గసగసాల ముసుగులో నిషేధిత మాదక ద్రవ్యాలు.. మామిడి తోటలో విచ్చలవిడిగా డ్రగ్స్.. పూర్తి వివరాలు ఇవిగో

ఏపీలో డ్రగ్‌ దందా కాకరేపుతోంది. పబ్బుల్లో, బార్లలోనే కాదు. ఈసారి కొంత వినూత్నంగా పంట పొలాల్లో. అవును… పంట పొలాలు మత్తు మందు తయారీ కేంద్రాలుగా మార్చేస్తున్నారు కొందరు కేటుగాళ్లు..

గసగసాల ముసుగులో నిషేధిత మాదక ద్రవ్యాలు.. మామిడి తోటలో విచ్చలవిడిగా డ్రగ్స్.. పూర్తి వివరాలు ఇవిగో
Opium Cultivation
Follow us

|

Updated on: Mar 16, 2021 | 10:23 AM

ఏపీలో డ్రగ్‌ దందా కాకరేపుతోంది. పబ్బుల్లో, బార్లలోనే కాదు. ఈసారి కొంత వినూత్నంగా పంట పొలాల్లో. అవును… పంట పొలాలు మత్తు మందు తయారీ కేంద్రాలుగా మార్చేస్తున్నారు కొందరు కేటుగాళ్లు.. గసగసాల ముసుగులో నిషేధిత మాదక ద్రవ్యాలు సాగు చేస్తున్నారు. గుట్టుచప్పుడు కాకుండా మారు మూల ప్రాంతంలో సాగుతున్న మత్తు పంట బండారాన్ని బట్టబయలు చేశారు అబ్కారీ అధికారులు. దీని వెనకాల దాగి ఉన్న అసలు సూత్రధారులను పట్టుకునే పనిలోపడ్డారు అధికారులు.

చిత్తూరు జిల్లా మదనపల్లెలో కోతకు వచ్చిన డ్రగ్స్‌ పంటను ఆంధ్రప్రదేశ్ ఎక్సైజ్ అధికారులు బట్టబయలు చేశారు. మామిడి తోటల మాటున గసగసాల పంటను అధికారులు గుర్తించారు. ఓపీఎం పోపీ అని పిలిచే గసగసాలు పంట సాగు చేస్తున్నట్లు సమాచారం అందుకున్న అబ్కారీ అధికారులు దాడులు చేసిన పంటను స్వాధీనం చేసుకున్నారు. అయితే, ఈ దందా వెనుక అంతర్జాతీయ డ్రగ్స్ మాఫియా హస్తమున్నట్లు అధికారులు అనుమానిస్తున్నారు. బెంగళూరు కేంద్రంగా మరో ముఠా సహకరిస్తూ స్థానికంగా పండించేలా ఏర్పాట్లు చేసింది. పొరుగునే ఉన్న కోలారు జిల్లాతో పాటు చిత్తూరు జిల్లా పడమటి ప్రాంతాల్లో బెంగళూరు ముఠా ఏజెంట్లు వందలాదిమంది ఉన్నట్లు సమాచారం. ఈ దందా ఆరేళ్లుగా సాగుతున్నట్లు అధికారులు గుర్తించారు.

అసలు ఎలా బయటపడింది

ఇదిలావుంటే, మదనపల్లె పరిసర ప్రాంతాల్లో చాలా చోట్ల అల్లనేరేడు, మొక్కజొన్న, టమాటో పంట మధ్యలో అంతర పంటగా దీన్ని సాగుచేస్తున్నారు. ఎవరికీ తెలికుండా కాయలు దిగుబడి రాగానే కోసి ఎగుమతి చేస్తున్నారు. తాజాగా పదిసెంట్ల పరిధిలో సాగు చేసి ఎగుమతికి సిద్ధంగా ఉన్న కాయలతో పాటు గసగసాల మొక్కల్ని పీకించేసి తగులబెట్టారు అధికారులు. అయితే, భూ యజమాని ఎవరు? పొలంలో పంట వేసిన రైతు ఎవరు? వీరిని ఆ పంట వేయమని సాగు చేయిచిందెవరు? అన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.

