AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

SuperStar Krishna : 50 వ‌సంతాలు పూర్తి చేసుకున్న విజ‌య‌కృష్ణ మూవీస్..సూపర్ స్టార్ కృష్ణను సత్కరించిన నరేష్

పద్మాల‌య సంస్థ 52 వ‌సంతాలు పూర్తి చేసుకోవ‌డంతో పాటు, విజ‌య‌కృష్ణ మూవీస్ స్థాపించి 50 వ‌సంతాలు అవుతున్న సంద‌ర్భంగా ఇరు సంస్థ‌ల‌కు మూల స్థంభం అయిన‌టువంటి

SuperStar Krishna : 50 వ‌సంతాలు పూర్తి చేసుకున్న విజ‌య‌కృష్ణ మూవీస్..సూపర్ స్టార్ కృష్ణను సత్కరించిన నరేష్
Krishana
Rajeev Rayala
|

Updated on: Mar 15, 2021 | 6:21 PM

Share

SuperStar Krishna : పద్మాల‌య సంస్థ 52 వ‌సంతాలు పూర్తి చేసుకోవ‌డంతో పాటు, విజ‌య‌కృష్ణ మూవీస్ స్థాపించి 50 వ‌సంతాలు అవుతున్న సంద‌ర్భంగా ఇరు సంస్థ‌ల‌కు మూల స్థంభం అయిన‌టువంటి సూప‌ర్ స్టార్ కు, ఆయన సోదరుడు ఆదిశేష‌గిరిరావు కి నటుడు డా. వి.కె న‌రేష్‌, ఆయన త‌న‌యుడు న‌రేష్ విజ‌య్ కృష్ణ స‌త్క‌రించారు. ఈసందర్భంగా నరేష్ కృష్ణ పాదాలకు నమస్కరించారు. ప‌ద్మాల‌య సంస్థ తెలుగుతో పాటు హిందీ త‌మిళ బాష‌ల్లో భారీ చిత్రాలు నిర్మించ‌డంతో పాటు హైద‌రాబాద్‌లో ప‌ద్మాల‌య స్టూడియోస్ స్థాపించి సినీ ప‌రిశ్ర‌మ హైద‌రాబాద్‌కు త‌ర‌లి రావ‌డంలో కీల‌క పోషించిన విష‌యం తెలిసిందే..

విజ‌య కృష్ణ మూవీస్ సూప‌ర్‌హిట్ చిత్రం మీనాతో ప్రారంభించి, హేమాహేమీలు, అంతం కాదు ఇది ఆరంభం లాంటి చిత్రాలు కృష్ణ‌తో నిర్మించ‌డంతో పాటు న‌రేష్‌తో ప్రేమ సంకెళ్లు, ముక్కోపి లాంటి హిట్ చిత్రాలు నిర్మించింది పద్మాలయ సంస్థ. అలాగే డా. విజ‌య‌నిర్మ‌లకి గిన్నీస్ బుక్ ఆఫ్ వ‌ర‌ల్డ్ రికార్డ్స్ ల‌భించ‌డానికి  దోహ‌ద‌ప‌డింది. గ‌తంలో 1976నుండి డ‌బ్బింగ్ రికార్డింగ్ స్టూడియోలు, ఎడిటింగ్ రూమ్స్ మ‌రియు సినీ ప‌రిశ్ర‌మ‌కు కావాల్సిన పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ స్టూడియోస్ వంటి వాటిని విజ‌య‌కృష్ణ మూవీస్ ఏర్పాటు చేసింది. తాజాగా విజ‌య‌కృష్ణ మూవీస్ సంస్థ 50 సంవ‌త్స‌రాలు పూర్తిచేసుకున్న సంద‌ర్భంగా నటుడు న‌రేష్‌, ఆయన తనయుడు న‌వీన్ విజ‌య కృష్ణ ఆ సంస్థ‌ని `విజ‌య‌కృష్ణ గ్రీన్ స్టూడియోస్`పేరుతో పునర్నిర్మాణం చేయ‌డానికి, సినీ ప‌రిశ్ర‌మ‌కు కావాల్సిన స‌దుపాయాలు, మ‌రియు హార్డ్ వేర్‌, సాఫ్ట్‌వేర్ త‌యారు చేయ‌డానికి రంగం సిద్దం చేశారు. ఈ క్ర‌మంలో క‌ర్ట‌న్ రైజ‌ర్ కార్య‌క్ర‌మాన్ని సినీ ప‌రిశ్ర‌మ‌కు సంభందించిన‌టువంటి బందు మిత్రుల‌తో, పెద్ద‌ల‌తో ప్రారంభించారు. ఈ కార్య‌క్ర‌మంలో సాయిధ‌ర‌మ్ తేజ్‌, ఆనంద్ దేవ‌ర‌కొండ‌, సుధీర్ బాబు, వెంక‌టేష్ మ‌హా, శ్రీ‌రామ్ ఆదిత్య‌, వి ఐ ఆనంద్‌, శ‌ర‌త్ మ‌రార్‌, మ‌ద్దాల ర‌వి త‌దిత‌రులు పాల్గొన్నారు.

