ఆధారాలు లేని నిందలు, అధికారుల నిర్లక్ష్యం.. చేయని నేరానికి 20 ఏళ్లుగా జైలుశిక్ష.. బతుకు దారి కనిపించని బాటసారి..!

ఏ పాపం ఎరుగని ఓ వ్యక్తి తన జీవితకాలాన్ని జైలులోనే మగ్గిపోయాడు. చేయని నేరానికి.. న్యాయస్థానం అతడిని దోషిగా పరిగణించింది. ఫలితంగా 20 ఏళ్లుగా జైలు జీవితం అనుభవించాడు.

ఆధారాలు లేని నిందలు, అధికారుల నిర్లక్ష్యం.. చేయని నేరానికి 20 ఏళ్లుగా జైలుశిక్ష.. బతుకు దారి కనిపించని బాటసారి..!
Up Man Acquitted Of Rape Case After 20 Years In Prison
Follow us

|

Updated on: Mar 15, 2021 | 6:33 PM

UP man acquitted : ‘వందమంది దోషులు తప్పించుకున్నా ఫర్వాలేదు. కానీ ఒక నిర్దోషికి శిక్ష పడకూడదు’ అనేది న్యాయ సూత్రం చెబుతుంది. అయితే, ఏ పాపం ఎరుగని ఓ వ్యక్తి తన జీవితకాలాన్ని జైలులోనే మగ్గిపోయాడు. చేయని నేరానికి.. న్యాయస్థానం అతడిని దోషిగా పరిగణించింది. ఫలితంగా 20 ఏళ్లుగా జైలు జీవితం అనుభవించాడు. ఇంతకీ అతను ఎవరు? ఇప్పటికైనా న్యాయస్థానం అసలు నిజం తెలిసిందా? చివరికి ఏం జరిగింది?

చేయని తప్పునకు 20 ఏళ్ల పాటు జైల్లోనే మగ్గిపోయాడు. సుదీర్ఘ విచారణ అనంతరం అతడిని నిర్ధోషిగా ప్రకటిస్తూ కోర్టు తీర్పునిచ్చింది. దీంతో అతడు ఎట్టకేలకు తన సొంతూరికి చేరుకున్నాడు. యవ్వనంలో ఉండగా జైల్లోకి వెళ్లిన 43 ఏళ్ల వయసులో తిరిగి బయటకు వచ్చాడు విష్ణు తివారీ.. తన భవిష్యత్ జీవితం అగమ్యగోచరంలా మారిపోయిందంటున్నాడు. మార్చి మూడో తారీఖున విడుదలయ్యాడు.

ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలోని లలిత్‌పూర్‌కు చెందిన విష్ణు తివారిపై అదే గ్రామానికి చెందిన ఓ మహిళ అత్యాచారం కేసు పెట్టింది. ఎస్సీ,ఎస్టీ అట్రాసిటీ కింద కూడా కేసులు నమోదయ్యాయి. పనికి వెళ్లి తిరిగి వస్తుండగా తనపై ఆ వ్యక్తి అత్యాచారం చేశాడంటూ ఆ మహిళ కేసు పెట్టింది. 2000వ సంవత్సరం సెప్టెంబర్ 1వ తారీఖున ఈ కేసులో పోలీసులు విష్ణు తివారిని అరెస్ట్ చేశారు. ఆ సమయంలో విష్ణు తివారీ వయసు 23 ఏళ్లు. తానేతప్పు చేయలేదని, తనకేం తెలియదని అతడు మొత్తుకుంటున్నా ఎవరూ పట్టించుకోలేదు. కేసు విచారణ సమయంలో మూడేళ్ల పాటు అతడు జైల్లోనే గడిపాడు. ఈ కేసును విచారించిన ట్రయల్ కోర్టు చివరకు అతడిని దోషిగా తేల్చింది. అతడిపై అత్యాచారం, ఎస్సీ, ఎస్టీ వేధింపుల చట్టం ప్రకారం అతడికి జీవిత ఖైదును విధించింది కోర్టు.

