మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో కొట్లాట.!
సూర్యాపేట మున్సిపల్ కౌన్సిల్ సమావేశం రచ్చరచ్చైంది. కాంగ్రెస్, బీజేపీ కౌన్సిలర్లు రాకముందే అధికార పార్టీ నేతలు ఎజెండాను పూర్తి చేరంటూ రాద్ధాంతం చోటుచేసుకుంది. అధికార పార్టీ వ్యవహారంపై..
సూర్యాపేట మున్సిపల్ కౌన్సిల్ సమావేశం రచ్చరచ్చైంది. కాంగ్రెస్, బీజేపీ కౌన్సిలర్లు రాకముందే అధికార పార్టీ నేతలు ఎజెండాను పూర్తి చేరంటూ రాద్ధాంతం చోటుచేసుకుంది. అధికార పార్టీ వ్యవహారంపై ఆగ్రహించిన ప్రతిపక్ష కౌన్సిలర్లు కుర్చీలు విసిరి ఆందోళనకు దిగారు. తాము రాకముందే సమావేశం ఎలా జరుపుతారని చైర్ పర్సన్‌ను నిలదీశారు. చైర్ పర్సన్, కమిషనర్ ఏకపక్షంగా వ్యవహరించారంటూ ప్రతిపక్ష కౌన్సిలర్లు ఆందోళన చేపట్టారు. కలెక్టరేట్ ఎదుట నల్ల బ్యాడ్జీలు ధరించి ధర్నాకు దిగారు. కమిషనర్‌ను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. అయితే కౌన్సిల్‌లో కోరం ఉండడంతోనే సమావేశం ప్రారంభించినట్లు చైర్ పర్సన్ వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు. అయినప్పటికీ ప్రతిపక్ష కౌన్సిలర్లు ఏమాత్రం శాంతించక రసాభాస చేశారు.