8 ఏళ్ల చిన్నారిపై ఏడుగురు మైన‌ర్ల అఘాయిత్యం

మాటలకందని దుర్మార్గపు ఘటన ఒకటి జరిగింది. సభ్య సమాజం సిగ్గుపడే నీచక్రియ త్రిపుర రాష్ట్రంలో చోటుచేసుకుంది. అభం శుభం తెలియని ఓ చిన్నారిని చితమేశాయి మానవ రూపంలో కుక్కలు. త్రిపుర‌ రాజధాని అగర్తలాలో ఈ దారుణం జ‌రిగింది. 8 ఏళ్ల చిన్నారిపై ఏడుగురు మైనర్లు అఘాయిత్యానికి పాల్ప‌డ్డారు.

8 ఏళ్ల చిన్నారిపై ఏడుగురు మైన‌ర్ల అఘాయిత్యం
Follow us

|

Updated on: Aug 31, 2020 | 8:02 PM

మాటలకందని దుర్మార్గపు ఘటన ఒకటి జరిగింది. సభ్య సమాజం సిగ్గుపడే నీచక్రియ త్రిపుర రాష్ట్రంలో చోటుచేసుకుంది. అభం శుభం తెలియని ఓ చిన్నారిని చితమేశాయి మానవ రూపంలో కుక్కలు. త్రిపుర‌ రాజధాని అగర్తలాలో ఈ దారుణం జ‌రిగింది. 8 ఏళ్ల చిన్నారిపై ఏడుగురు మైనర్లు అఘాయిత్యానికి పాల్ప‌డ్డారు. అగ‌ర్త‌ల విమానాశ్రయం పోలీస్ స్టేషన్ పరిధిలో టెబారియా గ్రామానికి చెందిన ఏడుగురు మైన‌ర్లు అదే ప్రాంతానికి చెందిన చిన్నారిని ఆటాడుకునేందుకు పిలిచి ఈ దారుణానికి ఒడిగ‌ట్టారు.

అయితే, త‌మ ఎనిమిదేళ్ల కుమార్తె ఆటాడుకుంటానంటూ ఇంటి నుంచి వెళ్లి తిరిగి రాకపోవడంతో త‌ల్లిదండ్రులు పోలీసుల‌కు ఫిర్యాదు చేశారు. దీంతో కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు బాధితురాలి కోసం గాలింపు చ‌ర్య‌లు చేప‌ట్టారు. ఈ గాలింపు చ‌ర్య‌ల్లో ఓ నిర్మానుష్య ప్రాంతంలో చిన్నారి ఆప‌స్మార‌క స్థితిలో తీవ్ర‌ గాయాల‌పాలైనట్లు గుర్తించిన పోలీసులు అత్య‌వ‌స‌ర చికిత్స కోసం ఆస్ప‌త్రికి తరలించారు. ఈ ఘటనను సీరియస్ గా తీసుకున్న పోలీసులు విచారణ చేపట్టిన వళ్లు గగురుపొడిచే విషయాలను బయటపెట్టారు.

అదే గ్రామానికి చెందిన మైన‌ర్ల‌ను విచారించగా..ఈ దారుణానికి పాల్ప‌డిన‌ట్లు ఒప్పుకున్నారు. నేరం అంగీక‌రించిన తరువాత తమకు ఏమీ అర్ధం కాలేద‌ని చెప్ప‌డంతో పోలీసులు విస్మ‌యానికి గుర‌య్యారు. ఏడుగురు మైనర్లను అదపులోకి తీసుకున్న పోలీసులు వారికి కరోనా పరీక్షలు నిర్వహించిన అనంత‌రం జువైనల్ హోంకి త‌ర‌లించారు.