భార్యకు వైద్యం చేయించలేక ఓ భర్త ఘాతుకం.. కత్తితో పొడిచి దారుణహత్య..!

కష్ట సుఖాల్లో జీవితాంతం తోడుంటాడనుకున్న భర్తే కాలయముడయ్యాడు. బతుకు భారంగా కాలం వెల్లదీస్తున్న సతీమణినే హతమార్చాడు ఓ కిరాతకుడు..

భార్యకు వైద్యం చేయించలేక ఓ భర్త ఘాతుకం.. కత్తితో పొడిచి దారుణహత్య..!
Choreographer arrested
Follow us

|

Updated on: Mar 15, 2021 | 6:53 PM

Man fed up of unwell wife kills : కష్ట సుఖాల్లో జీవితాంతం తోడుంటాడనుకున్న భర్తే కాలయముడయ్యాడు. బతుకు భారంగా కాలం వెల్లదీస్తున్న సతీమణినే హతమార్చాడు ఓ కిరాతకుడు.. భార్య అనారోగ్యం, తడిసిమోపెడవుతున్న వైద్య ఖర్చులతో విసుగు చెందిన ఓ భర్త దారుణానికి ఒడిగట్టాడు. భార్యను కత్తితో పొడిచి హత్య చేశాడు. మహారాష్ట్రలోని పర్భనీ జిల్లా ముద్గల్ గ్రామంలో ఈ దారుణం జరిగింది. ఈ ఘటనకు సంబంధించి కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పర్భనీ జిల్లా ముద్గల్ గ్రామానికి చెందిన ఇద్దరు దంపతుల కుటుంబం సాఫీగా సాగుతోంది. అయితే, ఇటీవల మెదడులో కణితి కారణంగా నిందితుడి భార్య కొంత కాలంగా బాధపడుతోంది. దీంతో ఆమె వైద్యం కోసం ఖర్చులు పెరిగిపోయాయి. కాగా, గత కొంతకాలంగా ఉద్యోగం లేక భర్త తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో కూరుక్కుపోయాడు. ఇదే క్రమంలో నిందితుడు శనివారం రాత్రి పదునైన కత్తితో భార్యను పొడిచి హతమార్చాడు. అనంతరం.. రక్తంతో తడిసిన దుస్తులను ఇంటికి సమీపంలో పారేశాడు. ఇదంతా గమనించిన ఇరుగుపొరుగు వారు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. దుస్తులను స్వాధీనం చేసుకుని విచారణ చేపట్టారు. అనంతరం మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు.

ఈ ఘటనకు సంబంధించి కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆదివారం నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టడంతో అసలు విషయం వెల్లడించాడు. భార్య అనారోగ్యం వైద్య ఖర్చులతో విసుగు చెందిన ఆమెను హత్య చేశాను అని నిందితుడు తన నేరాన్ని అంగీకరించాడు. హత్యానేరంతో పాటూ వివిధ సెక్షన్ల కింద పోలీసులు నిందితుడిపై కేసు నమోదు చేశారు.

Read Also …. ఆధారాలు లేని నిందలు, అధికారుల నిర్లక్ష్యం.. చేయని నేరానికి 20 ఏళ్లుగా జైలుశిక్ష.. బతుకు దారి కనిపించని బాటసారి..!

SuperStar Krishna : 50 వ‌సంతాలు పూర్తి చేసుకున్న విజ‌య‌కృష్ణ మూవీస్..సూపర్ స్టార్ కృష్ణను సత్కరించిన నరేష్

ట్రంప్‌ vs కమలా హారిస్.. భవిష్యత్తును నిర్ణయించేది ఆ 7 స్టేట్సే..
ట్రంప్‌ vs కమలా హారిస్.. భవిష్యత్తును నిర్ణయించేది ఆ 7 స్టేట్సే..
అమెరికా ఎన్నికల వేళ..గూగుల్‌ ఉద్యోగులకు సుందర్‌ పిచాయ్‌ వార్నింగ్
అమెరికా ఎన్నికల వేళ..గూగుల్‌ ఉద్యోగులకు సుందర్‌ పిచాయ్‌ వార్నింగ్
మళ్లీ రంగంలోకి.. ఆ ప్రాంతంలోని భూ ఆక్రమణలపై హైడ్రా ఫోకస్..
మళ్లీ రంగంలోకి.. ఆ ప్రాంతంలోని భూ ఆక్రమణలపై హైడ్రా ఫోకస్..
ఇన్‌స్టాగ్రమ్‌లో పరిచయం చేసుకున్నాడు.. చాటింగ్ చేశాడు.. చివరికి
ఇన్‌స్టాగ్రమ్‌లో పరిచయం చేసుకున్నాడు.. చాటింగ్ చేశాడు.. చివరికి
యూపీ యోధాస్‌పై జైపూర్‌‌ ఉత్కంఠ విజయం..
యూపీ యోధాస్‌పై జైపూర్‌‌ ఉత్కంఠ విజయం..
సామ్‌సంగ్‌ నుంచి అద్భుతం.. 280 ఎంపీ కెమెరాతో వస్తోన్న కొత్త ఫోన్‌
సామ్‌సంగ్‌ నుంచి అద్భుతం.. 280 ఎంపీ కెమెరాతో వస్తోన్న కొత్త ఫోన్‌
యుద్ధాలపై అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలు ఎలాంటి ప్రభావం చూపుతాయి
యుద్ధాలపై అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలు ఎలాంటి ప్రభావం చూపుతాయి
శ్రేయాస్ అయ్యర్ ఏ జట్టు తరపున బరిలోకి దిగనున్నాడంటే?
శ్రేయాస్ అయ్యర్ ఏ జట్టు తరపున బరిలోకి దిగనున్నాడంటే?
పంట భలే ఏపుగా పెరిగింది అనుకునేరు.. లోపలకెళ్లి చూస్తే
పంట భలే ఏపుగా పెరిగింది అనుకునేరు.. లోపలకెళ్లి చూస్తే
మన దేశంలో కులవ్యవస్థ బలంగా ఉంది: రాహుల్‌ గాంధీ
మన దేశంలో కులవ్యవస్థ బలంగా ఉంది: రాహుల్‌ గాంధీ