తల్లి, సోదరుడిని కాల్చి చంపిన మైనర్ బాలిక
ఉత్తరప్రదేశ్ లో దారుణం జరిగింది. ఒక మైనర్ బాలిక తన తల్లిని, సోదరుడిని పిస్టల్ తో కాల్చి చంపేసింది. ఇద్దరూ నిద్రిస్తున్నప్పుడు కాల్పులు జరిపినట్లు పోలీసులు తెలిపారు. అనంతరం తానూ ఆత్మహత్యకు యత్నించిందన్నారు.

ఉత్తరప్రదేశ్ లో దారుణం జరిగింది. ఒక మైనర్ బాలిక తన తల్లిని, సోదరుడిని పిస్టల్ తో కాల్చి చంపేసింది. ఇద్దరూ నిద్రిస్తున్నప్పుడు కాల్పులు జరిపినట్లు పోలీసులు తెలిపారు. అనంతరం తానూ ఆత్మహత్యకు యత్నించిందన్నారు.
ఉత్తరప్రదేశ్ రాజధానిలోని గౌతంపల్లిలోని వివేకానంద మార్గ్‌లో రాజేష్ దత్ బాజ్‌పాయ్, భార్య మాలిని, కుమారుడు సర్వదత్తతో పాటు 16 ఏళ్ల కుమార్తెతో కలిసి నివాసముంటున్నారు. రైల్వే బోర్డు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గా విధులు నిర్వహిస్తున్న బాజ్‌పాయ్ ఢిల్లీలో పనిచేస్తుండగా తల్లీపిల్లలు లక్నోలో నివసిస్తున్నారు.
అయితే, కుటుంబకలహాల కారణంగా తల్లి, సోదరుడి కాల్చి చంపినట్లు పోలీసులకు సమాచారం అందింది. ఈ ఘటనకు సంబంధించిన సమాచారంతో రాష్ట్ర డిజిపితో సహా పోలీసు అధికారులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం తరలించిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. కాగా, మైనర్ అయిన కూమార్తె రెండు హత్యలు చేసినట్లు నిర్ధారించారు. ఈ దారుణం జరుగుతున్నపుడు ఇంట్లో ఆరునుండి ఏడుగురు పనివాళ్లున్నారని పోలీసులు తెలిపారు.
కాగా, తల్లిని, సోదరుడిని తలవద్ద కాల్చిచంపినట్లు మైనర్ బాలిక ఒప్పుకున్నట్లు లక్నో పోలీస్ కమిషనర్ సుజిత్ పాండే వెల్లడించారు. పోలీసులు ఆమెనుండి పిస్టల్, బులెట్లను స్వాధీనం చేసుకున్నారు. తానూ తన చేతిని రేజర్ తో కోసుకున్నట్టుగా విచారణలో టీనేజి బాలిక వెల్లడించింది. ఆమె కుడి చేతికున్న కట్టుపై గాయాలతో పాటు… పాత గాయాలు సైతం ఉన్నట్టుగా పోలీసులు గుర్తించారు. బాత్రూం అద్దంలో టమోటా సాస్‌తో ఏదో రాసినట్లు పోలీసులు గమనించారు. అద్దాన్ని కూడా ఆమె పిస్టల్ తో షూట్ చేసినట్టుగా పోలీసులు గుర్తించారు. టీనేజర్ జాతీయ స్థాయి షూటర్ అని తెలుస్తోంది.గతంలో తండ్రిని కూడా బాధపెట్టిందని దర్యాప్తులో వెల్లడైందని పోలీసు కమిషనర్ చెప్పారు.




