మహారాష్ట్రలో మళ్ళీ హోటళ్లు, కార్యాలయాల సందడి !

అన్ లాక్ 4.0 గైడ్ లైన్స్ లో భాగంగా మహారాష్ట్ర ప్రభుత్వం ఆంక్షలను సడలించింది. హోటళ్లను వంద శాతం కెపాసిటీతో, ప్రైవేటు కార్యాలయాలను 30 శాతం కెపాసిటీతో..

మహారాష్ట్రలో మళ్ళీ హోటళ్లు, కార్యాలయాల సందడి !
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Aug 31, 2020 | 8:12 PM

అన్ లాక్ 4.0 గైడ్ లైన్స్ లో భాగంగా మహారాష్ట్ర ప్రభుత్వం ఆంక్షలను సడలించింది. హోటళ్లను వంద శాతం కెపాసిటీతో, ప్రైవేటు కార్యాలయాలను 30 శాతం కెపాసిటీతో అనుమతిస్తున్నట్టు ప్రకటించింది. ప్రస్తుతం ఇది 10 శాతం మాత్రమే ఉంది. అయితే మెట్రో రైళ్లు, విద్యా సంస్థలు, మాల్స్ మాత్రం మూసి ఉంటాయని  ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి. అయితే అంతర్ జిల్లా ప్రయాణాలకు ఈ-పాస్ నిబంధనను రద్దు చేస్తున్నట్టు ఈ వర్గాలు స్పష్టం చేశాయి. మహారాష్ట్రలో కరోనా వైరస్ కేసుల సంఖ్యలో పెద్దగా మార్పులేని విషయం గమనార్హం.