దేశంలోని పలుచోట్ల ఎన్‌ఐఏ సోదాలు.. ఉగ్ర కుట్రలకు ప్లాన్‌ చేస్తున్న పలువురు అరెస్ట్‌

NIA raids 10 locations: దేశంలో దాడులకు కుట్ర చేస్తున్న ఐసిస్ ముఠా గుట్టురట్టు చేసింది ఎన్ఐఏ. ఈ మేరుకు ఐదుగురు ఉగ్రవాదులను జాతీయ దర్యాప్తు సంస్థ అదుపులోకి తీసుకుంది. దేశంలో దాడులు జరిపి

దేశంలోని పలుచోట్ల ఎన్‌ఐఏ సోదాలు.. ఉగ్ర కుట్రలకు ప్లాన్‌ చేస్తున్న పలువురు అరెస్ట్‌
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Mar 15, 2021 | 7:43 PM

NIA raids 10 locations: దేశంలో దాడులకు కుట్ర చేస్తున్న ఐసిస్ ముఠా గుట్టురట్టు చేసింది ఎన్ఐఏ. ఈ మేరుకు ఐదుగురు ఉగ్రవాదులను జాతీయ దర్యాప్తు సంస్థ అదుపులోకి తీసుకుంది. దేశంలో దాడులు జరిపి విధ్వంసం సృష్టించేందుకు ఐసిస్‌ ఉగ్రవాదులు కుట్రలు పన్నుతున్నారనే సమాచారం ఎన్ఐఏకు అందింది. దీంతో అప్రమత్తమైన జాతీయ దర్యాప్తు సంస్థ సోమవారం దేశ రాజధాని ఢిల్లీ సహా పలు ప్రాంతాల్లో సోదాలు నిర్వహించింది. ఢిల్లీ, కర్ణాటక, కేరళలోని 10 ప్రాంతాల్లో ఎన్ఐఏ అధికారులు తనిఖీలు చేపట్టారు. ఈ కుట్రకు సంబంధించి పాక్‌, ఐసిస్‌ ముఠాలతో సంబంధమున్నట్లు అనుమానిస్తున్న ఐదుగురిని అరెస్టు చేసినట్లు ఎన్ఐఏ వర్గాలు వెల్లడించాయి.

ఉగ్రవాద సంబంధాలపై ఇటీవల కొందరు మహిళలను ఐన్‌ఐఏ అధికారులు అదుపులోకి తీసుకోగా.. వారిచ్చిన సమాచారం మేరకు కొందరిపై నిఘా ఉంచారు. వారిపై పలు అనుమానాలు రావడంతో ఈ దాడులు చేపట్టారు. సోషల్‌మీడియా ప్లాట్‌ఫాం ద్వారా యువతను ఆకర్షించి, వారికి ఆన్‌లైన్‌లోనే శిక్షణ ఇస్తూ దాడులకు పన్నాగం చేస్తున్నట్లు ఎన్‌ఐఏకు సమాచారం అందింది. వీరి ద్వారా దేశంలో పలు చోట్ల పేలుళ్లు జరిపేందుకు కుట్ర జరుగుతుందని ఎన్‌ఐఏ వర్గాలు తెలిపాయి. ఇటీవల కాలంలో ఎన్ఐఏ వరుసగా దాడులు నిర్వహిస్తోంది. ఢిల్లీ, కేరళతోపాటు పలు ప్రాంతాల్లో ఉగ్రవాద గ్రూపులతో సంబంధమున్న వారిని అరెస్టు చేశారు.

Also Read:

ఢిల్లీ కోర్టు సంచలన తీర్పు.. బాట్లాహౌజ్‌ ఎన్‌కౌంటర్‌ కేసులో ఉగ్రవాది అరిజ్‌ ఖాన్‌కు మరణశిక్ష

uttarakhand cm ప్రధాని నరేంద్రమోదీపై ఉత్తరాఖండ్ కొత్త ముఖ్యమంత్రి తీరత్ సింగ్ రావత్ కీలక వ్యాఖ్యలు..!