అయితే, ట్రయల్ కోర్టు తీర్పును సవాల్ చేస్తూ విష్ణు హైకోర్టును ఆశ్రయించాడు. అయితే, హైకోర్టులో ఈ కేసు విచారణకు వచ్చి, తుది తీర్పు వెలువడేసరికి ఏళ్లకు ఏళ్లు గడిచిపోయాయి. ఏకంగా 20 ఏళ్లు కాలం పట్టింది. ఇంతలో పుణ్యకాలం కాస్తా గడిచిపోయింది. చివరకు ఈ ఏడాది జనవరి నెలాఖరులో హైకోర్టు డివిజన్ బెంచ్ తివారీని నిర్దోషిగా తేల్చింది. ఈ కేసులో తుది తీర్పును వెల్లడించింది. అతడిని నిర్ధోషిగా తేల్చింది. దీంతో ఈ నెల మూడో తేదీన జైలు అధికారులు విడుదల చేశారు.

అయితే, ఈకేసులో విచారణ చేపట్టిన హైకోర్టు ధర్మాసనం అధికారుల తీరును పూర్తిగా తప్పుబట్టింది. అధికారుల అలసత్వం వల్లే ఈ పరిస్థితి నెలకొందని వ్యాఖ్యానించింది. 14 ఏళ్ల జైలు శిక్ష పూర్తయిన తర్వాత కూడా సంబంధిత శాఖ అతడి గురించి పట్టించుకోకపోవడం నిర్లక్ష్యమే. ఈ కేసులో వాస్తవానికి తగిన ఆధారాలు కూడా ఏమీ కనిపించలేదు. వైద్యుల రిపోర్టులో అత్యాచారం జరిగినట్టు దాఖలాలు లేవు. ఆమె వద్ద నిందితుడి వీర్యం ఆనవాళ్లు కూడా లేవు. ఆమె గొంతు నొక్కి, కింద పడేస్తే గాయాలయినా కావాలి. ఆ దాఖలాలు కూడా వైద్యుల రిపోర్టులో ఏమీ లేదు. ఇది పూర్తిగా తప్పుడు కేసు అని భావిస్తున్నాం. అతడి తప్పు లేకున్నా 20 ఏళ్ల పాటు జైలు శిక్ష అనుభవించడం శోచనీయం‘ అంటూ అలహాబాద్ హైకోర్టు తుది తీర్పును వెల్లడించింది. హైకోర్టు తీర్పు అనంతరం అతడి విడుదలకు సంబంధించిన ప్రక్రియ పూర్తి కావడానికి మరో నెల సమయం పట్టింది. మొత్తానికి మార్చి 3వ తారీఖున అతడు జైలు నుంచి విడుదలయ్యాడు.

మార్చి మూడో తారీఖున నేను జైలు నుంచి విడుదలయ్యాను. నేను అస్సలు చదువుకోలేదు. నిరక్షరాస్యుడిని. జైల్లో ఉన్నప్పుడు మా వాళ్లకు ఉత్తరాలు రాయడానికి కూడా పక్క వాళ్ల సాయం తీసుకునేవాడిని. వాళ్లే నాకు వచ్చిన ఉత్తరాలను చదివి వినిపించేవాళ్లని ఆవేదన వ్యక్తం చేశాడు విష్ణు తివారీ. జైలుకు వెళ్లిన సమయంలో అంటే 20 ఏళ్ల క్రితం ఎస్టీడీ బూత్ లు మాత్రమే ఉండేవి. ఇప్పుడు ప్రతీ ఒక్కళ్ల చేతిలోనూ ఫోన్లు కనిపిస్తున్నాయి. జైల్లో ఉండగా మొబైల్స్ గురించి వినటమే కానీ, ఇంతవరకు చూడలేదన్నాడు విష్ణు తివారీ.

కుటుంబం గురించి ప్రస్తావించి విష్ణు తివారీ పశువులు కాస్తూ.. అమ్మానాన్నలు జీవనం సాగించేవాళ్లు. ఇప్పుడు ఆ పశువులు లేవు. మా అమ్మానాన్నలు కూడా లేరు. వాళ్లు మరణించిన సమయంలో కూడా నాకు బెయిల్ లభించలేదని కంటనీరు పెట్టుకున్నాడు తివారీ. చివరి చూపును కూడా చూసుకోలేకపోయానని ఆవేదన వ్యక్తం చేశారు. కాగా, ఈ ప్రపంచం అంతా నాకు కొత్తగా కనిపిస్తోంది. నేనెలా బతకాలో నాకే తెలియడం లేదన్నాడు. ఈ ఆధునిక ప్రపంచంలో ఏమాత్రం చదువు సంధ్యా లేకుండా 43 ఏళ్ల వయసులో కొత్త జీవితాన్ని ఎలా ప్రారంభించాలి? ’ అని విష్ణు తివారి ఆందోళన వ్యక్తం చేస్తున్నాడు.

ఇదిలావుంటే, అతడికి జరిగిన అన్యాయం గురించి తెలిసి పలు స్వచ్ఛంద సంస్థలు సాయం చేయడానికి ముందుకు వచ్చాయి. దుస్తులతోపాటు ఆర్థిక సాయం కూడా చేశాయి. ప్రస్తుతం ఆ డబ్బులతోనే అతడు తన జీవనాన్ని కొనసాగిస్తున్నాడు. దాతలు ఎవరైనా సాయం చేస్తే ఓ దుకాణం పెట్టుకుంటాననీ, మిగిలిన జీవితాన్ని గడుపుతానని ఆశాభావం వ్యక్తం చేస్తున్నాడు విష్ణు తివారీ.

Read Also..  ఆరు క్రిమినల్ కేసులను దాచి పెట్టిన మమత, బీజేపీ అభ్యర్థి సువెందు అధికారి ఫైర్

ట్రంప్‌ vs కమలా హారిస్.. భవిష్యత్తును నిర్ణయించేది ఆ 7 స్టేట్సే..
ట్రంప్‌ vs కమలా హారిస్.. భవిష్యత్తును నిర్ణయించేది ఆ 7 స్టేట్సే..
అమెరికా ఎన్నికల వేళ..గూగుల్‌ ఉద్యోగులకు సుందర్‌ పిచాయ్‌ వార్నింగ్
అమెరికా ఎన్నికల వేళ..గూగుల్‌ ఉద్యోగులకు సుందర్‌ పిచాయ్‌ వార్నింగ్
మళ్లీ రంగంలోకి.. ఆ ప్రాంతంలోని భూ ఆక్రమణలపై హైడ్రా ఫోకస్..
మళ్లీ రంగంలోకి.. ఆ ప్రాంతంలోని భూ ఆక్రమణలపై హైడ్రా ఫోకస్..
ఇన్‌స్టాగ్రమ్‌లో పరిచయం చేసుకున్నాడు.. చాటింగ్ చేశాడు.. చివరికి
ఇన్‌స్టాగ్రమ్‌లో పరిచయం చేసుకున్నాడు.. చాటింగ్ చేశాడు.. చివరికి
యూపీ యోధాస్‌పై జైపూర్‌‌ ఉత్కంఠ విజయం..
యూపీ యోధాస్‌పై జైపూర్‌‌ ఉత్కంఠ విజయం..
సామ్‌సంగ్‌ నుంచి అద్భుతం.. 280 ఎంపీ కెమెరాతో వస్తోన్న కొత్త ఫోన్‌
సామ్‌సంగ్‌ నుంచి అద్భుతం.. 280 ఎంపీ కెమెరాతో వస్తోన్న కొత్త ఫోన్‌
యుద్ధాలపై అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలు ఎలాంటి ప్రభావం చూపుతాయి
యుద్ధాలపై అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలు ఎలాంటి ప్రభావం చూపుతాయి
శ్రేయాస్ అయ్యర్ ఏ జట్టు తరపున బరిలోకి దిగనున్నాడంటే?
శ్రేయాస్ అయ్యర్ ఏ జట్టు తరపున బరిలోకి దిగనున్నాడంటే?
పంట భలే ఏపుగా పెరిగింది అనుకునేరు.. లోపలకెళ్లి చూస్తే
పంట భలే ఏపుగా పెరిగింది అనుకునేరు.. లోపలకెళ్లి చూస్తే
మన దేశంలో కులవ్యవస్థ బలంగా ఉంది: రాహుల్‌ గాంధీ
మన దేశంలో కులవ్యవస్థ బలంగా ఉంది: రాహుల్‌ గాంధీ