నిషేధిత డ్రగ్స్ తయారీకి ఉపయోగించే గసగసాల పంట పండించిన ముగ్గురు రైతులపై కేసులు నమోదు చేశామని స్పెషల్ ఎన్ ఫోర్స్ మెంట్ అధికారులు తెలిపారు. నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకో ట్రోపిక్ సబ్ స్టాన్సెన్స్ యాక్ట్ 1985 కింద కేసులు నమోదు చేశామన్నారు. అయితే, ఈ పంట పండించకూడదన్న విషయం తమకు తెలీదని తమకు అవగాహన కల్పించడంలో అధికారులు విఫలమయ్యారని ఆరోపిస్తున్నారు రైతు సంఘాల నాయకులు.

గసగసాల ప్రయోజనాలు

ఇదిలావుంటే, మత్తు పంట గసగసాల సాగుకు భారతదేశంలో అనుమతి లేదు. ఇదీ కేవలం ఆస్ట్రేలియాలోని టాస్మానియా, అమెరికా, యూఏఈలో మాత్రం ఈ సాగు చేస్తున్నారు. ఆఫ్ఘనిస్తాన్, మయన్మార్, పాకిస్తాన్ తదితర దేశాల్లో పెద్ద ఎత్తున సాగవుతోంది. ఇందుకు సంబంధించి గతంలోనే అంతర్జాతీయ మీడియా బయటపెట్టింది. ఈ మొక్క నుంచి గసగసాలతో పాటు కాయ నుంచి జిగురు, బెరడులను కూడా సేకరిస్తారు. కాయ ఏపుగా పెరిగినపుడు దానిపై బ్లేడ్లతో గాట్లు పెట్టి అందులో నుంచి వెలువడే జిగురును సేకరిస్తారు. దీన్ని కొకైన్, హెరాయిన్ తదితరాల తయారీకి ఉపయోగిస్తారు. కేంద్ర ప్రభుత్వ ఔషధ తయారీ సంస్థ అనుమతులున్న రాష్ట్రాల్లో మాత్రం వీటిని సేకరించి వైద్యపరమైన మత్తు మందులకు వినియోగిస్తారు. నార్కోటిక్ యాక్ట్ ప్రకారం ఈ పంట సాగు చేస్తే కఠిన చర్యలు తప్పవంటున్నారు పోలీసులు.

గతంలో బయటపడ్డ కేసులు

చిత్తూరు జిల్లా మదనపల్లి, చౌడేపల్లి మండలాల్లో 2015లోనూ పట్టుకున్న అధికారులు పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. 1985లో కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నార్కొటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రోపిక్ సబ్‌స్టాన్స్ యాక్ట్ కింద కేసులు నమోదు చేశారు. దేశంలో ఎవరైనా ఎక్కడైనా అనుమతి లేకుండా ఓపీఎం పాపీ సాగుచేసినా, నిల్వ ఉంచినా, రవాణా చేసినా, అమ్మినా తీవ్రమైన నేరమవుతుంది. నార్కొటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రోపిక్ సబ్‌స్టాన్స్ చట్టం ప్రకారం కఠినమైన నాన్-బెయిలబుల్ కేసులు నమోదు చేస్తారు. దోషులుగా తేలితే 10