మరిన్ని ఇక్కడ చదవండి : Pushpaka Vimanam : విజయ్ దేవరకొండ చేతుల మీదుగా ‘‘పుష్పక విమానం’’ ఫస్ట్ సాంగ్

Ram Pothineni and Genelia : రామ్ ను ఆటపట్టించిన జెనీలియా.. ఫన్నీ వీడియోను షేర్ చేసిన

‘డోంట్ రష్’లో భాగంగా అదరగొడుతున్న సెలబ్రిటీలు.. వైరల్ అవుతున్న సమంత, లావణ్య త్రిపాఠి డ్యాన్స్ వీడియోలు

Follow Us
IND vs WI: ఇండోర్‌లో టీమిండియాదే విక్టరీ.. సిరీస్‌లో ఆధిక్యం..
IND vs WI: ఇండోర్‌లో టీమిండియాదే విక్టరీ.. సిరీస్‌లో ఆధిక్యం..
రాజు మరణిస్తే సేవకులనూ చంపారు.. పురాతన ఈజిప్టులో మారణకాండ?
రాజు మరణిస్తే సేవకులనూ చంపారు.. పురాతన ఈజిప్టులో మారణకాండ?
టీ20 క్రికెట్ హిస్టరీలోనే తొలి టీంగా వెస్టిండీస్ భారీ రికార్డ్..
టీ20 క్రికెట్ హిస్టరీలోనే తొలి టీంగా వెస్టిండీస్ భారీ రికార్డ్..
కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
చిన్న సాయం.. పెద్ద మార్పు! స్కూళ్ల నిర్మాణానికి జాకీ చాన్‌ విరాళం
చిన్న సాయం.. పెద్ద మార్పు! స్కూళ్ల నిర్మాణానికి జాకీ చాన్‌ విరాళం
2027 వన్డే ప్రపంచకప్ గెలవాలంటే ఇదే కీలకం.. సెహ్వాగ్ సూచన
2027 వన్డే ప్రపంచకప్ గెలవాలంటే ఇదే కీలకం.. సెహ్వాగ్ సూచన
ఇంట్లో స్నేక్ ప్లాంట్ పెంచుతున్నారా? ఆరోగ్యం, వాస్తు పరంగా కలిగే
ఇంట్లో స్నేక్ ప్లాంట్ పెంచుతున్నారా? ఆరోగ్యం, వాస్తు పరంగా కలిగే
ఈ ఒక్క ముక్కతో కంటిచూపు, పొట్ట సమస్యలు మాయం..
ఈ ఒక్క ముక్కతో కంటిచూపు, పొట్ట సమస్యలు మాయం..
టీమిండియాలో రీఎంట్రీకి షమీ రెడీ.. విమర్శలకు ఇచ్చిపడేశాడుగా..!
టీమిండియాలో రీఎంట్రీకి షమీ రెడీ.. విమర్శలకు ఇచ్చిపడేశాడుగా..!
భారత్‌లో కొత్త గ్యాస్‌ కనెక్షన్లను ఎందుకు నిలిపివేశారు? కారణమిదే!
భారత్‌లో కొత్త గ్యాస్‌ కనెక్షన్లను ఎందుకు నిలిపివేశారు? కారణమిదే!