AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Army Recruitment Case: ఆర్మీ నియామకాల స్కాంలో 23 మందిపై కేసు నమోదు.. 30 ప్రాంతాల్లో సీబీఐ దాడులు

CBI - Army Recruitment Scam: దేశంలో రక్షణ శాఖలో కూడా అవినీతి యధేచ్చగా పెచ్చరిల్లుతోంది. దీనిని నివారించేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలను ప్రారంభించింది. ఆర్మీ నియామకాల్లో అవకతవలకు పాల్పడిన

Army Recruitment Case: ఆర్మీ నియామకాల స్కాంలో 23 మందిపై కేసు నమోదు.. 30 ప్రాంతాల్లో సీబీఐ దాడులు
Army Recruitment Case
Shaik Madar Saheb
|

Updated on: Mar 16, 2021 | 7:05 AM

Share

CBI – Army Recruitment Scam: దేశంలో రక్షణ శాఖలో కూడా అవినీతి యధేచ్చగా పెచ్చరిల్లుతోంది. దీనిని నివారించేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలను ప్రారంభించింది. ఆర్మీ నియామకాల్లో అవకతవలకు పాల్పడిన కేసులో 23 మందిపై కేసు నమోదైంది. వారిలో లెఫ్టినెంట్ కల్నల్స్, ఒక మేజర్ కూడా ఉన్నారు. ఆర్మీ నియామకాల్లో అవకతవకలకు సంబంధించి.. కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) దేశవ్యాప్తంగా 13 నగరాల్లోని 30 ప్రాంతాల్లో సోదాలు నిర్వహించింది. ఢిల్లీ, విశాఖపట్నం, కైతల్, కపూర్తల, బతిండా, పల్వాల్, లఖ్​నవూ, జైపూర్, గువాహటి, బరేలీ, గోరఖ్‌పుర్, జోర్హట్, చిరాంగన్‌లలోని బేస్ ఆసుపత్రి, కంటోన్మెంట్, ఇతర ఆర్మీ సముదాయాలు, పౌరుల నివాసాలు సహా 30 ప్రాంతాల్లో సీబీఐ అధికారులు సోదాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయా ప్రాంతాల్లో పలు పత్రాలను, హార్డ్ డిస్క్‌లను స్వాధీనం చేసుకున్నట్లు సీబీఐ వెల్లడించింది. ఈ కేసుకి సంబంధించి మొత్తం 23 మందిపై సీబీఐ కేసు నమోదు చేయగా..అందులో ఆరుగురు లెఫ్టినెట్​ కర్నల్​స్థాయి అధికారులు, ఒక మేజర్, 10 మంది సైనికాధికారులు, ఆరుగురు ఇతర సిబ్బంది ఉన్నారు.

అయితే.. ఈ ఏడాది ఫిబ్రవరిలో దేశవ్యాప్తంగా జరిగిన జనరల్‌ డ్యూటీ పర్సనల్స్‌ ఎంపికలో పేపర్‌ ముందే బయటకు వచ్చినట్లు ఆర్మీ అధికారులు గుర్తించారు. ముందస్తు సమాచారంతో పూణేలో స్థానిక పోలీసులతో కలిసి సైన్యం సంయుక్త ఆపరేషన్‌ చేపట్టింది. ఆ తర్వాత పరీక్షను సైతం రద్దు చేశారు. ఈ కేసుకు సంబంధించి అప్పట్లో పూణేలో ముగ్గురు వ్యక్తులను అరెస్టు చేశారు. దీంతో ఆర్మీ నియామకాల్లో జరిగిన అవకతవకలకు సంబంధించిన కేసును సైన్యం సీబీఐకి బదిలీ చేసింది. ఎంపిక కేంద్రాల్లో మాల్‌ ప్రాక్టీస్‌కు పాల్పడుతున్న అంశం బయటపడడంతో సైన్యం అప్రమత్తమై కఠిన చర్యలు తీసుకుంది. అయితే ఎంపిక ప్రక్రియలో లక్షలాది రూపాయలు చేతులు మారాయి. దీనిపై లోతుగా దర్యాప్తు చేస్తున్నట్లు సీబీఐ, ఆర్మీ అధికారులు వెల్లడించారు.

ఇదిలాఉంటే ఈ కేసుతోపాటు.. న్యూ ఢిల్లీలోని బేస్ ఆసుపత్రుల్లో అభ్యర్థులు వైద్య పరీక్షలను పూర్తి చేయడానికి లంచాలు స్వీకరించారని.. వారిలో ఆర్మీ సిబ్బంది కూడా ఉన్నట్లు ఫిర్యాదు సైతం అందింది. దీనిలో ఆర్మీ ఎయిర్ డిఫెన్స్ కార్ప్స్‌కి చెందిన లెఫ్టినెంట్ కల్నల్ భగవాన్ రిక్రూట్మెంట్ రాకెట్ సూత్రధారిగా వ్యవహరించినట్లు సీబీఐ అధికారులు గుర్తించారు. ప్రస్తుతం స్టడీ లీవ్‌లో ఉన్న లెఫ్టినెంట్ కల్నల్ భగవాన్, నాయిబ్ సుబేదార్ కుల్దీప్ సింగ్ కూడా ఎస్‌ఎస్‌బీ కేంద్రాలలోని ముఖ్యమైన వ్యక్తుల నుంచి లంచాలు తీసుకున్నారని ఆర్మీ అధికారులు వెల్లడించారు. అయితే.. సీబీఐ తాజాగా నమోదు చేసిన కేసులో వీరితోపాటు మరికొంత మంది ఉన్నారు.

Also Read:

దేశంలోని పలుచోట్ల ఎన్‌ఐఏ సోదాలు.. ఉగ్ర కుట్రలకు ప్లాన్‌ చేస్తున్న పలువురు అరెస్ట్‌