భారత్‌లో వ్యాపార మార్గాలు

మరోవైపు, కర్ణాటకలోని కోలారు, చిత్తూరు జిల్లాలోని పుంగనూరు ప్రాంతాల్లో బెంగళూరు ముఠాకు చెందిన ఏజెంట్లు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. వీరు కేవలం నాలుగైదేళ్లలో లక్షాధికారులుగా మారారు. బెంగళూరు నుంచి విత్తనాలను స్థానిక రైతులకు అందిస్తున్నారు. తర్వాత సరుకును బెంగళూరుకు చేరవేస్తున్నారు. బెరడు నుంచి పౌడర్‌ను స్థానికంగానే తయా రు చేస్తున్నట్లు ఎక్సైజ్ అధికారులు గుర్తించారు. ఇళ్లలోని పెద్ద గ్రైండర్లతో పౌడర్‌ను తయారు చేసి ప్యాకెట్లుగా చేసి బస్సుల్లోనే బెంగళూరుకు పంపుతున్నట్లు తెలుస్తోంది. స్థానిక ఏజెంట్ల ద్వారా బెంగళూరులోని ప్రధాన ముఠాను పట్టుకునే పనిలో ఎక్సైజ్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు నిమగ్నమైనట్లు తెలిసింది. బెంగళూరులోని ముఠాను పట్టుకుంటే అంతర్జాతీయ డ్రగ్స్ మాఫియా లింకులు బయటపడే అవకాశాలున్నాయి.

Also Read:  MLA Kethireddy Venkatarami Reddy: మొన్నటివరకు సోషల్ మీడియాలో క్రేజ్.. ఇప్పుడు హైకమాండ్ క్లాస్..!

బైక్‌పై వెనుక కూర్చున్న వ్యక్తి పడిపోతే పట్టించుకోకుండా వెళ్లిపోయాడు.. సైబరాబాద్ పోలీసులు ఏం చేశారంటే..?

రాజమౌళికి ఎన్ని కోట్ల ఆస్తి ఉందో తెలుసా..? తెలిస్తే అవాక్ అవుతారు
రాజమౌళికి ఎన్ని కోట్ల ఆస్తి ఉందో తెలుసా..? తెలిస్తే అవాక్ అవుతారు
బాబోయ్ ఎండలు.. వచ్చే రెండు నెలలు అగ్ని గుండమే.. జర జాగ్రత్త!
బాబోయ్ ఎండలు.. వచ్చే రెండు నెలలు అగ్ని గుండమే.. జర జాగ్రత్త!
పిల్లలకు చదివింది బాగా గుర్తుండాలా.. బ్లూబెర్రీలు తినిపించండి..
పిల్లలకు చదివింది బాగా గుర్తుండాలా.. బ్లూబెర్రీలు తినిపించండి..
మీన రాశిలో రాహువుతో శుక్రుడి యుతి.. వారికి పట్టిందల్లా బంగారమే..
మీన రాశిలో రాహువుతో శుక్రుడి యుతి.. వారికి పట్టిందల్లా బంగారమే..
ఆ విషయంలో ఇంకా వెనకబడే ఉన్న తెలంగాణ యువత
ఆ విషయంలో ఇంకా వెనకబడే ఉన్న తెలంగాణ యువత
12జీబీ ర్యామ్‌లో కొత్త స్మార్ట్‌ఫోన్ లాంచ్! అద్భుతమైన ఫీచర్స్‌
12జీబీ ర్యామ్‌లో కొత్త స్మార్ట్‌ఫోన్ లాంచ్! అద్భుతమైన ఫీచర్స్‌
30 మంది ఎమ్మెల్యేలు టచ్ లో ఉన్నారు.. బాంబు పేల్చిన కోమటిరెడ్డి
30 మంది ఎమ్మెల్యేలు టచ్ లో ఉన్నారు.. బాంబు పేల్చిన కోమటిరెడ్డి
హార్దిక్‌, రోహిత్ కాదు..ముంబై కెప్టెన్‌గా తెరపైకి మరొక కొత్త పేరు
హార్దిక్‌, రోహిత్ కాదు..ముంబై కెప్టెన్‌గా తెరపైకి మరొక కొత్త పేరు
ఐటీ సంస్థలను ఆకర్షించేందుకు కేరళ కొత్త ప్లాన్..!
ఐటీ సంస్థలను ఆకర్షించేందుకు కేరళ కొత్త ప్లాన్..!
లులు మాల్‌లో ఐస్‌ క్రీం కొన్న కస్టమర్‌..కదులుతున్న వాటిని చూసి..
లులు మాల్‌లో ఐస్‌ క్రీం కొన్న కస్టమర్‌..కదులుతున్న వాటిని చూసి..
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు