uttarakhand cm ప్రధాని నరేంద్రమోదీపై ఉత్తరాఖండ్ కొత్త ముఖ్యమంత్రి తీరత్ సింగ్ రావత్ కీలక వ్యాఖ్యలు..!

ఉత్తరాఖండ్ కొత్త ముఖ్యమంత్రి తీరత్ సింగ్ రావత్ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీని మరో రాముడు అవుతారంటూ కొనియాడారు.

uttarakhand cm  ప్రధాని నరేంద్రమోదీపై ఉత్తరాఖండ్ కొత్త ముఖ్యమంత్రి తీరత్ సింగ్ రావత్ కీలక వ్యాఖ్యలు..!
Like Lord Ram, Pm Modi Will Also Be Treated As God One Day For Good Work He Is Doing, Says Uttarakhand Cm Tirath Rawat
Follow us
Balaraju Goud

|

Updated on: Mar 15, 2021 | 7:19 PM

Uttarakhand CM Tirath Rawat on PM Modi : ఉత్తరాఖండ్ కొత్త ముఖ్యమంత్రి తీరత్ సింగ్ రావత్ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీని మరో రాముడు అవుతారంటూ కొనియాడారు. సోమవారం ఉత్తరాఖండ్‌లో నిర్వహించిన ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. రాబోయే రోజుల్లో ప్రధాని మోదీని మరో రాముడిలా ప్రజలు కొలుస్తారని ఆయన అన్నారు. ‘‘రాముడు ఇదే సమాజం కోసం పని చేశారు. అనంతరం రాముడిని ప్రజలు దేవుడిగా భావించడం ప్రారంభించారు. నరేంద్ర మోదీ కూడా ఇదే సమాజం కోసం పని చేస్తున్నారు. రాబోయే రోజుల్లో నరేంద్రమోదీ కూడా మరో రాముడు అవుతారు. రాముడికి సరిసమానంగా మోదీ అవుతారు’’ అంటూ ముఖ్యమంత్రి తీరత్ సింగ్ రావత్.. ప్రధానిపై తనకున్న అభిమానాన్ని చాటుకున్నారు.

ప్రధాని నరేంద్ర మోదీ రాముడంతటి గొప్పవాడంటూ గతంలో బీజేపీ నేతలు చాలా సార్లు వ్యాఖ్యానించారు. అయితే, ఒక ముఖ్యమంత్రి ఇలా బహిరంగ సభలో మోదీని రాముడితో పోల్చడం ప్రస్తుతం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. భగవంతుడితో మోదీకి పోలికేంటని సోషల్ మీడియాలో కొందరు విమర్శలు చేసినా, తీరత్ సింగ్ వ్యాఖ్యలను సమర్ధించేవారు కూడా ఉన్నారు. ఇటీవలే ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రిగా తీరత్ సింగ్ రావత్ బాధ్యతలు చేపట్టారు. గత ముఖ్యమంత్రి త్రివేంద్ర సింగ్ రావత్ రాజీనామా అనంతరం అనుహ్యంగా తీరత్ సింగ్ తెరపైకి వచ్చారు.

ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టిన నాలుగు రోజుల వ్యవధిలో హరిద్వార్‌ నగరాన్ని సందర్శించారు తీరత్ సింగ్. సీఎంగా తొలి ప్రకటనలోనే హరిద్వార్ కుంభమేళాకు హాజరయ్యే భక్తులకు కోవిడ్ రిపోర్టు అవసరం లేదని స్పష్టం చేశారు. కుంభమేళాలో ప్రస్తుతం అనుకూల పరిస్థితులు నెలకొన్నాయని.. భక్తులను ఎవరు అనవసరంగా ఇబ్బందులకు గురిచేయవద్దని సీఎం తీరత్ సింగ్ అదేశాలు జారీ చేశారు.

ఇదీ చదవండిః 

 ఢిల్లీ కోర్టు సంచలన తీర్పు.. బాట్లాహౌజ్‌ ఎన్‌కౌంటర్‌ కేసులో ఉగ్రవాది అరిజ్‌ ఖాన్‌కు మరణశిక్ష 

భార్యకు వైద్యం చేయించలేక ఓ భర్త ఘాతుకం.. కత్తితో పొడిచి దారుణహత్య..!

Boy Bhargav Teja : మెల్లంపూడి గ్రామంలో విషాదం, శవమై కనిపించిన నిన్న మధ్యాహ్నం కిడ్నాపైన ఏడేళ్ల భార్గవ్‌తేజ

Jio, Airtel నుంచి దిమ్మదిరిగే ప్లాన్‌.. రూ.650తో ఏడాది పాటు డేటా
Jio, Airtel నుంచి దిమ్మదిరిగే ప్లాన్‌.. రూ.650తో ఏడాది పాటు డేటా
యాదాద్రి జిల్లాలో నకిలీ కరెన్సీ కలకలం..కేటుగాళ్ల టార్గెట్‌ ఎవరంటే
యాదాద్రి జిల్లాలో నకిలీ కరెన్సీ కలకలం..కేటుగాళ్ల టార్గెట్‌ ఎవరంటే
అప్పటి వరకు చెప్పులు వేసుకోను.. అన్నామలై సంచలన ప్రకటన
అప్పటి వరకు చెప్పులు వేసుకోను.. అన్నామలై సంచలన ప్రకటన
ఫ్రిజ్ వాడుతున్నారా? అయితే ఈ పొరపాట్లు అస్సలు చేయకండి!
ఫ్రిజ్ వాడుతున్నారా? అయితే ఈ పొరపాట్లు అస్సలు చేయకండి!
ఈ పండు క్యాన్సర్‌ని కూడా నయం చేస్తుంది..! రోజుకు రెండు తింటే చాలు
ఈ పండు క్యాన్సర్‌ని కూడా నయం చేస్తుంది..! రోజుకు రెండు తింటే చాలు
గోల్డ్ లోన్ కంపెనీలు మీ బంగారాన్ని ఎందుకు వేలం వేస్తున్నాయి?
గోల్డ్ లోన్ కంపెనీలు మీ బంగారాన్ని ఎందుకు వేలం వేస్తున్నాయి?
పెళ్లిళ్లలో క్యాటరింగ్ గర్ల్.. ఇప్పుడు నెట్టింట ఫేమస్..
పెళ్లిళ్లలో క్యాటరింగ్ గర్ల్.. ఇప్పుడు నెట్టింట ఫేమస్..
చెప్పులు లేకుండా 20కిలోమీటర్లు నడిచిన గురుకుల విద్యార్థులు..కారణం
చెప్పులు లేకుండా 20కిలోమీటర్లు నడిచిన గురుకుల విద్యార్థులు..కారణం
అరంగ్రేటంలోనే రూల్స్ అతిక్రమించిన సామ్ కొంస్టాస్
అరంగ్రేటంలోనే రూల్స్ అతిక్రమించిన సామ్ కొంస్టాస్
భారతీయులు కొత్త ఏడాదిలో వీసా లేకుండా ఈ 12 దేశాల్లో పర్యటించవచ్చు!
భారతీయులు కొత్త ఏడాదిలో వీసా లేకుండా ఈ 12 దేశాల్లో పర్యటించవచ్చు!