుప్రీంకోర్టు షాక్ ఇచ్చింది. అక్టోబర్ 5న మధ్యాహ్నం 2:00 గంటలకు విజయ్ మాల్యాను తమ ముందు హాజరుపర్చాలని కేంద్ర హోంమంత్రిత్వ శాఖను దేశ అత్యున్నత ధర్మాసనం ఆదేశించింది.

సుప్రీంకోర్టు ఉత్తర్వులను ఉల్లంఘించి, తన ఆస్తులను పిల్లలకు బదిలీచేసిన వ్యాపారవేత్త విజయ్ మాల్యా కోర్టు ధిక్కార నేరానికి పాల్పడిన విషయం తెలిసిందే. దీనిపై సుప్రీం ఆగ్రహం వ్యక్తం చేసింది. కాగా, అంతకు ముందు కోర్టు ధిక్కారం కేసులు దోషిగా తేలిన ఉత్తర్వులను సమీక్షించాలని కోరుతూ మాల్యా దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు సోమవారం కొట్టివేసింది.కోర్టు ఉత్తర్వులను ధిక్కరించి.. తన పిల్లలకు 40 మిలియన్ డాలర్ల విలువైన ఆస్తులను విజయ్ మాల్యా బదిలీ చేసినట్టు రుజువు అయ్యింది. దీంతో దేశ అత్యున్నత న్యాయస్థానం ఆయనను దోషిగా నిర్ధారించింది. బ్యాంకుల నుంచి వేల కోట్లు రుణం తీసుకుని, ఎగవేసిన విజయ్ మాల్యా ప్రస్తుతం లండన్‌లో తలదాచుకున్న విషయం విదితమే.

కాగా, 2016 నుంచి బ్రిటన్‌లో ఉన్న విజయ్ మాల్యాకు స్కాట్‌లాండ్ యార్డు కోర్టు 2017 ఏప్రిల్ 18న బెయిల్ మంజూరు చేసింది. నాటి నుంచి అక్కడే ఉన్న ఆయనను భారత్‌కు రప్పించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. విజయ్ మాల్యాకు ఆశ్రయం కల్పించవద్దని కేంద్ర విదేశాంగ‌శాఖ జూన్ 11న బ్రిటన్‌ను కోరింది. మరోవైపు, విజయ్ మాల్యాను భారత్‌కు అప్పగించేందుకు బ్రిటన్ సర్కార్ కూడా చర్యలు చేపట్టింది. అయితే, ఇందుకు సంబంధించి న్యాయ ప్రక్రియ పూర్తికావల్సి ఉంది.

బాసర IIITలో మరో విద్యార్థి‌ సూసైడ్‌.. అసలేం జరుగుతోందక్కడ?

రోడ్డు ప్రమాదంలో మృతి చెందిందన్నారు.. కట్ చేస్తే.. ఎంక్వయిరీతో.!

హైదరాబాదీలకు అలర్ట్‌.. మధ్యాహ్నం ఆర్టీసీ బస్సుల కోసం చూస్తున్నారా

పాపం ఇరుకున్న స్వప్న.. వెన్నెల కోసం టెన్షన్‌గా ఎదురు చూపులు..

తిరుమల వెళ్లేవారికి ముఖ్య అలెర్ట్.. ఈ విషయం మీకు తెలుసా.?

కోడి గుడ్డు కోసం లక్షలు.. మూడు రోజుల పాటు జరిగిన వేలం..ఎగబడ్డ జనం

237 స్ట్రైక్‌రేట్‌తో ఊచకోత.. కట్‌చేస్తే.. టీ20 ప్రపంచకప్‌లో చోటు?

వన్‌ప్లస్‌ 11పై మరోసారి డిస్కౌంట్‌.. ప్రీమియం ఫోన్‌ ధర ఎంతంటే

జుట్టుకు హెన్నా పెడుతున్నారా? పెరుగు, నిమ్మ రసం అస్సలు కలపొద్దు

బీజేపీ అభ్యర్థి ఖరారు.. సికింద్రాబాద్ కంటోన్మెంట్‌లో త్రిముఖ పోటీ