బైక్‌పై వెనుక కూర్చున్న వ్యక్తి పడిపోతే పట్టించుకోకుండా వెళ్లిపోయాడు.. సైబరాబాద్ పోలీసులు ఏం చేశారంటే..?
సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో పోలీసులు.. ట్రాఫిక్ రూల్స్ విషయంలో కఠినంగా వ్యవహరిస్తున్నారు. లైసెన్స్ లేకపోయినా.. తాగి వాహనం నడిపినా..
సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో పోలీసులు.. ట్రాఫిక్ రూల్స్ విషయంలో కఠినంగా వ్యవహరిస్తున్నారు. లైసెన్స్ లేకపోయినా.. తాగి వాహనం నడిపినా.. జైలుకు వెళ్లడం తప్పదని హెచ్చరిస్తున్నారు. సొంత వాహనదారుడే కాదు.. లైసెన్స్ లేని వారికి బండి ఇచ్చినా.. బాధ్యత వహించాల్సి ఉంటుందని సూచిస్తున్నారు. ఎవరు రూల్స్ బ్రేక్ చేసినా సహించేది లేదంటున్నారు. ప్రమాదాలకు పాల్పడితే, వాహనం ఇచ్చిన వ్యక్తులు, తల్లిదండ్రులు క్రిమినల్ కేసులు ఎదుర్కొవల్సిందేనని హెచ్చరిస్తున్నారు. ఈ తరహా కేసులు ఇటీవల ఎక్కువగా నమోదవుతున్నాయి. రోడ్డు ప్రమాదానికి కారణమైన వ్యక్తిపై 304 పార్ట్ 2 కింద కేసు నమోదు చేశారు పోలీసులు. ప్రమాదం జరిగిన తర్వాత స్పందించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించినందుకు చర్యలు తీసుకోబోతున్నారు.
డ్రైవింగ్ లైసెన్స్ లేని వ్యక్తి బైక్ నడుపుతూ, వెనకాల కూర్చున్న రామ్ అనే వ్యక్తి బైక్‌పై నుంచి పడిపోతే.. పట్టించుకోకుండా వెళ్ళిపోయాడు రమేశ్. పోలీసులు, అంబులెన్స్‌కు కూడా సమాచారం ఇవ్వలేదు. రోడ్ యాక్సిడెంట్స్ పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న వారిని సీసీ ఫుటేజ్ ఆధారంగా గుర్తించి 304 పార్ట్ 2 కింద కేసులు నమోదు చేస్తున్నారు సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు. రోడ్డు మీ సొంతం కాదు.. రోడ్లపైకి వచ్చి ఇష్టమొచ్చినట్లు వ్యవహరిస్తే.. చూస్తూ ఊరుకోబోమని హెచ్చరిస్తున్నారు. ప్రమాదానికి కారణమైతే.. తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని చెప్తున్నారు. రోడ్డు ప్రమాదాల నివారణకు ఇప్పటికే పెద్ద ఎత్తున అవగాహన కల్పిస్తున్నారు. డ్రంకెన్ డ్రైవ్‌పై ప్రత్యేక తనిఖీలు నిర్వహిస్తున్నారు. తాగి వాహనం నడిపి.. పట్టుబడిన మందుబాబులకు జైలు శిక్షతో పాటు 10 వేల రూపాయల జరిమానా విధిస్తున్నారు. నిర్లక్ష్యంగా వాహనాలు నడిపి ప్రాణాలు పోగొట్టుకున్న వారి వివరాలు, వీడియోలను సోషల్ మీడియాలో పెట్టి ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నారు. 18 ఏళ్లు నిండి.. డ్రైవింగ్ వచ్చిన ప్రతి ఒక్కరూ లైసెన్స్ తీసుకోవాలని సూచిస్తున్నారు.
Also Read: బయట నుంచి చూస్తే టమాట పంటేగా అనుకుంటారు.. లోపలికి వెళ్లి చూసిన పోలీసుల మైండ్ బ్లాంక్ అయ్యింది
Crime News: భార్య ఫోటో, ఫోన్ నంబర్ ఉన్న పోస్టర్లను ఈ ప్రబుద్దుడు ఊరంతా అంటించాడు.. ఎందుకంటే..?