వృద్ధ దంపతుల బ్రతుకు భారమై..

లోక కళ్యాణం కోసం దాదాపు 70ఏళ్లు బ్రతకు నావను నడిపిన ఆ వృద్ధ దంపతుల అలసిపోయారు. వయోభారంతో సంసారసాగరాన్ని ఈదలేక పురుగులు మందు తాగి ఆత్మహత్య చేసుకున్నారు

వృద్ధ దంపతుల బ్రతుకు భారమై..
Follow us
Pardhasaradhi Peri

|

Updated on: Aug 31, 2020 | 10:07 PM

లోక కళ్యాణం కోసం దాదాపు 70ఏళ్లు బ్రతకు నావను నడిపిన ఆ వృద్ధ దంపతుల అలసిపోయారు. వయోభారంతో సంసారసాగరాన్ని ఈదలేక పురుగులు మందు తాగి ఆత్మహత్య చేసుకున్నారు. ఖమ్మం జిల్లాలో ఈ దారుణం చోటుచేసుకుంది. చింతకాని మండలం పొద్దుటూరు గ్రామానికి చెందిన వృద్ధ దంపతులు నాగయ్య (75 )నారాయణమ్మ (70) ఈ చర్యకు పాల్పడ్డారు. వీరికి కొడుకు, కూతురు ఉన్నారు. ఉద్యోగాల రీత్యా పిల్లలిద్దరూ తల్లిదండ్రులకు దూరంగా స్థిరపడ్డారు. ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్న ఆ దంపతులు ఈ అఘాయిత్యానికి ఒడిగట్టి ఉంటారని స్థానికులు చెబుతున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.