Social media cheating: సోషల్ మీడియాలో మాయ చేసి, దోచేస్తున్నారు.. ఈ తరహా మోసాలతో తస్మాత్ జాగ్రత్త
సోషల్ మీడియా వేదికగా రోజు రోజుకు నేరాలు పెరుగుతున్నాయి. ఈజీగా డబ్బు సంపాదించడం కోసం సోషల్ మీడియానే ప్రధాన వనరుగా చేసుకుంటున్నారు.
సోషల్ మీడియా వేదికగా రోజు రోజుకు నేరాలు పెరుగుతున్నాయి. ఈజీగా డబ్బు సంపాదించడం కోసం సోషల్ మీడియానే ప్రధాన వనరుగా చేసుకుంటున్నారు. స్టూడెంట్స్ దగ్గర నుంచి ప్రొఫెషనల్స్ వరకు అందరూ సామాజిక మాధ్యమాలనే వాడుతున్నారు.. అందుబాటులోకి వచ్చిన టెక్నాలజీనే నేరాల చేసేందుకు వనరుగా మార్చుకుంటున్నారు కేటుగాళ్లు.
కరోనా కారణంగా వ్యక్తిగత పరిచయాలు , ఆర్ధిక లావాదేవీలు అన్ని సోషల్ మీడియాతోనే చక్కబెట్టుకోవాల్సిన పరిస్థితి తలెత్తింది. దీంతో మొబైల్ యాప్స్‌లో ఉండే లింక్‌లను తెలిసి, తెలియక షేర్ చేయడంతో ..సైబర్ నేరగాళ్ల వలలో పడి మోసపోతున్నారు చాలా మంది. ఫేస్‌బుక్, ఇన్‌స్ట్రాగ్రాం లాంటి యాప్‌లలో విద్యార్థినిలు, యువతులకు ఫ్రెండ్ రిక్వెస్ట్ పోస్టు చేసి వాళ్లను తమ ట్రాక్‌లో తెచ్చుకుంటున్నారు సైబర్ నేరగాళ్లు. ఫ్రెండ్ రిక్వెస్ట్‌తో మొదలైన పరిచయం కాస్తా చాటింగ్‌తో పర్సనల్ విషయాల్ని షేర్ చేసుకునే వరకు పెరుగుతోంది. పేట్‌బషీరాబాద్‌లోనూ బీటెక్ స్టూడెంట్ సందీప్ ఓ యువతితో పరిచయం చేసుకొని లక్షా 30వేలు కాజేశాడు. తిరిగి చెల్లించమంటే బ్లాక్‌మెయిల్ చేయడంతో నిందితుడు సందీప్‌ను పోలీసులకు పట్టించింది బాధితురాలు.
జార్ఖండ్ జాంతారకు చెందిన బీర్బల్ పండిట్ సైబర్ మోసాన్ని రాచకొండ సైబర్ క్రైమ్ పోలీసులు బయటపెట్టారు. సిమ్ నెట్‌వర్క్ యాక్టివేషన్ పేరుతో పలువురిని మోసం చేసినట్లు తేల్చారు. ఓ మహిళ దగ్గర సిమ్ యాక్టివేషన్ పోరుతో ఆరున్నర లక్షల రూపాయలను స్వాహా చేయడంతో బాధితురాలు సైబర్ క్రైమ్ పోలీసుల్ని ఆశ్రయించింది. దీంతో పోలీసులు బీర్బల్ పండిట్‌ని అరెస్ట్ చేశారు. దయచేసి సైబర్ మోసగాళ్ల ఉచ్చులో పడవద్దని పోలీసులు హెచ్చరిస్తున్నారు.
Also Read: బయట నుంచి చూస్తే టమాట పంటేగా అనుకుంటారు.. లోపలికి వెళ్లి చూసిన పోలీసుల మైండ్ బ్లాంక్ అయ్యింది
భార్య ఫోటో, ఫోన్ నంబర్ ఉన్న పోస్టర్లను ఈ ప్రబుద్దుడు ఊరంతా అంటించాడు.. ఎందుకంటే..?