ఆరు క్రిమినల్ కేసులను దాచి పెట్టిన మమత, బీజేపీ అభ్యర్థి సువెందు అధికారి ఫైర్
బెంగాల్ సీఎం మమత తన ఎన్నికల అఫిడవిట్ లో తనపై గల 6 క్రిమినల్ కేసుల గురించి ప్రస్తావించకుండా దాచిపెట్టారని నందిగ్రామ్ నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న సువెందు అధికారి ఆరోపించారు.
బెంగాల్ సీఎం మమత తన ఎన్నికల అఫిడవిట్ లో తనపై గల 6 క్రిమినల్ కేసుల గురించి ప్రస్తావించకుండా దాచిపెట్టారని నందిగ్రామ్ నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న సువెందు అధికారి ఆరోపించారు. ఈ నియోజకవర్గం నుంచి ఆమె నామినేషన్ వేయడంపై ఆయన అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ.. ఈ క్రిమినల్ కేసుల విషయాన్ని ఆమె కావాలనే దాచారని అన్నారు. దీనిపై తను ఈసీకి ఫిర్యాదు చేసినట్టు ఆయన చెప్పారు. ‘ఆమె తృణమూల్ కాంగ్రెస్ అభ్యర్థి.. 2018 లో ఆమెపై 5 ఎఫ్ ఐ ఆర్ లు, అంతకుముందు సీబీఐ నుంచి ఓ ఎఫ్ ఐ ఆర్ దాఖలయ్యాయి.. వీటిలో ఒకదానిని కొట్టివేయాల్సిందిగా కోరుతూ ఆమె కలకత్తా హైకోర్టుకు వెళ్లగా..కోర్టు దాన్ని తిరస్కరించింది ‘ అని ఆయన వెల్లడించారు. ఇందుకు అన్ని ఆధారాలను తాను ఎన్నికల కమిషన్ కి సమర్పించానని, దీనిపై ఆ సంస్థే నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని ఆయన చెప్పారు.ఈ కేసులు పెండింగులో ఉన్నాయా అన్న విషయాన్ని కూడా ఈసీ పరిశీలిస్తుందని విశ్వసిస్తున్నానని అన్నారు.
2018 లో అస్సాంలోని వేర్వేరు పోలీస్ స్టేషన్లలో మమతపై కేసులు నమోదయ్యాయి. 2008 లో కోల్ కతా లో సీబీఐ ఓ కేసు నమోదు చేసింది.2018 నాటి విషయానికి వస్తే ఎన్ ఆర్ సీ తుది ముసాయిదా ప్రచురితమైనప్పటి నుంచి రెండు కేసులతో సహా మొత్తం 5 కేసులను పోలీసులు ఆమెపై పెట్టారు. ఆ రాష్ట్రంలో ఎన్ ఆర్ సీ అమలు విషయంలో ఆమె అల్లర్లను ప్రేరేపించారని, మతం, కులం, జన్మ స్థలం వంటివాటిని సాకుగా చూపి రెండు వర్గాల మధ్య వైషమ్యాలు సృష్టించడానికి ప్రయత్నించారని ఈ ఎఫ్ ఐ ఆర్ లలో పేర్కొన్నారు. ఆమెతో బాటు మరో 8 మంది తృణమూల్ కాంగ్రెస్ కార్యకర్తలపై కూడా ఖాకీలు కేసులు నమోదు చేశారు. అయితే తనపై వచ్చిన ఆరోపణలను దీదీ తిరస్కరించారు. ఇవి రాజకీయ దురుద్దేశంతో కూడుకొమ్మవని నాడు వ్యాఖ్యానించారు. కాగా- ఈ క్రిమినల్ కేసుల గురించి ఆమె తన ఎన్నికల అఫిడవిట్ లో ప్రస్తావించకుండా దాచి పెట్టారని సువెందు అధికారి అభ్యంతరం వ్యక్తం చేశారు.
మరిన్ని ఇక్కడ చదవండి: Manchu Hero Turns Villain : తండ్రి బాటలో నడుస్తున్న మంచువారబ్బాయి .. మెగా హీరోకు విలన్ గా ఎంట్రీ ..?